Daily Current Affairs in Telugu 17 May-2022
భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల సమావేశం :

షాంఘై సహకార సంస్థ (ఎస్సీ) సభ్య దేశాలకు చెందిన తీవ్రవాద వ్యతిరేక చర్యల నిపుణులతో భారత్ అధ్యక్షతన డిల్లీలో సమావేశం జరిగింది. ప్రాంతీయంగా చెలరేగుతున్న కల్లోలాలను సమర్థంగా ఎదుర్కోవడం ఎలాగనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ఆఫ్గానిస్తాన్ లోని పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. ఎస్.సి.వో లో రష్యా, చైనా, భారత్, పాకిస్థాన్, కెర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు సభ్యులుగా ఉండగా, ఆఫ్గానిస్థాన్ పరిశీలక దేశంగా వ్యవహరిస్తోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ అధ్యక్షతన దిల్లీలో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల సమావేశం
ఎవరు: భారత్
ఎప్పుడు :మే 17
రాయల్ రాలెంజర్స్ బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ :

దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ రాయల్ రాలెంజర్స్ బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న తొలి ఆటగాళ్లుగా నిలిచారు. వీళ్లిద్దరికి ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లో చోటు దక్కిందన్న విషయాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పంచుకున్నాడు. ” వినూత్నమైన ఆటతో ఏబీ క్రికెట్ లో కొత్త పుంతలు తొక్కించాడు. దూకుడుగా ఆడాలన్న ఆర్సీబీ నినాదానికి ఏబీ అసలైన నిర్వచన౦ ఇచ్చారు. ఇక గేల్ విధ్వంసక ఆట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరూ జీవితకాల బెంగళూరు మీదే కాదు. ఐపీఎల్ మొత్తం మీద తమదైన ముద్ర చేశారు’ అని విరాట్ అన్నాను. దక్షిణాఫ్రికా స్టార్ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆత్మబీ జట్టులో కీలక ఆటగాడిగా ఉండగా కరీబియన్ వీరుడు ‘గేల్ 2011 నుంచి 2017 వరకు ఈ ప్రాంభైజీకి ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాయల్ రాలెంజర్స్ బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్
ఎవరు: క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్
ఎప్పుడు :మే 17
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఛైర్మన్ గా ఎస్ఎస్ ముంద్రా నియామకం :

సెబీ ఆమోదానికి లోబడి కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ గా ఉన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ ముంద్రా గారి నియామకానికి ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకటించింది. SS ముంద్రా మూడేళ్ల పనిని పూర్తి చేసిన తర్వాత, జూలై 30, 2017న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పదవీ విరమణ చేశారు. అంతకు ముందు, అతను జూలై 2014లో బ్యాంక్ ఆఫ్ బరోడా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు. BSE లిలిమిటెడ్, దీనిని ఇంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా పిలుస్తారు. ఇది ముంబై లో ని దలాల్ స్ట్రీట్ లో ఉన్న భారతీయ ఎక్స్చేంజ్ బ్యాంక్.
- బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపన : 1875
- బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించింది : ప్రేమ్ చంద్ రాయ్ చాంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఛైర్మన్ గా ఎస్ఎస్ ముంద్రా నియామకం
ఎవరు: ఎస్ఎస్ ముంద్రా
ఎప్పుడు :మే 17
దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించిన ఎల్.ఐ.సీ :

ఐపీఓ లిస్టింగ్ ఎల్.ఐ.సీ దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.5.54లక్షల కోట్లు. మార్కెట్ విలువ పరంగా.. హెచ్‌యూఎల్ (రూ.5.27లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.4.94 లక్షల కోట్లు), ఎస్బీఐ (రూ.4.17లక్షల కోట్లు), హెచ్ఐఎఫ్సీ (రూ.3.97లక్షల కోట్లు) కంటే ఎల్ఎస్ఐసీ పెద్ద కంపెనీ అని బీఎస్ ఈ డేటా వెల్లడించింది. రూ.17.12లక్షల కోట్లతో రిలయన్స్ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత టీసీఎస్, హెచౌడీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
- ఎల్.ఐ.సీ స్థాపన : 1956
- ఎల్.ఐ.సీ ప్రధాన కార్యాలయం : ముంబై
- ఎల్.ఐ.సీ చైర్ పర్సన్ :ఎం.ఆర్ కుమార్
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించిన ఎల్.ఐ.సీ
ఎవరు: ఎల్.ఐ.సీ
ఎప్పుడు :మే 17
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జుల్ భూయాన్ నియామకం :

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జుల్ భూయాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న ఉన్న సతీష్ చంద్రమిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజియం బదిలీలను సిఫార్సు చేసింది.అలాగే వివిధ రాష్ట్రాల యొక్క హైకోర్ట్ లకు ప్రధాన న్యాయమూర్తి ల నియామకం జరిగింది.కింది వారిలో
- ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విపిన్ సంగీ
- సాహిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అంజాద్ సయీద్
- రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్.ఎస్. షిండే
- గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా కాస్మిన్ ఛాయ.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జుల్ భూయాన్ నియామకం
ఎవరు: ఉజ్జుల్ భూయాన్
ఎక్కడ: తెలంగాణ రాష్ట్రం
ఎప్పుడు :మే 17
హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించిన అమెరికా సైన్యం :

అత్యంత విజయవంతంగా హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ ను అమెరికా సైన్యం పరీక్షించింది. ధ్వని వేగం కన్నా అయిదు రెట్ల అధిక వేగంతో ఆ వెపన్ దూసుకెళ్లినట్లు వైమానిక దళం పేర్కొన్నది. మూడు విఫల పరీక్షల తర్వాత ఎట్టకేలకు ప్రోటోటైప్ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించారు. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వద్ద ఈ పరీక్ష జరిగింది. బీ 52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ ద్వారా ఏజీఎం – 183ఏ ఎయిర్ లాంచ్ రాపిడ్ రెస్పాన్స్ వెపన్ సిస్టమన్ను పరీక్షించారు.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్ డిసి :
- అమెరికా దేశ కరెన్సీ :యుఎస్ డాలర్
- అమెరికా దేశ అద్యక్షుడు :జో బిడెన్
- అమెరికా దేశ ఉపద్యక్షురాలు : కమలా హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి: హైపర్ సోనిక్ మిస్సైల్ సిస్టమ్ ను విజయవంతంగా పరీక్షించిన అమెరికా సైన్యం
ఎవరు: అమెరికా సైన్యం
ఎప్పుడు :మే 17
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |