
Daily Current Affairs in Telugu 04-03-2022
తొలిసారి ఇంటర్నేషన్లల్ ట్రైబల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆతిత్యం ఇవ్వనున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర౦:

అరుణాచల్ ప్రదేస్ రాష్ట్రము తొలి సారిగా ఇంటర్నేషన్లల్ ట్రైబల్ ఫిలిం ఫెస్టివల్ (ITFF) కు ఆథిత్యం ఇవ్వనుంది. ఇది గిరిజన మరియు గిరిజనేతర చిత్ర నిర్మాణాలచే వివిధ భాషలతో రూపొందించిన చలన చిత్రాలను ప్రదర్శిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే ఇవినిర్వహించబడుతోంది.మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మద్దతుతో ,రెండు రోజుల[పాటు జరిగే ఈ ఉత్సవంలో గిరిజన కళలు మరియు వారి సంస్కృతికి సంబధించిన చలన చిత్రాలు మరియు డాక్యుమెంటరీ లను ప్రదర్శిస్తుంది .అరుణాచల్ ప్రదేశ్ దిరాంగ్ లో మార్చ్ 05 నుంచి పండుగ ప్రారంబం కానుంది.
- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని : ఇటానగర్
- అరుణాచల్ ప్రదేశ్ సిఎం : పెమా ఖండు
క్విక్ రివ్యు :
ఏమిటి: తొలిసారి ఇంటర్నేషన్లల్ ట్రైబల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆతిత్యం ఇవ్వనున్న అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర౦
ఎవరు: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: అరుణా చల్ ప్రదేశ్
ఎప్పుడు:మార్చ్ 04
రాష్ట్రము ను డిస్త్రబుల్ ఏరియా గా ప్రకటించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం :

అస్సాం రాష్ట్రము ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల (ప్రత్యెక అధికారాలు) చట్టం ,1958(AFSP) ని మరో ఆరు నెలల పాటు పొడగించింది. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వచ్చింది. అస్సాం రాష్ట్ర పరిపాలన చివరిసారిగా గత ఏడాది ఆగస్టు 28న రాష్ట్ర “డిస్టర్బ్ ఏరియా “హోదాను మరో ఆరు నెలల పాటు పునరుద్దరించింది.
- అస్సాం రాష్ట్ర రాజధాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర సిఎం: హిమంత బిశ్వ శర్మ
- అస్సాం రాష్ట్ర గవర్నర్ : జగదీశ్ ముఖి
క్విక్ రివ్యు :
ఏమిటి: రాష్ట్రము ను డిస్త్రబుల్ ఏరియా గా ప్రకటించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: అస్సాం రాష్ట్ర౦
ఎప్పుడు:మార్చ్ 04
జెట్ ఎయిర్ వేస్ సియివో గా సంజీవ్ కపూర్ నియామకం :

జెట్ ఎయిర్ వేస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సియివో గా సంజీవ్ కపూర్ గారు నియమితులయ్యారు. ఏప్రిల్ 04 న ఆయన బాద్యతలు చేపడతారని సంస్థ తెలిపింది. కంపెని సిఎఫ్ వో గా శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ పూర్వ సియివో విపులా గుణ తిలకే నియమించిన కొన్ని రోజుల్లోనే జెట్ ఎయిర్ వేస్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అద్యక్షుడిగా సంజీవ్ కపూర్ వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు స్పై జెట్ గో ఎయిర్ ,విస్తారా వంటి దేశీయ విమానయాన సంస్థల్లో ఆయన పలు పదవులు నిర్వహించారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్ వేస్ యొక్క కార్యకలాపాలు 2019 న నిలిచిపోయాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: జెట్ ఎయిర్ వేస్ సియివో గా సంజీవ్ కపూర్ నియామకం
ఎవరు: సంజీవ్ కపూర్
ఎప్పుడు: మార్చ్ 04
ప్రూటి కంపెని బ్రాండ్ అంబాసిడర్ గా టాలివుడ్ హీరో రామ్ చరణ్ ఎంపిక :

మామిడి రసం బ్రాండ్ ఫ్రూటి ప్రచార కర్తగా టాలివుడ్ సిని హీరో రామ్ చరణ్ ను ఎంపిక చేసుకున్నట్లు పార్లే ఆగ్రో సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఆయనతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే అలియా భట్ ఫ్రూటికి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఈ బ్రాండ్ ను వినియోగ దారుల కు చేరవేస్తారని పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రూటి కంపెని బ్రాండ్ అంబాసిడర్ గా టాలివుడ్ హీరో రామ్ చరణ్ ఎంపిక
ఎవరు: రామ్ చరణ్
ఎప్పుడు: మార్చ్ 04
మాజీ చార్మి చీఫ్ జనరల్ సునిత్ ప్రాన్సిస్ రోడ్రిగ్స్ కన్నుమూత :

మాజీ చార్మి చీఫ్ జనరల్ సునిత్ ప్రాన్సిస్ రోడ్రిగ్స్ కన్నుమూసారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. 1990మరియు 1993 మద్య భారత సైన్యానికి నాయకత్వం వహించి 2004 మరియు 2010 మద్య పంజాబ్ రాష్ట్ర గవర్నర్ గా జనరల్ రిటైర్డ్ సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ పని చేసారు. సైన్యంలో తన నలభై ఏళ్ల విశిష్ట సేవతో పాటు అతను జాతీయ భద్రతా సలహా బోర్డులో రెండు పర్యాయాలు పనిచేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ చార్మి చీఫ్ జనరల్ సునిత్ ప్రాన్సిస్ రోడ్రిగ్స్ కన్నుమూత
ఎవరు: సునిత్ ప్రాన్సిస్ రోడ్రిగ్స్
ఎప్పుడు: మార్చ్ 04
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూత :

లెగ్ స్పిన్ తో క్రికట్ ను ఉర్రూతలు ఊగించిన షేన్ వార్న్ ఇక లేడు. క్రికెట్ ప్రేమికులను దిగ్బ్రాంతికి గురి చేస్తూ 52 ఏళ్ల ఈ ఆస్ట్రేలియా మాజీ అతగాడు మార్చ్ 03న తుదిశ్వాస విడిచాడు. థాయ్ ల్యాండ్ లో ఆయన గుండె పోటుతో మరణించినట్లు తెలుస్తుంది. ఫాస్ట్ బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న సమయంలో పేసర్లకు స్వర్గ ధామం లాంటి ఆస్ట్రేలియా పిచ్ లపైన తన లెగ్ స్పిన్ తో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈయన 1992 లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన వార్న్ 145 టెస్టు లలో 708 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆతను 194వన్డే లలో 293 వికెట్లు సాధించాడు.2007 లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2013 లో అన్ని ఫార్మాట్ లకు గడ్ బై చెప్పాడు.1999 వన్డే ప్రపంచ కప్ లో ఆసిస్ విజేతగా నిలవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ కన్నుమూత
ఎవరు: షేన్ వార్న్
ఎక్కడ: థాయ్ ల్యాండ్
ఎప్పుడు: మార్చ్ 04
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |