Daily Current Affairs in Telugu 18-02-2021
ఐపిఎల్ వేలం చరిత్ర లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ :
దక్షిణాఫ్రికా ఫేస్ ఆల్ రౌండర్ క్రిస్ స్మోరిస్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపిఎల్ వేలం చరిత్ర లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర ను నమోదు చేసాడు. కనీస ధర రూ 75 లక్షలుగా వేలం లో దిగిన అతన్ని రాజస్తాన్ రాయల్స్ ఏకంగా రూ.16.25 కోట్లకు సొంతం చేసుకుంది. అ౦తకుముందు ఆ రికార్డు యువరాజ్ సింగ్ (2015 లో డిల్లీ క్యాపిటల్స్ రూ.16కోట్లు) పేరు మీద ఉంది. 70 ఐపిఎల్ మ్యాచ్ లో 80వికెట్లతో పాటు 551 పరుగులు చేసిన అతని కోసం ముంబై ,బెంగళూర్ ,పంజాబ్,తీవ్రంగా పోటీ పద్దపటికి చివరికి రాజస్తాన్ దక్కించుకుంది. న్యూజిలాండ్ యువ పేసర్ జేమి సన్ ఊహించని విధంగా ధర దక్కింది. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టిన అతని కోసం అర్సిబి ఏకంగా రూ.15కోట్లు వెచ్చించింది. ఆరున్నర పైగా ఎత్తులో ఖచ్చితమైన పేస్ తో ప్రత్యర్థి భయపెట్టే బ్యాట్ ను రాణించగలను .ఒంటి చేత్తో మ్యాచ్ పలితాన్ని మార్చగల ఆస్త్రేలియ విద్వంసక ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ కు భారీ ధర లబించింది. గత సీజన్ లో ఫెలవ ప్రదర్శన చేసినప్పటికీ అతని కోసం ఆర్సిబి రూ.14.25 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు జె రిచర్డ్స్ సన్ అనూహ్యంగా అధిక మొత్తానికి సొంతం చేసుకున్నారు.గత బిగ్ బాష్ లీగ్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన అతని కోసం పంజాబ్ రూ.14 కోట్లు చెల్లించడం విశేషం. అదే జట్టు ఇంకా అంతర్జాతీయ అరంగ్రేటం చేయని ఆస్ట్రేలియా పేసర్ మెరెడిత్ రూ 8కోట్లను కైవసం చేసుకుంది. అతర్జతియ క్రికెట్ ఆడకుండా ణే ఐపిఎల్ వేలం లో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.
- కాగా ఇందులో వేలం లో పాల్గొన్న ఆటగాళ్ళ సంఖ్య -292
- అమ్ముడైన ఆటగాళ్ళ సంఖ్య -57
- అమ్ముడైన విదేశీ ఆటగాళ్ళు -22
- వేలం లో గరిష్టంగా పంజాబ్ కొన్న ఆటగాళ్ళ సంఖ్య హైదరాబద్ లో కనిష్టంగా ముగ్గురినే తీసుకుంది.-9
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపిఎల్ వేలం చరిత్ర లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
ఎవరు: ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్
ఎక్కడ: ఇండియా
ఎప్పుడు: ఫిబ్రవరి 18
టైం మ్యాగజిన్ 100నెక్ట్స్ జాబితాలో ఐదుగురూ భారతీయ మూలలున్న వ్యక్తులకు దక్కిన చోటు :
విదేశాల్లో వివిధ రంగాల్లో సత్తా చాటుతూ తమదైన ముద్ర వేస్తూ ఐదుగురు భారతీయ మూలలున్న వ్యక్తులకు అరుదైన గౌరవం లబించింది. భవిష్యత్ ను నిర్మిస్తున్న 100మంది వర్ధమాన నాయకుల పేర్లతో ప్రతిస్తాత్మకమైన టైం మ్యాగజిన్ రూపొందించిన వార్షిక జాబితాలో వారికీ చోటు దక్కింది. ది 2021 టైం 100 నెక్ట్స్ పేరిట ఫిబ్రవరి 18 ఈ జాబితాను విడుదల చేసారు. అందులో ట్విటర్ సంస్థలో న్యాయవాదిగా ఉన్నత హోదాల్లో ఉన్న విజయ గద్దె ,బ్రిటన్ ఆర్థికశాఖ రిషి సునాక్ ,ఇంస్టా కార్ట్ వ్యవస్థాపకుడు సియివో అపూర్వ మెహత ,వైద్యురాలు గెట్ అజ్ పిపివో సంస్థ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ శిఖా గుప్తా .ఆఫ్ సాల్వ్ సంస్థ వ్యవస్థాపకుడు రోహన్ పావులూరి తో పాటు భారత్ లో దళిత ఉద్యమం సంస్థ భీం ఆర్మీ అధినేత అయిన చంద్రశేఖర్ ఆజాద్ కూడా స్థానం సంపాదించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టైం మ్యాగజిన్ 100నెక్ట్స్ జాబితాలో ఐదుగురు భారతీయ మూలలున్నవ్యక్తులకు దక్కిన చోటు
ఎవరు: ఐదుగురు భారతీయ మూలలున్నవ్యక్తులకు
ఎక్కడ: టైం మ్యాగజిన్ 100నెక్ట్స్ జాబితా
ఎప్పుడు: ఫిబ్రవరి 18
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిలసై ప్రమాణ స్వీకారం :
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎల్జీ గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలసై సౌందరరాజన్ గారు ప్రమాణ స్వీకారం చేసారు. ఫిబ్రవరి 18న ఉదయం పుదుచ్చేరి రాజ్ నివాస్ లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమం లో పుదుచ్చేరి సిఎం నారాయణ స్వామి మంత్రులు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.ఈ సందర్బంగా తమిలసై మాట్లాడుతూ తెలంగాణ రాజ్ భవన్ ప్రజా భవన్ మారిందని పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్తితుల్లలోనైన పుదుచ్చేరి ప్రజలు తనను నేరుగా సంప్రదించ వచ్చని అన్నారు.కగా ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గా ఉన్న కిరణ్ బేడి ని పదవి నుంచి తొలగించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా తమిలసై ప్రమాణ స్వీకారం
ఎవరు: తమిలసై
ఎక్కడ: పుదుచ్చేరి
ఎప్పుడు: ఫిబ్రవరి 18
జినోమ్ వ్యాలి ఎక్సలేన్సి అవార్డుకు ఎంపిక అయిన భారత్ బయోటెక్ సంస్థ :
జినోమ్ వ్యాలీ ఎక్సలేన్సి అవార్డుకు 2021 ఎంపిక అయిన వ్యాక్సిన్ పరిశోధనలకు ఉత్పత్తి రంగాల్లో అత్యున్నత స్థాయిలో కృషి చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెని ఎంపిక అయింది. తెలంగణా రాష్ట్రం నుంచి వారి అద్వర్యం లో ఫిబ్రవరి 22న హైదరాబాద్ లో జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా జెఎండి సుచిత్ర ఎల్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. జీవశాస్తం లో రంగం లో విశేష కృషి చేసిన వ్యక్తులకు సంస్థలకు ఏట ఈ అవార్డును అందిస్తున్న విషయం తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: జినోమ్ వ్యాలి ఎక్సలేన్సి అవార్డుకు ఎంపిక అయిన భారత్ బయోటెక్ సంస్థ
ఎవరు: భారత్ బయోటెక్ సంస్థ
ఎప్పుడు: ఫిబ్రవరి 18
యుఎన్‌సిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులయినా ప్రీతీ సిన్హా :
ఐక్యరాజ్యసమితి మూలధన అభివృద్ధి నిధి పెట్టుబడి మరియు అభివృద్ధి బ్యాంక్ (UNCDF)కి భారతీయ సంతతికి చెందిన ప్రీతి సిన్హాను దాని కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించింది. దీని దృష్టి మహిళలు, యువత, చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు విస్తృతంగా సేవలందించే వివిధ వర్గాలలో మైక్రో ఫైనాన్స్ సహాయం అందించడంపై ఇది దృష్టి పెడుతుంది. ఈసంస్థలో అత్యున్నత నాయకత్వ హోదా అయిన యుఎన్‌సిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా సిన్హా ఫిబ్రవరి 16న తన భాద్యతలు చేపట్టారు. 1966 లో స్థాపించబడిన ఈ సంస్థ న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఉండగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫైనాన్స్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలనే ఆదేశంతో, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (ఎల్‌డిసి) మైక్రో ఫైనాన్స్ యాక్సెస్‌ను అందిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యుఎన్‌సిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా నియమితులయిన ప్రీతీ సిన్హా
ఎవరు: ప్రీతీ సిన్హా
ఎక్కడ: యుఎన్‌సిడిఎఫ్
ఎప్పుడు: ఫిబ్రవరి 18