
Daily Current Affairs in Telugu 16-02-2021
జి-7 దేశాదినేతల సదస్సు కు అద్యక్షత వహించనున్న బోరిస్ జాన్సన్ :

2021 ఫిబ్రవరి 19 తేదిన జరగనున్న జి-7దేశాదినేతల వర్చువల్ సమావేశం కానున్న బేటిలో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అద్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం బ్రిటన్ జి-7 అద్యక్ష హోదాలో ఉంది కాగా కరోనా వైరస్ టీకాను ప్రపంచ దేశాల మద్య సమానంగా పంపిణి చేయడం భవిష్యత్ లో వచ్చే ఇలాంటి మహామ్మారులను ఎదుర్కొనే విషయమై తీసుకోవాల్సిన చర్యలపై దేశాదినేతల మద్య చర్చ జరగనుంది. పారిశ్రామిక దేశాలతో కూడిన జి-7కూటమి లో యుకె తో పాటు కెనడా,ఫ్రాన్స్ ,జర్మని ,ఇటలి ,జపాన్,అమెరికా ఉన్నాయి. 2021 జూన్ లో బ్రిటన్ లోని కార్న్ వాల్ లో జరిగే జి-7 బేటికి ఆతిత్య హోదాలలో భారత్ ,దక్షిణ కొరియా ,ఆస్ట్రేలియా లను కూడా బ్రిటన్ ఆహ్వానించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జి-7 దేశాదినేతల సదస్సు కు అద్యక్షత వహించనున్న బోరిస్ జాన్సన్
ఎవరు: బోరిస్ జాన్సన్
ఎప్పుడు: ఫిబ్రవరి 16
ఏపి సిఎం వై.ఎస్ జగన్ కు దక్కిన సిఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు :

పరిపాలనలో సంస్కరణల విప్లవాత్మకంగా పథకాలతో సంక్షేమ౦ను ప్రజల ముంగిటే తెచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి “సిఎం ఆఫ్ ది ఇయర్” అవార్డు కు స్కోచ్ గ్రూప్ ఎంపిక చేసింది. పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగం లో ఎపి మొదటి స్థానం లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకత కు పెద్ద పీట వేసిందని స్కోచ్ గ్రూప్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అద్యయనం లో వెల్లడైంది .రాష్ట్రం లో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవున జరిగిన అద్యయనం లో పాలనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు తేలిందని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు .కాగా ఈ అవార్డును ఏపి క్యాంపు కార్యాలయం లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి సిఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఆయన అందజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపి సిఎం వై.ఎస్ జగన్ కు దక్కిన సిఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఎవరు: ఏపి సిఎం వై.ఎస్ జగన్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: ఫిబ్రవరి 16
అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ISA) కొత్త డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ అజయ్ మాథుర్ :

ISA సభ్యుల మొదటి ప్రత్యేక అసెంబ్లీలో ఎన్నికైన తరువాత అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ISA) తన కొత్త డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ అజయ్ మాథుర్ పేరును ప్రకటించింది. 73 సభ్య దేశాల కూటమి అందరికీ సురక్షితమైన, స్థిరమైన సౌరశక్తి యొక్క డిమాండ్ మరియు దాని వినియోగాన్ని వేగవంతం చేయలానే ఉద్దేశ్యంతో 2015 చివరిలో ISA ను స్థాపించబడింది. ఫోకస్డ్ అడ్వకేసీ, పాలసీ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్, కెపాసిటీ బిల్డింగ్, మరియు రాబోయే పెట్టుబడి అడ్డంకులను అధిగమించడం ద్వారా 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను సౌర ప్రాజెక్టులలోకి సమీకరించాలని దీని లక్ష్యంగా పెట్టుకుంది. 2015 లో ISA స్థాపించబడినప్పటి నుండి డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన మిస్టర్ ఉపేంద్ర త్రిపాఠి గారి స్థానంలో డాక్టర్ మాథుర్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎనర్జి అండ్ రిసౌర్స్ ఇన్స్టిట్యూట్ (TERI) కి విధులు నిర్వహిస్తున్నారు.ప్రపంచ వాతావరణ మార్పు పరివర్తన కట్టుబాట్లను పరిష్కరించే ఆలోచనతో డాక్టర్ మాథుర్ నాయకత్వ నియామకం జరుగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ISA) కొత్త డైరెక్టర్ జనరల్ గా డాక్టర్ అజయ్ మాథుర్
ఎవరు: డాక్టర్ అజయ్ మాథుర్
ఎప్పుడు: ఫిబ్రవరి 16
ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకున్న మ్యాప్ మై ఇండియా సంస్థ :

భారత్ కు చెందిన స్వదేశి ఉపగ్రహ ఆదారిత మ్యాపింగ్ సేవలను అందించడానికి అలగే విస్తృతంగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ మరియు ఇలాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం ను ఇవ్వడానికి ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థ మ్యాప్ మై ఇండియా సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ దేశం లో మ్యాపింగ్ మరియు ఇతర స్థాన ఆదారిత సేవలను అందించండానికి కొత్తగా దేశియగా అబివృద్ది చేసిన ప్రత్యామ్నాయంగా ఉన్న అనువర్తనం భువన అని పిలవబడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకున్న మ్యాప్ మై ఇండియా సంస్థ
ఎవరు: మ్యాప్ ఇండియా సంస్థ
ఎప్పుడు: ఫిబ్రవరి 16
ఇస్రో ప్రయోగించిన శాటిలైట్ తో భగవత్ గీతను అంతరిక్షం లోకి తీసుకువెళ్ళిన ధావన్ శాటిలైట్ :

భారత అతరిక్షం లో పరిశోదన సంస్థ ఇస్రో ప్రయోగించే ఒక చిన్న శాటిలైట్ తనతో పాటు భగవత్ గీత కాఫీ,ప్రదాని నరేంద్ర మోడి ఫోటో ,25 వేల మంది వ్యక్తుల యొక్క పేర్లను అంతరిక్షం లోకి తీసుకువేల్లనుంది.ఈ శాటిలైట్ సతీష్ ధావన్ శాటిలైట్ లేదా SD SAT అని పేరు పెట్టారు.భారత అంతరిక్ష ప్రయోగాల్లో తొలి తరం శాస్త్రవేత్తలో సతీష్ ధావన్ ఒకరు. పోలార్ శాటిలైట్ లంచ్ వెహికల్ PSLV)రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ భూ కక్ష్యా మార్గం లో వదలనున్నారు. 2020 లో ఇస్రో IN స్పేస్ అనే ఒక కొత్త సంస్థను ప్రారంబించింది. ఈ సంస్థ ఇస్రో ద్వారా బయటి ప్రైవేట్ కంపెని తయారు చేసే శాటిలైట్ ను కక్ష్య లో ప్రవేశ పెట్టనుంది. ఇందులో భాగంగానే రెండు సాటిలైట్ లను ఇండియా లోని రెండు స్టార్టప్ సంస్థలు తయారు చేసాయి. వాటిని అంతరిక్షం లోకి ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇస్రో ప్రయోగించిన శాటిలైట్ తో భగవత్ గీతను అంతర్క్షం లోకి తీసుకువెళ్ళిన ధావన్ శాటిలైట్
ఎవరు: ఇస్రో
ఎప్పుడు: ఫిబ్రవరి 16
సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సావంత్ కన్నుమూత :

భారత సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ పి.బి సావంత్ (90)గారు కన్నుమూసారు. గుండె పోటు కారణంగా పూనే లోని తన నివాసం ఫిబ్రవరీ 15న తుది శ్వాస విడిచారు.1973 లో బాంబే హైకోర్టు అదనపు జడ్జి గా నియమితులయిన సావంత్ 1989 లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. 1995 లో పదవి విరమణ చేసారు. 2017 లో జరిగిన ఎల్గార్ పరిషత్ సమావేశం కన్వీనర్లలో జస్టిస్ సావంత్ ఒకరు. 2002 లో జరిగిన గుజారాత్ లో మత కలహాలపై ఏర్పరిచిన విచారణ కమిటీ లోని ఆయన సభ్యులుగా ఉన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ సావంత్ కన్నుమూత
ఎవరు: జస్టిస్ సావంత్ కన్నుమూత
ఎప్పుడు: ఫిబ్రవరి 16