Daily Current Affairs in Telugu 17-02-2021
భారత్ మారిషస్ మద్య 300కు పైగా దేశీయ ఉత్పత్తులపై వాణిజ్య సహకార ఒప్పందం :
భారత్ మారిషస్ ల మద్య విస్తృత ఆర్ధిక సహకార ఒప్పందం కుదుర్చుకునెందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది .ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఒప్పండగా దీన్ని పేర్కొనవచ్చు .వ్యవసాయం ,జౌళి,ఎలాక్ర్త్రానిక్స్ వంటి రంగాలకు చెందిన 300 కు పైగా దేశీయ వస్తువులకు మారిషస్ లో కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. దానిద్వారా ప్రాదాన్యత మార్కెట్ లబిస్తుంది. భారత్ లోని 11 విస్తృత సేవల రంగం 95 ఉప రంగాల్లో ఆ దేశ కంపనిలకు మార్కెట్ లబిస్తుంది. ఇరు దేశాలకు అనుకూలమైన తేదిల ఈ ఒప్పందం పై సంతకాలు జరుగుతాయి. సంతకాలు జరిగిన తర్వాతి నెల ఒకటో తేది నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆఫ్రికా లోని ఒక దేశంలో భారత్ సంతకాలు చేస్తున్న తొలి వాణిజ్య ఒప్పందం ఇదే కావడం గమనార్హం. భారత్ మారిషస్ మద్య ఈ ఒప్పందం గురించి 2005 నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ మారిషస్ మద్య 300కు పైగా దేశీయ ఉత్పత్తులకు వాణిజ్య సహకార ఒప్పందం
ఎవరు: భారత్ మారిషస్
ఎప్పుడు: ఫిబ్రవరి 17
ఈ చవాని అనే నూతన పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర రక్షణ మత్రిత్వ శాఖ :
దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డుల్లో నివాసం ఏర్పరచుకొని ఉన్న ప్రజలకు ఆన్ లైన్ ద్వారా పౌర సేవలు అందించేందుకు కేంద్ర రక్షణ మంత్ర్తిత్వ శాఖ ఈ చవాని పోర్టల్ అనే ఒక మొబైల్ యాప్ ను తీసుకువచ్చింది. ఫిబ్రవరి 16న న్యుడిల్లో లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో ఈ యాప్ ను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు ప్రారంబించారు. ఈ జివో ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బి.ఈ.ఎల్) డైరెక్టరేట్ జనరల్ డిఫెన్సి ఎస్టేట్ (డి.జి.డి.ఈ) నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి)లు సంయుక్తంగా అబివృద్ది చేసిన ఈ పోర్టల్ ద్వారా కంటోన్మెంట్ బోర్డుల్లో నివసించే ప్రజలు పలు రకాల సేవలు ఈ ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఈ చవాని అనే నూతన పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర రక్షణ మత్రిత్వ శాఖ
ఎవరు: కేంద్ర రక్షణ మత్రిత్వ శాఖ
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 17
జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ గా విజయ్ సాంప్లా నియామకం :
జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ గా పంజాబ్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా నియమితులయ్యారు .దీర్గాకాలంగా ఖాళీగా ఉన్న ఎస్సి కమిషన్ పోస్టును భర్తీ చేసేలా ఉత్తర్వులను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటిసులు ఇచ్చిన నేపద్యం లో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ గా విజయ్ సాంప్లా నియామకం
ఎవరు: విజయ్ సాంప్లా
ఎప్పుడు: ఫిబ్రవరి 17
కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ,కెప్టెన్ సతీష్ శర్మ కన్నుమూత :
కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీష్ శర్మ (73) ఫిబ్రవరి 17 గోవా లో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. 1947 అక్టోబర్ 11న తెలంగాణ లోని సికింద్రాబాద్ లో జన్మించిన సతీష్ శర్మ మాజీ ప్రదాని రాజీవ్ గాంధికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. 1993 నుంచి 1996 వరకు పివి ప్రభుత్వం లో కేంద్ర మంత్రిగా పని చేసారు. అమేథి ,రాయ్ బరేలి నుంచి మూడు సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడుగా కూడా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కాంగ్రెస్ నేత మాజీ మంత్రి ,కెప్టెన్ సతీష్ శర్మ కన్నుమూత
ఎవరు: సతీష్ శర్మ
ఎక్కడ: గోవా
ఎప్పుడు: ఫిబ్రవరి 17
కరోనాపై జరిగే సార్క్ సదస్సులో పాక్ ను ఆహ్వానించిన భారత్ :
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలపైన చర్చించడానికి దక్షిణాఫ్రికా ప్రాంతీయ సహారకార సంఘం సార్క్ ఫిబ్రవరి 17న నిర్వహించనున్న సదస్సులో పాకిస్తాన్ ను కూడా మన దేశం ఆహ్వానిచింది .ఆరోగ్య శాఖ కార్యదర్శకుల స్థాయిలో ఈ సమావేశం జరగనుంది. కరోనా సంక్షోబాన్ని ఎదుర్కోవడం లో ఉత్తమ విదానాలను పరస్పరం పంచుకోవడం పై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఇలాంటి సమావేశాన్ని నిర్వహించాలని గత ఏడాది మార్చిలో ప్రదాని నరేంద్ర మోడి పిలుపునిచ్చేటపుడు పాకిస్తాన్ మినహా మిగిలిన సభ్య దేశాధినేతలు హాజరయ్యారు. సార్క్ అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలన్న మన దేశం ప్రతిపాదనను కు ఆ బేటీ లో ఆమోదం లబించింది. కాగా ముందు నుంచి కాష్మిర్ అంశాన్ని సార్క్ నేతల సమావేశంలో పాక్ లేవనేత్తడం పై ఆ దేశాన్ని కూటమికి దూరంగా ఉంచాలని మన దేశం బావించేది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనాపై జరిగే సార్క్ సదస్సులో పాక్ ను ఆహ్వానించిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: సార్క్
ఎప్పుడు: ఫిబ్రవరి 17