Daily Current Affairs in Telugu 04 & 05 October – 2022
FIBA మహిళల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2022 విజేతగా నిలిచిన యు.ఎస్.ఏ :
FIBA మహిళల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2022లో USA చైనాను ఓడించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ సూపర్‌డోమ్‌లో జరిగిన అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ సమాఖ్య (FIBA) మహిళల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్‌లో యునైటెడ్ స్టేట్స్ చైనా (83-61)ను ఓడించింది. అమెరికన్ లు వరుసగా నాల్గవ టైటిల్‌ను మరియు మొత్తం 11వ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు మరియు పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలలో కూడా స్థానం సంపాదించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : FIBA మహిళల బాస్కెట్‌బాల్ ప్రపంచ కప్ 2022 విజేతగా నిలిచిన యు.ఎస్.ఏ
ఎవరు : యు.ఎస్.ఏ
ఎప్పుడు : అక్టోబర్ 04
రసాయన శాస్త్రంలో 2022గాను నోబెల్ అవార్డ్ గెలుచుకున్న ముగ్గరు శాస్త్రవేత్తలు :
కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డాల్ & కె బారీ షార్ప్‌లెస్ నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. రసాయన శాస్త్రంలో 2022 గాను నోబెల్ బహుమతి కరోలిన్ బెర్టోజీ, మోర్టన్ మెల్డాల్ & బారీ షార్ప్‌లెస్‌లకు సంయుక్తంగా ‘క్లిక్ కెమిస్ట్రీ’ అని పిలువబడే అణువులను స్నిప్ చేయడంలో చేసిన కృషికి అందించబడింది.వారి పని కణాలను అన్వేషించడానికి & జీవ ప్రక్రియలను ట్రాక్ చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు క్యాన్సర్ చికిత్స మందులలో వర్తించవచ్చు. 2001లో షార్ప్‌లెస్ చిరల్లీ ఉత్ప్రేరక ఆక్సీకరణ ప్రతిచర్యలపై చేసిన కృషికి నోబెల్ బహుమతిని కూడా గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : రసాయన శాస్త్రంలో 2 022గాను నోబెల్ అవార్డ్ గెలుచుకున్న ముగ్గరు శాస్త్రవేత్తలు
ఎప్పుడు : అక్టోబర్ 04
భారత్ లోనే రెండవ మోడల్ వేద పాటశాల పూరిలో ఏర్పాటు :
భారతదేశపు రెండవ జాతీయ మోడల్ వేద పాఠశాల పూరిలో ప్రారంభించబడింది కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 4 అక్టోబర్ 2022న ఒడిశాలోని పూరిలో దేశంలోని రెండవ రాష్ట్రీయ ఆదర్శ వేద విద్యాలయాన్ని (RAVV) ప్రారంభించారు. RAAV లేదా నేషనల్ మోడల్ వేద పాఠశాల యొక్క లక్ష్యం: ప్రజలలో వేదాల జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం & సంస్కృత భాషను కూడా ప్రోత్సహించడం. .మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద్ విద్యా ప్రతిష్ఠాన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇటువంటి పాఠశాల మొదటిది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ లోనే రెండవ మోడల్ వేద పాటశాల పూరిలో ఏర్పాటు
ఎక్కడ: పూరి లో
ఎప్పుడు : అక్టోబర్ 04
క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో కీలక పరిశోధనల గాను నోబెల్ కు ఎంపికైన ముగ్గరు శాస్త్రవేత్తలు :
క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో కీలక పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. సురక్షిత కమ్యూనికేషన్ సాగించేలా ఎన్ క్రిప్షన్ రంగంలో అనేక ప్రయోజనాలకు వీరి ఆవిష్కరణలు బాటలు పరిచాయి. అలెన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాజర్ (అమెరికా), ఆంటోన్ జైలింగర్ (ఆస్ట్రియా)కు ఈ గౌరవం దక్కింది. పరస్పరం చాలా దూరంలో ఉన్న ఫోటాన్ లు అనే రేణువులను అనుసంధానించే పద్దతిని వారు కనుగొన్నట్లు నోబెల్ ఎంపిక కమిటీ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది ఉజ్వల రంగమని, చాలా వేగంగా వృద్ధి చెందుతోందని కమిటీ సభ్యురాలు ఎవా ఓల్సన్ పేర్కొన్నారు. భద్రంగా సమాచారాన్ని బట్వాడా చేయడం, క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, క్వాంటమ్ నెట్వర్క్స్ రంగాల్లో ఇది ఉపయోగపడుతోంద న్నారు. దీని మూలాలు క్వాంటమ్ మెకానిక్స్ లో ఉన్నాయని వివరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో కీలక పరిశోధనల గాను నోబెల్ కు ఎంపికైన ముగ్గరు శాస్త్రవేత్తలు
ఎవరు : . అలెన్ ఆస్పెక్ట్ (ఫ్రాన్స్), జాన్ ఎఫ్ క్లాజర్ (అమెరికా), ఆంటోన్ జైలింగర్ (ఆస్ట్రియా)
ఎప్పుడు : అక్టోబర్ 04
ప్రపంచ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన భారత ప్లేయర్ శ్రీకృష్ణ :
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్ లో భారత ప్లేయర్ శ్రీకృష్ణ సూర్యనారాయణ విజేతగా అవతరించాడు. అక్టోబర్ 05 న జరిగిన ఫైనల్లో తమిళ నాడుకు చెందిన శ్రీకృష్ణ 5-1 ఫ్రేమ్ (51-4, 0-39, 63-0, 39-0, 45-7, 43-2) తేడాతో హబీబ్ సబా (బహ్రెయిన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో శ్రీకృష్ణ 5-4 ఫ్రేమ్ తేడాతో జేమ్స్ వరానా (థాయ్లాండ్)పై నెగ్గాడు. 22 ఏళ్ల శ్రీకృష్ణ జాతీయ 6-రెడ్ స్నూకర్ చాంపియన్ కాగా, 2019లో జాతీయ బిలియర్డ్స్ చాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్ లో విజేతగా నిలిచిన భారత ప్లేయర్ శ్రీకృష్ణ
ఎవరు : భారత ప్లేయర్ శ్రీకృష్ణ
ఎప్పుడు : అక్టోబర్ 05
జాతీయ క్రీడల్లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాదించిన అథ్లెట్ జ్యోతి :
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యెర్రాజీ మళ్లీ మెరిసింది. ఇప్పటికే మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ ఈ వైజాగ్ అథ్లెట్ 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ లోనూ బంగారు పతకం సొంతం చేసుకుంది. అక్టోబర్ 05న జరిగిన 100 మీటర్ల హరిల్స్ ఫైనల్ రేసును జ్యోతి 12.79 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. తెలంగాణకు చెందిన అగసార నందిని 13.38 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది. మహిళల జావెలిన్ త్రోలో రష్మీ శెట్టి ఆంధ్రప్రదేశ్కు రజత పతకం అందించింది. రష్మీ జావెలిన్ ను 53.95 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. టెన్నిస్ పురుషుల డబుల్స్. విభాగంలో కొసరాజు శివదీప్ – ముని ఆనం మణి (ఆంధ్రప్రదేశ్) జోడీ కాంస్య పతకం సాధించింది. సెమీఫైనల్లో శివదీప్-అనంత మణి ద్వయం 7-5. 3-6, 6-10తో ప్రజ్వల్ దేవ్ అదిల్ (కర్ణాటక) జోడీ చేతిలో ఓడి కాంస్యం సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : జాతీయ క్రీడల్లో 100 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాదించిన అథ్లెట్ జ్యోతి
ఎవరు : అథ్లెట్ జ్యోతి యెర్రాజీ
ఎప్పుడు : అక్టోబర్ 05
ఇరానీ కప్ 2022 ను గెలుచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు :
ఇరానీ కప్ మళ్లీ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టునే వరించింది. రంజీ మాజీ చాంపియన్ సౌరాష్ట్రతో జరిగిన పోరులో రెస్ట్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. మంగళవారం 388/8 ఓవర్నెట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర కేవలం మరో 12 పరుగులే జత చేసి మిగిలున్న రెండు వికెట్లను కోల్పోయింది. 380 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 276 పరుగుల ఆధిక్యం పొందిన రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 105 పరుగుల’ లక్ష్యమే ఉండగా దీన్ని 312 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ప్రియాంక్ (2), యక్ ధుల్ (8) విఫలమవగా అభిమన్యు ఈశ్వరన్ (63 నాటౌట్; 8 ఫోర్లు). శ్రీకర్ భరత్ (27 నాటౌట్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. ఇద్దరు అబేద్యమైన మూడో వికెటు 81 పరుగులు జోడించారు. దీంతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఖాతాలో 29వసారి ఇరాన్ కప్ చేరింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఇరానీ కప్ 2022 ను గెలుచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు
ఎవరు : రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు
ఎప్పుడు : అక్టోబర్ 05
ఎఫ్ఎస్ఐహెచ్ రైజింగ్ ప్లేయర్ అవార్డ్ అందుకున్న ముంతాజ్ ఖాన్ :
ఎఫ్ఎస్ఐహెచ్ రైజింగ్ ప్లేయర్ గా ముంతాజ్ ఖాన్ భారత మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్ ముంతాజ్ ఖాన్ కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఎస్ఐ హెచ్ అవార్డు లభించింది. లక్నోకు చెందిన 19 ఏళ్ల ముంతాజ్ రైజింగ్ ప్లేయర్ గా ఎంపికైంది. ఈ ఏడాది ఏప్రిల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ లో ముంతాజ్ విశేషంగా రాణించి హ్యాట్రిక్ తో సహా ఎనిమిది గోల్స్ సాధించింది. జూనియర్ ప్రపంచకప్ లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో భారత్ “మాటౌట్’లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఎఫ్ఎస్ఐహెచ్ రైజింగ్ ప్లేయర్ అవార్డ్ అందుకున్న ముంతాజ్ ఖాన్
ఎవరు : ముంతాజ్ ఖాన్
ఎప్పుడు : అక్టోబర్ 05
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |