Daily Current Affairs in Telugu 29-10-2020
ఇద్దరు ప్రవాస భారతీయులకు దక్కిన అంతర్జాతీయ పురస్కారాలు :
వేర్వేరు రంగాల్లో విశేష కృషి చేసిన ఇద్దరు ప్రవాస భారతీయులు అంతర్జాతీయ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. భారతీయ అమెరికన్ పారిశ్రామిక వేత్త అయిన డా.దినేష్ పటేల్ ను “ఉటా గవర్నర్ జీవిత కాల సాపల్య పతకం” వరించింది. బయో టెక్నాలజీ ,ఔషద రంగం లో చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.మరో భారతీయ అమెరికన్ వ్యాపార వేత్త ఎం.ఆర్ రంగస్వామి 2020సంవత్సరానికి గాను గ్లోబల్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. ఇండియా స్సోరా సంస్థను ప్రారంబించి .ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు ఒక్కటి చేయడానికి కృషి చేస్తున్నందుకు గాను ఆయన్ను కెనడా ఇండియా వ్యాపార మండలి ఈ పురస్కారం లబించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఇద్దరు ప్రవాస భారతీయులకు దక్కిన అంతర్జాతీయ పురస్కారాలు
ఎవరు: డా.దినేష్ పటేల్
ఎక్కడ:అమెరికా (వాషింగ్టన్)
ఎప్పుడు: అక్టోబర్ 29
స్పుత్నిక్ వి పై బివిఆర్ ఏ సి తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం :
రష్యా కోవిద్ -19 టీకా స్పుత్నిక్ వి పై మన దేశం లో క్లినికల్ పరీక్షల నిర్వహణ పై సహాయ సేవల నిమిత్తం డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ సంస్థ కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సారద్యం లో ని బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఏసి)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల బిఐఆర్ఏసికి చెందిన క్లినికల్ పరీక్షల కేంద్రాలను డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ వినియోగించ గలుగుతుంది. గుడ్ క్లినికల్ లేబరేటరీస్ ప్రాక్టీస్ (జిసిఎల్.పి) ల్యాబ్స్ ను ఇమ్యునోజేనిసిటి అస్సేటెస్టింగ్ అవసరాల కోసం వాడుకోవ\చ్చు. దీనివల్ల స్పుత్నిక్ విటీకను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కలుగుతుందని డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే స్పుత్నిక్ వి టీకాను మన దేశానికి తీసోకోచ్చెందుకు డాక్టర్ రెడ్డీస్ ,రష్యా కు చెందిన రష్యా డైరెక్టర్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీనిపై 2,3దశల క్లినికల్ పరీక్షల నిర్వహణకు ఇటీవల డాక్టర్ రెడ్డీస్ కు డి.సిజి.ఐ నుండి అనుమతి లబించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: స్పుత్నిక్ వి పై బివిఆర్ ఏ సి తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
ఎవరు: డాక్టర్ రెడ్డీస్ సంస్థ
ఎప్పుడు: అక్టోబర్ 29
గుజరాత్ మాజీ సిఎం కేశుభాయ్ కన్నుమూత :
గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) అక్టోబర్ 29 న కన్నుమూసారు.దీ ర్గాకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆరోగ్యం మరింతగా క్షిని౦చింది. అక్టోబర్ 29 ఉదయం తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అహ్మదా బాద్ లోని ఆస్పత్రిలోకి తరలించారు. చికిత్స పొందుతూ గుండె పోటుతో ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. గుజరాత్ లో బాజాపా ను పటిష్టం చేసి అధికారం లోకి తీసుకురావడంలో కేశుభాయ్ గారి కృషి ఎంతో ఉంది. 1995 లో,1996-2001 మధ్య కాలం లో ఆయన ముఖ్యమంత్రిగా గుజారాత్ రాష్ట్రానికి సేవలు అందించారు. గుజరాత్ అసెంబ్లీ కి ఆరు సార్లు మరియు ఒక సారి పార్లమెంట్ కు ఎన్నిక అయ్యారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: గుజరాత్ మాజీ సిఎం కేశుభాయ్ కన్నుమూత
ఎవరు: కేశుభాయ్
ఎక్కడ: గుజరాత్
ఎప్పుడు: అక్టోబర్ 29
ఎస్వి బిసి చైర్మన్ గా సాయి కృష్ణ యాచేంద్ర నియామకం :
శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబిసి ) చైర్మన్ గా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూర్ జిల్లా వెంకట గిరి కి చెందిన రాజ కుటుంబ సంబంధీకులు అయిన డాక్టర్ వి.భాస్కర్ సాయి కృష్ణ యాచేంద్ర ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సంగీత గేయధార సృష్టి కర్త గా పేరున్న సాయి కృష్ణ దాదాపు మూడొందలకు పైగా కార్యక్రమాలు చేపట్టారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఎస్వి బిసి చైర్మన్ గా సాయి కృష్ణ యాచేంద్ర నియామకం
ఎవరు: సాయి కృష్ణ యాచేంద్ర
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: అక్టోబర్ 29
2018 బాల్ ట్యాంపరింగ్ ఘటన పై ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ పుస్తకం :
క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ను కుదిపేసిన” 2018బాల్ ట్యాంపరింగ్” పైన జరిగిన సంఘటన గురించి ఆస్ట్రేలియా ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ ఒక పుస్తకం రాస్తున్నట్లు అతని భార్య క్యాండిస్ వార్నర్ అక్టోబర్ 27న ప్రకటించింది .రెండేళ్ళ కింద దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ పర్యటనలో సందర్బంగా ఆసిస్ ఆటగాళ్ళు స్మిత్ టీం కెప్టెన్,వార్నర్ ,బాన్ క్రాఫ్ట్ కేప్ టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని దానివల్ల నిషేధం కు గురయ్యారు. ఈ సంఘటన ఆటగాళ్ళ కెరీర్ కు ఒక మచ్చగా నిలిచింది. అయితే దీనిపై వాస్తవాలను వివరించేందుకు తన భర్త ఒక పుస్తకం ద్వారా సంఘటన వెనుక గల వాస్తవాలను తెలుపుటకు ఈ పుస్తకం రాస్తున్నట్లు క్యాండిస్ ప్రకటించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: 2018 బాల్ ట్యాంపరింగ్ ఘటన పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుస్తకం
ఎవరు: డేవిడ్ వార్నర్
ఎక్కడ: ఆస్ట్రేలియా
ఎప్పుడు: అక్టోబర్ 29
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |