Daily Current Affairs in Telugu 30-10-2020
నౌకా విద్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన భారత్ :
భారత్ వాయు సేన పోరాట సామర్థ్యాలను చాటి చెప్తూ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ మరోసారి విజయవంతంగా పూర్తి చేసింది. సుఖోయ్ యుద్ద విమానం నుంచి దూసుకెళ్ళే బంగాళాఖాతం లో తన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వం తో తునాతునకలు చేసింది. తూర్పు లద్దక్ లో చైనా తో ఉద్రిక్తలు నెలకొన్న నేపద్యం లో వాయుసేన చేపట్టిన ఈ ప్రయోగ పరీక్ష అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా పరిక్షలో భాగంగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ద విమానం పంజాబ్ లోని ఒక వైమానిక స్థావరం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంబించింది. మార్గ౦మద్యలో అది గాల్లోనే ఇందనాన్ని నింపుకుంది. మూడు గంటలకు పైగా ప్రయాణం అనంతరం యుద్ద విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించగా బంగాళాఖాతం లో మునిగిపోతున్న లక్షిత నౌకను సంపూర్ణ ఖచ్చితత్వం తో అది చేధించింది అని అధికార వర్గాలు వెల్లడించాయి.
- గగన తలం నుంచి (సుఖోయ్ యుద్ద విమానం నుంచి ) బ్రహ్మోస్ ను తొలి సారి గత ఏడాది మే లో వాయు సేన విజయవంతంగా ప్రయోగించిన సంగతి గమనార్హం .
- గత రెండు నెలల్లో భారత్ పలు క్షిపణి పరీక్షలను చేపట్టింది. వాటిలో ఉపరితలం నుంచి ఉపరితలం కు ప్రయోగించే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి,యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం-1 వంటివి ఉన్నాయి. అక్టోబర్ 18న బ్రహ్మోస్ క్షిపణి నౌకదల వర్షన్ ను భారత్ విజయవంతగా పరీక్షించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నౌకా విద్వంసక క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 30
నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులయిన యశ్వర్ధన్ కె. సిన్హా :
భారత నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గ యశ్వర్ధన్ కుమార్ సిన్హా పేరును భారత ప్రభుత్వం ఆమోదించింది. సీనియారిటీ సూత్రానికి దూరంగా ఉండకూడదని భావించి కేంద్ర సమాచార కమిషన్ నూతన అధిపతిగా సమాచార కమిషనర్గా యశ్వర్ధన్ కె. సిన్హా నియామకాన్ని కేంద్రం ఆమోదించింది. ఈయన 1981 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి. ఈయన మాజీ దౌత్యవేత్త ,యునైటెడ్ కింగ్‌డమ్ మరియు శ్రీలంకకు భారత హైకమిషనర్‌గా కూడా పనిచేశారు. బిమల్ జుల్కా పదవీ విరమణ చేసిన తరువాత సిఐసి చైర్మన్ పదవి చాలా నెలలు ఖాళీగా ఉంది. ఆయన స్థానం లో ఈయన నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులయిన యశ్వర్ధన్ కె. సిన్హా
ఎవరు: యశ్వర్ధన్ కె. సిన్హా
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 30
యుకె ప్రతిష్టాత్మక పెన్హసేల్ టిల్డ్ మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 అవార్డ్ గెలుచుకున్న అనితా ఆనంద్ :
భారతీయ మూలాలున్న బ్రిటిష్ మూలాలున్న బ్రిటిష్ జర్నలిస్ట్ రచయిత అనిత ఆనంద్ యుకె లోని ప్రతిష్టాత్మక పెన్ హాసేల్ టిల్డ్ మ్యాన్ ప్రైజ్ హిస్టరీ -2020 పురస్కారం గెలుచుకున్నారు. అనిత ఆనంద్ రచించిన “ది పేషంట్ ఆసాసిన్” అనే పుస్తకానికి గాను ఈ అవార్డు దక్కింది. 1919 ఏప్రిల్ 13 న పంజాబ్ రాష్ట్రము లో జరిగిన భయానకమైన మానవ మారణ హోమం లో బాగంగా ఉన్న ఒక యువకుడి చట్టు జరిగిన వృత్తాంతమే ఈ పుస్తకం. ఈ పుస్తక రచనకు గాను ఈమె ఈ అవార్డ్ ను గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : యుకె ప్రతిష్టాత్మక పెన్హసేల్ టిల్డ్ మ్యాన్ ప్రైజ్ ఫర్ హిస్టరీ-2020 అవార్డ్ గెలుచుకున్న అనితా ఆనంద్
ఎవరు: అనితా ఆనంద్
ఎప్పుడు: అక్టోబర్ 30
భూ రికార్డులకు సంబందించిన ధరణి పోర్టల్ ను ప్రారంబించిన తెలంగాణా :
తెలంగాణా లో భూరికార్డు ల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ధరణి పోర్టల్ ను ఇటీవల కేసిఆర్ గారు ప్రారంబించారు. మేడ్చల్ అల్కాజ్ గిరి లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్వ కుంట్ల చంద్రశేకర్రావు గారు ధరణి పోర్టల్ ను ప్రారంబించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తూ దేశంలో నే తొలిసారిగా రెవెన్యు రికార్డులో ఎలక్రానిక్ ఇంటర్వేషణ్ ను ప్రవేశ పెడుతున్నది. మొదటి రాష్ట్రము తెలంగాణా ప్రభుత్వం గా పేర్కొన్నారు. ఈ వెబ్ సైట్ లో గ్రామాలు మరియు మండలాలు,జిల్లాలు వారిగా రైతుల ల సర్వే నంబర్ల తో పాటు వారి భూముల వివరాలు మరియు వాటి కి సంబంధిన పూర్తి వివరాలు పొందుపరుస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భూ రికార్డులకు సంబందించిన ధరణి పోర్టల్ ను ప్రారంబించిన తెలంగాణా
ఎవరు: తెలంగాణా ముఖ్యమంత్రి కాల్వ కుంట్ల చంద్రశేకర్రావు
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు: అక్టోబర్ 30
అంతర్జాతీయ బయోటెక్ కంపెనీలలో బయోకాన్ సంస్థ కు దక్కిన అరుదైన గౌరవం :
అంతర్జాతీయ బయోటెక్ కంపెని లలో అగ్రగామి అయిన టాప్- 5లో బయోకాన్ కూడా నిలిచింది. అమెరికాకు చెందిన సైన్స్ మ్యాగజిన్ తన యొక్క వార్షిక సైన్స్ కెరీర్ లో టాప్ 20 ఎంప్లాయర్స్ జాబితాలో ఈ విషయం ను వెల్లడించింది. 2018లో బయోకాన్ ఏడో ర్యాంకులో ఉండగా 2019కి ఆరో స్థానం కు మారి తాజాగా అయిదో స్థానం కు చేరుకుంది. పరిశ్రమలో వినూత్నతకు శ్రమించే నాయకత్వం, సామాజిక బాద్యత ,విశ్వాస పరమైన ఉద్యోగులు మరియు ఈ మూడు కీలక అంశాల ఆదారంగా ఈ ర్యాంకింగ్ లను ఇచ్చారు. ఇందులో టాప్ 5 కంపెని లలో రీజేనరాన్ ,అలినిలాం,ఇన్సైట్ ,జింజెంటా ,బయోకాన్ లు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : అంతర్జాతీయ బయోటెక్ కంపెనీలలో బయోకాన్ సంస్థ కు దక్కిన అరుదైన గౌరవం
ఎవరు: బయోకాన్ సంస్థ
ఎప్పుడు: అక్టోబర్ 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |