Daily Current Affairs in Telugu 20-01-2021
2021 గణతంత్ర్య దినోత్సవంలో వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొనబోతున్న తొలి మహిళగా నిలిచిన భావన కాంత్ :
2021 గణతంత్ర్య దినోత్సంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమాన పైలెట్ ప్లైట్ లెఫ్టినెంట్ భావన కాంత్ పాల్గొనబోతున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనే తొలి మహిళా యుద్ద విమాన పైలట్ గా ఆమె రికార్డులను ఎక్కుతున్నట్లు భారత వాయు సేన ప్రకటించింది. ఈమె ప్రస్తుతం భావన రాజస్తాన్ పోస్ట్ చేసి మిగ్-21 బైసన్ ఫైటర్ విమానం ఎగరనుంది. 2016 భారత వైమానికదళంలో ప్రవేశించిన మొదటి మహిళా యుద్ద పైలెట్ లో భావన కూడా ఒకరు. ఈమె మోహనా సింగ్ మరియు అవని చతుర్వేది లతో కలిసి 2016 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021 గణతంత్ర్య దినోత్సవంలో వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొనబోతున్న తొలి మహిళగా నిలిచిన భావన కాంత్
ఎవరు: భావన కాంత్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 20
బీహార్ రాష్ట్రము లో మొదటి బర్డ్ ఫెస్టివల్ ‘కల్రావ్’ ను ప్రారంబించిన నితీష్ కుమార్ :
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాముల్ జిల్లలో ఉన్న నాగి నక్తి పక్షుల అబయరణ్యంలో రాష్ట్రం లోని మమొట్టమొదటి పక్షుల ఉత్సవం ‘కల్రావ్’ ను ప్రారంబించారు.ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పర్యవరణం అటవీ మరియు వాతావరణ మార్పుల విభాగం నిర్వహించింది. పక్షుల గురించి ముఖ్యంగా వలస పక్షుల గురించి ప్రజలలో అవగాహన కల్పించనున్నారు. ఆయన బర్డ్ ఫెస్టివల్ యొక్క లోగో ను ఆవిష్కరించారు. మరియు ఈ అబయరణ్యంలో లబించే పక్షుల పై కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా విడుదల చేసారు. నాగి నక్తి పక్షుల అబయరణ్యంలో అనేక రకాల దేశీయ జాతుల పక్షుల అబయరణ్యంలో అనేక రకాల దేశీయ జాతుల పక్షుల మరియు వలస పక్షుల నివాసంగా ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బీహార్ రాష్ట్రము లో మొదటి బర్డ్ ఫెస్టివల్ కల్రావ్ ను ప్రారంబించిన నితీష్ కుమార్
ఎవరు: సిఎం నితీష్ కుమార్
ఎక్కడ:బీహార్
ఎప్పుడు: జనవరి 20
అమెరికా దేశ 46అద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడేన్ :
అమెరికా దేశ భద్రత దళ బలగాల పటిష్ట పహారా మద్య జనవరి 20 అమెరికా 46 వ అద్యక్షుడిగా జోసెఫ్ రాబినేట్ బైడేన్ ప్రమాణ స్వీకారం చేసారు. క్యాపిటల్స్ భవనంలో సంప్రదాయకంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడేన్ తో దేశ నూతన అద్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్ పై ప్రమాణం చేసి బైడేన్ దేశ అద్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందు దేశ 49 ఉపాధ్యక్షురాలిగా భారత దేశంలోని తమిళనాడు మూలాలున్న ఇండో ఆఫ్రో అమెరికన్ మహిళా కమల హ్యారిస్ (56) ప్రమాణ స్వీకారం చేసారు. ఆమెతో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అద్యక్షుడిగా జో బైడేన్ (78) చరిత్ర సృష్టించారు. ఈయన అమెరికాకు రెండో క్యాథలిక్ అధ్యక్షుడు,అలాగే దేశానికి 46వ అద్యక్షుడు.ఈ కార్యక్రమానికి మాజీ అద్యక్షుడు బిల్ క్లింటన్ ,జార్జి బుష్,.బరాక్ ఒబామా గారు హాజరు అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా దేశ 46 అద్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడేన్
ఎవరు: జో బైడేన్
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జనవరి 20
ఐసిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ కు నూతన చైర్మన్ గా నవజ్యోత్ :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెని సేక్రతరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ గా పుట్టపర్తి నవజ్యోత్ జనవరి 20 బాద్యతలు చేపట్టారు.ఆయన ఏడాది కాలం పాటు ఈ పదవిలో ఉంటారు. ప్రాక్టీస్ కంపెని సెక్రటరి అయిన పుట్టపర్తి నవజ్యోత్ గతంలో హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ గా కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. అంతకు ముందు ఫాక్స్ మండల్ అసోసియేట్స్ అనే న్యాయ సేవల సంస్థలో కొంత కాలం పాటు పని చేసారు. ఈ ఏడాది ఐసిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ వైస్ చైర్మన్ గా పి.సుదీర్ కుమార్ కార్యదర్శిగా టి.లలిత దేవి కోశాదికరిగా అక్షిత ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ కు నూతన చైర్మన్ గా నవజ్యోత్
ఎవరు: నవజ్యోత్
ఎప్పుడు:జనవరి 20
పద్మ శ్రీ గ్రహీత ప్రఖ్యాత అంకాలజిస్ట్ డాక్టర్ వి.శాంత కన్నుమూత :
ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ మరియు పద్మ శ్రీ గ్రహీత డాక్టర్ వి.శాంత ఇటీవల కన్నుమూసారు. ఆమె 1954 లో చేరిన చెన్నైలో అడయార్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఈ సంస్థ రోగులందరికీ అత్యదునిక ఆరోగ్య సంరక్షణను అందించడంలో ప్రసిద్ది చెందింది. డాక్టర్ వి.శాంత ప్రతిష్టాత్మక పద్మ శ్రీ (1986) గ్రహీత మరియు పద్మ భూషణ్ (2006)ను ఆమెకు నాణ్యమైన మరియు సరసమైన క్యాన్సర్ చికిత్సను అందరికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు అందుకుంది. అంతే కాకుండా ఈమెకు పద్మ విభూషణ్ మరియు రామన్ మెగసెసే ఆవార్డులు కూడా లబించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మశ్రీ గ్రహీత ప్రఖ్యాత అంకాలజిస్ట్ డాక్టర్ వి.శాంత కన్నుమూత
ఎవరు: డాక్టర్ వి.శాంత
ఎప్పుడు: జనవరి 20
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |