Daily Current Affairs in Telugu 22-10-2020
దృష్టి పరికర ఆవిష్కర్తకు దక్కిన జేమ్స్ డైసన్ -2020 పురస్కారం :
దేశంలో కరెన్సీ మార్పు తర్వాత అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు హైదరాబాద్ యువకుడు పరిష్కారం చూపారు. పాత కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు దృష్టి పేరుతో రూ.5 ఖర్చుతో చిన్న పరికరాన్ని రూపొందించి ప్రఖ్యాత జేమ్స్ డైసన్ -2020 అంతర్జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. నగరం లో కుకట్ పల్లికి చెందిన లింగాల మనితేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) అహ్మదాబాద్ లో డిజైనింగ్ కోర్సు చేస్తున్నారు. నోట్ల రద్దు నుంచి కరెన్సీ గుర్తింపు లో అంధులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని దానికి పరిష్కారంగా తన మిత్రుడు మృదుల్ చిముల్వార్ తో కలిసి ఈ పరికరాన్ని తయారు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: దృష్టి పరికర ఆవిష్కర్తకు దక్కిన జేమ్స్ డైసన్ -2020 పురస్కారం
ఎవరు: లింగాల మనితేజ
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: అక్టోబర్ 22
తుది దశ నాగ్ క్షిపణి ప్రయోగం ను విజయవంతంగా ప్రయోగించిన భారత్ :
మన దేశం రక్షణ రంగం మరింత బలోపేతం అయింది.పూర్తిగా స్వదేశి పరిజ్ఞానం తో తయారు చేసిన ట్యాంకు విద్వంసక క్షిపణి నాగ తుది దశ ప్రయోగాలను రక్షణ అద్యయన అబివృద్ది సంస్థ (డిఆర్డివో) విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్తాన్ లో ఫోక్రాన్ లో అక్టోబర్ 22న ఉదయం 6.45 గంటలకి నాగ క్షిపణి నిర్దేశిత లక్ష్యాలను ఖచ్చితంగా చేధించినట్లు డిఆర్డివో వెల్లడించింది. శత్రువుల యుద్ద ట్యాంకులను ద్వంసం చేయడానికి యాంటీ ట్యాంకు మిస్సైల్ గైడ్ (ఎటిజిఎం) ను డిఆర్డివో అబివృద్ది చేసింది.
- నాగ క్షిపణి నాలుగు నుంచి ఏడు కిలో మీటర్ల లక్ష్యాలను చెందించ గలదు.
- మూడో తరానికి చెందిన ఈ క్షిపణి రాత్రయిన పగలైన శత్రువుల యుద్ద ట్యాంకులను ఇతర సామగ్రి ని ద్వంసం చేయగలదు.
- ఈ క్షిపణి ని క్యారియర్స్ ని రష్యాకు చెందిన బిఎంపి-2 పరిజ్ఞానం తో అబివృద్ది చేసారు.
- ఈ తరహా పరిజ్ఞానం లాక్ బిఫోర్ లాంచ్ వ్యవస్థ ని కలిగి ఉంటుంది.అంటే క్షిపణి ని ప్రయోగించడానికి ముందే లక్ష్యాలను గుర్తిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తుది దశ నాగ్ క్షిపణి ప్రయోగం ను విజయవంతంగా ప్రయోగించిన భారత్
ఎవరు: డిఆర్డివో
ఎక్కడ: రాజస్తాన్ లో ఫోక్రాన్ లో
ఎప్పుడు: అక్టోబర్ 22
పార్టీక్యులేట్ మ్యాటర్ 2.5అంశం లో ప్రపంచం లో నే మొదటి స్థాన౦ లో ఇండియా :
గాలిలో కాలుష్య కారకమైన సూక్ష్మాతి సూక్ష్మ మైన దుమ్ము ధూళి కణాలు గల పిఎం (పార్టీ క్యులేటివ్ మ్యాటర్ ) 2.5 అంశంలో ఇండియా ప్రపంచం లోనే మొదటి స్థానం లో ఉన్నది అని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రూపొందిచిన స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్ఓజిఏ) నివేదిక -2020 లో ఈ విషయ౦ తెలిపింది. గాలిలో పిఎం 2.5 రేటింగ్ 75 నుంచి 85 మద్య ఉంటె అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నదీ అని అర్థం . గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్ యొక్క రేటింగ్ 83వరకు ఉన్నదీ కావున భారత్ ప్రమాద స్థాయిలో ఉంది అని తెలుస్తుంది. ఈ రేటింగ్ లో 83.2 రేటింగ్ తో భారత్ మొదటి స్థానం లో ఉండగా,నేపాల్ 83.1 రెండవ స్థానంలో,రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.1మూడవ స్థానం లో,ఖతార్ 76.0 నాలుగో స్థానం లో,నైజీరియ 704 రేటింగ్ తో ఐదవ స్థానం లో ఉంది .
క్విక్ రివ్యు :
ఏమిటి: పార్టీక్యులేట్ మ్యాటర్ 2.5అంశం లో ప్రపంచం లో నే మొదటి స్థాన౦ లో ఇండియా :
ఎవరు: ఇండియా
ఎప్పుడు: అక్టోబర్ 22
2019 లో పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాలజాబితాలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానం :
భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ (ఐటిఎస్) 2020 ప్రకారం 2019 లో అత్యధికంగా దేశీయ పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాల లో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంగా నిలిచింది. 2019 లో సుమారు 53.6 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌ను సందర్శించారు. ఇది మొత్తం ప్రయాణికులలో 23.1%. తమిళనాడు (21.3%) రెండవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (10.2%) ఉన్నాయి. విదేశీ పర్యాటకుల విషయానికొస్తే, 2019 లో దాదాపు 68 లక్షల మంది విదేశీయులు రాష్ట్రాన్ని సందర్శించడంతో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది.ఈ జాబితాలో మహారాష్ట్ర (55 లక్షలకు పైగా) రెండవ స్థానంలో ఉండగా, 2019 లో సందర్శించే విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తర ప్రదేశ్ (47 లక్షలకు పైగా) మూడవ స్థానాన్ని దక్కించుకుంది. 2019 లో 9 లక్షలకు పైగా విదేశీ పర్యాటక సందర్శనలతో గోవా ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది
క్విక్ రివ్యు :
ఏమిటి: 2019 లో పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాలజాబితాలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానం
ఎవరు: ఉత్తర ప్రదేశ్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 22
తెలంగాణా రాష్ట్ర తొలి హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి కన్నుమూత :
తెలంగాణా రాష్ట్ర తొలి హోం మంత్రి ,టిఆర్ఎస్ సీనియర్ నేత గా పేరున్న నాయిని నరసింహా రెడ్డి (80 ) కన్నుమూసారు.హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 21న ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల ఈయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవల కోలుకున్నారు కానీ ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయన ఈ నెలలోనే మల్లీ అపోలో లో తిరిగి చేర్చారు. ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ తో పరిస్థితి విషమించి మృతి చెందారు. తెలంగాణా ఉద్యమంలో కూడా ఈయన పాల్గొన్నారు. ఈయన తెలంగాణా రాష్ట్ర ఏర్పడ్డాక ఏర్పడిన క్యాబినెట్ లో తోలి హోం మినిస్టర్ గా బాద్యతలు చేపట్టారు మరియు కార్మిక శాఖా మంత్రిగా కూడా ఈయన పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణా రాష్ట్ర తొలి హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి కన్నుమూత
ఎవరు: నాయిని నరసింహ రెడ్డి
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు: అక్టోబర్ 22
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |