Daily Current Affairs in Telugu 19-10-2020
భారత అమెరికన్ బాలికకు యంగ్ సైంటిస్ట్ గా దక్కిన పురస్కారం :
కరోన వైరస్ కొమ్ములు వంచే అధ్బుత ఆవిష్కరణ చేసిన భారత సంతతి కి చెందిన బాలిక అనికా చేబ్రోలు (14) అమెరికాలో ప్రతిష్టాత్మక 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ ను గెలుచుకుంది. ఈ పురస్కారం కింద ఆమెకు 25వేల డాలర్లు లబిస్తాయి. 3ఎం యంగ్ సైంటిస్ట్ చాలెంజ్లో మొత్తం 10 మంది విద్యార్థులు ఫైనల్స్ కు చేరుకున్నారు. ఇన్ సిలికో అనే విధానాన్ని ఉపయోగించి కోవిద్-19 కారక సార్స్ కొవ్ -2 వైరస్లో ని కీలకమైన స్పైక్ ప్రోటీన్ అనే నిర్దిష్టంగా అతుక్కునే ఒక పదార్థాన్ని అనిక కనుగొంది. ఈ ప్రయోగాన్ని సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలతో కూడిన న్యాయనిర్నేతల కమిటీ విశ్లేషించి విజేతగా ప్రకటించిది.
క్విక్ రివ్యు:
ఏమిటి: భారత అమెరికన్ బాలికకు యంగ్ సైంటిస్ట్ గా దక్కిన పురస్కారం
ఎవరు: అనికా చేబ్రోలు
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: అక్టోబర్ 19
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచున్న ఐశ్వర్య శ్రీధర్ :
ముంబయికి చెందిన 23 ఏళ్ల అమ్మాయి ఐశ్వర్య శ్రీధర్ కి 2020 వైల్డ్‌లైఫ్ “ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును” గెలుచుకుంది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ గా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును 56 సంవత్సరాలుగా దీనిని అందిస్తున్నారు. ఆమె యొక్క ఫోటో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ ప్రపంచంలోని 80 కి పైగా దేశాల నుండి వచ్చిన 50,000 ఎంట్రీలలో గెలుపొందింది. 100 ఫోటో స్ మాత్రమే ఇందులో షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి మరియు బిహేవియల్ విభాగంలో ఆమె తీసిన ఛాయాచిత్రానికి ఈ అవార్డును గెలుచుకుంది. వయోజన విభాగంలో భారతదేశం నుండి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మొదటి మరియు చిన్న వయసు కల అమ్మాయిగా ఆమె నిలిచింది. ఈ అవార్డు గ్రహీతలను లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్రకటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచున్న ఐశ్వర్య శ్రీధర్
ఎవరు: ఐశ్వర్య శ్రీధర్
ఎప్పుడు: అక్టోబర్ 19
హోమ్ కార్యదర్శి అజయ్ కుమార్ భల్ల పదవీకాలం 2021 వరకు పొడగింపు :
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సభ్య దేశాల లా అండ్ జస్టిస్ మంత్రుల 7వ సమావేశాన్ని వర్చువల్ మోడ్ లో భారత న్యాయ, న్యాయ, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు నిర్వహించారు.ఈ వేదిక ద్వారా గుర్తించిన ప్రాంతాలలో ఆలోచనలు, ఉత్తమ పద్ధతులు మరియు అనుభవాల మార్పిడిని ప్రోత్సహించాలని భారత పక్షం ఎస్సీఓ సభ్య దేశాలను కోరారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి ప్రోబోనో లీగల్ సర్వీసులను ప్రారంభించడం గురించి ఇందులో ఆయన ప్రస్తావించారు. ఈ వర్చువల్ సమావేశంలో చైనా,కజాఖ్స్తాన్,కిర్గిస్థాన్,పాకిస్తాన్,రష్యా,తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ దేశాల నుండి న్యాయమంత్రులు ఇందులో పాల్గొన్నారని న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: హోమ్ కార్యదర్శి అజయ్ కుమార్ భల్ల పదవీకాలం 2021 వరకు పొడగింపు
ఎవరు: అజయ్ కుమార్ భల్ల
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: అక్టోబర్ 19
మలబార్ డ్రిల్ లో మొదటి సారి పాల్గొంటున్న దేశంగా నిలిచిన ఆస్ట్రేలియా :
తూర్పు లద్దాక్ లో భారత్,చైనా,మద్య సరిహద్దు వివాదం రగులుతున్న నేపద్యంలో ఇదొక అత్యంత కీలక పరిణామం. యుద్దానికి సిద్దమవుతున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్,అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా దేశాలు ఒక్క తాటికి పైకి వస్తున్నాయి. బంగాళాఖాత,అరేబియా సముద్రంలో నవంబర్ లో జరగనున్న మలబార్ విన్యాసాల్లో అమెరికా,జపాన్ తో పాటు ఆస్ట్రేలియా దేశం కూడా పాల్గొంటుందని భారత్ అక్టోబర్ 19న ప్రకటించి౦ది. ఉమ్మడి శత్రువైన చైనా కు వ్యతిరేకంగా భారత్,అమెరికా,జపాన్,ఆస్ట్రేలియా దేశాలు చతుర్బుజ కూటమి (క్వాడ్) పేరిట జట్టు కట్టాయి. ప్రతిసంవత్సరం జరిగే ఈ విన్యాసాల్లో భారత్ అమెరికా,జపాన్ నావికా దళాలు పాల్గొనడం జరుగుతుంది. తాజాగా ఇందులో ఆస్ట్రేలియా కూడా వచ్చి చేరింది. క్వాడ్ లో ని నాలుగు సబ్య దేశాలు సైనిక స్థాయిలో ఒకే వేదిక పైకి రావడం కూడా ఇదే తొలిసారి.
క్విక్ రివ్యు:
ఏమిటి: మలబార్ డ్రిల్ లో మొదటి సారి పాల్గొంటున్న దేశం గా నిలిచిన ఆస్ట్రేలియా :
ఎవరు: ఆస్ట్రేలియా
ఎప్పుడు: అక్టోబర్ 19
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |