Daily Current Affairs in Telugu 17-01-2021
శాస్త్రీయ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా కన్నుమూత :
ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ (89 జనవరి 17న బాంద్రా లూని తన నివాసం లో కన్నుమూసారు. వైద్యులు వచ్చి పరీక్షించే లోగానే ఆయన తుదిశ్వాస విడిచారు. శాంతాక్రాజ్ శ్మశాన వాటిక లో సాయంత్రం ఆయన అంతక్రియలు పూర్తయ్యాయి. 2019 లో మెదడులో రక్త స్రావం కారణంగా ఆయన శరీరం లో ఎడమ భాగం అచేతనంగా మారింది. యుపిలో ని బాదాయు లో జన్మించిన ఈయన తన తండ్రి నుంచే శాస్త్రీయ సంగీతం లో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు. తర్వాత అంచెలు అంచెలు గా రాణించారు.1991 లో పద్మ శ్రీ ,2006లో పద్మ భూషణ్ ,2018 లో పద్మ విభూషణ్ పురస్కారాలు పొందారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: శాస్త్రీయ సంగీత విద్వాంసుడు కన్నుమూత :
ఎవరు: గులాం ముస్తఫా
ఎక్కడ:యుపి
ఎప్పుడు: జనవరి 17
అమెరికా అధ్యక్షుని బైడేన్ ప్రభుత్వం లో 20మంది భారతీయులక దక్కిన కీలక పదవులు :
అమెరిక అద్యక్ష బాద్యతలు చేపట్టబోతున్న బైడేన్ తన ప్రభుత్వంలో ఇండియన్ అమెరికన్ లకు ఎక్కువ ప్రాదాన్యత ను ఇచ్చారు. మొత్తం 20మందికి కీలక పదవులు ఇవ్వగా అందులో 13మంది మహిళకు కావడం విశేషం. 17మందికి శ్వేత సౌధం లో స్థానం కల్పించడం ఇంకో విశేషం చిరకాల౦ నుంచి తనకు మద్దతు దారునిగా ఉన్న వినయ్ రెడ్డి కి కూడా ఇందులో చోటు ఇచ్చారు.
నీరా టాండన్ :శ్వేత సౌధం లో పని చేస్తారు.మేనేజ్మెంట్ బడ్జెట్ విభాగం డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
వివేక్ మొర్తి :అమెరికా సర్జన్ జనరల్
వినయ్ రెడ్డి :డిరెక్టర్ స్పీచ్ రైటింగ్
వినీత గుప్తా: న్యాయ శాఖ లో అసోసియేట్ ,అటార్నీ జనరల్
ఉజ్రా జేయా: విదేశాంగ శాఖా లో అండర్ సెక్రటరి పౌర బద్రత ప్రజాస్వామ్యం ,మానవ హక్కుల వ్యవహారాలు చూస్తారు.
మాలా అడిగా :ప్రథమ మహిళా డాక్టర్ జిల్ బైడేన్ విధాన పర సలహాదారు (పాలసి డైరెక్టర్ )
గరిమా వర్మ : ప్రథమ మహిళా కు డిజిటల్ డైరెక్టర్
సబ్రీనా సింగ్ :శ్వేత సౌధం డిప్యుటీ ప్రెస్ సెక్రటరి
అయేషా షా:శ్వేత సౌధం లో డిజిటల్ వ్యూహం కార్యాలయం లో పార్టనర్ షిప్ మేనేజర్
సమీరా ఫైజలి: శ్వేత సౌధం లో జాతీయ ఆర్థిక మండలి లో డిప్యుటీ డైరెక్టర్
భరత్ రామమూర్తి : జాతీయ ఆర్ధిక మండలి డిప్యుటీ డైరెక్టర్
గౌతం రాఘవన్ :శ్వేత సౌధం లో అద్యక్ష వ్యక్తిగత సిబ్బంది వ్యవహారాలు డైరెక్టర్
వేదాంత్ పటేల్ :శ్వేత సౌధం లో అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరి
తరుణ్ చాబ్రా :జాతీయ బద్రత మండలి లో సాంకేతిక జాతీయ బద్రత సీనియర్ డైరెక్టర్
సుమోనా గుహ : దక్షిణాఫ్రికా వ్యవహారల సీనియర్ డైరెక్టర్
శాంతి కళా థిల్ : జాతీయ బద్రత మండలి లో ప్రజాస్వామ్యం ,మానవ హక్కుల వ్యవహారాల సమన్వయ కర్త
విదుర్ శర్మ :కరోన స్పందన బృందం సలహాదారు
నేహా గుప్తా : శ్వేత సౌధం లో అసోసియేట్ కన్సెల్
రీమ షా :డిప్యుటీ అసోసియేట్ కాన్సెల్
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా అధ్యక్షుని బైడేన్ ప్రభుత్వం లో 20మంది భారతీయులకు దక్కిన కీలక పదవులు
ఎవరు: భారత సంతతి అమెరికన్స్
ఎక్కడ అమెరికా
ఎప్పుడు: జనవరి 17
ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్ర పై మ్యుజియం ప్రారబించిన నున్న కేరళ ప్రభుత్వం :
ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమచరిత్రకు కళ్ళకు కట్టేలా కేరళా ప్రభుత్వం అలపూజ లో ఒక మ్యుజియం ను ప్రారంబించానుంది.ఈ తరహా మ్యుజియం దేశం లోనే ఇదే మొదటి సారి కావడం విశేషం. ఖండ ఖండాలకు విస్తరించడం లో పాటు కేరళ ను ముఖ్యంగా అలప్పూజ పై అత్యంత ప్రభావం చూపిన కార్మిక ఉద్యమం లో కీలక ఘట్టాలను ఆవిష్కరించే అమూల్యమైన పత్రాలు చిత్రాలను ఇందులో ప్రదర్శన కు ఉంచుతున్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వర్గ పోరాటానికి ,కార్మికుల ఉద్యమ స్పూర్తిని నేటి తరానికి తెలియజేసే ఈ మ్యుజియం కేరళా రాష్ట్ర పర్యాటక రంగానికి అదనపు ఆకర్షణ అవనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్ర పై మ్యుజియం ప్రారబించిన నున్న కేరళ ప్రభుత్వం
ఎవరు: కేరళ ప్రభుత్వం
ఎక్కడ: కేరళ
ఎప్పుడు:జనవరి 17
అమెరికా కొవిడ్ ప్రతిస్పందన బృందం లో భారత సంతతి వైద్యుడు విదుర్ శర్మ నియామకం:
అమెరికా కోవిద్ -19 ప్రతిస్పందన బృంద౦ లో పాలసి సలహా దరునిగా భారత సంతతి కి చెందిన వైద్య నిపుణుడు విదుర్ శర్మ ను నియమించారు.ఈ మేరకు విదుర్ శర్మ ను సలహా దారునిగా నియమిస్తూ అమెరికా అద్యక్షుడు అయిన జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.టీకా పంపిణి లో కార్యక్రమాన్ని వేగావంతంగా నిర్వహించేందుకు ప్రతి స్పందన బృందంలో భారత అమెరికన్ వైద్య నిపునుడికి స్థానం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఒబామా గారి హయంలో విధాన మండలి లో ఆరోగ్య విధాన సలహాదారునిగా విదుర్ శర్మ గారు బాద్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా కొవిడ్ ప్రతిస్పందన బృందం లో భారత సంతతి వైద్యుడు విదుర్ శర్మ నియామకం
ఎవరు: విదుర్ శర్మ
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జనవరి 17
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |