Daily Current Affairs in Telugu 16-01-2021
ప్రథమ మహిళ డిజిటల్ డైరెక్టర్‌గా ఇండియన్-అమెరికన్ గరిమ వర్మ ఎంపిక :
భారతీయ-అమెరికన్ గరిమా వర్మను తన డిజిటల్ డైరెక్టర్ గా మరియు మైఖేల్ లారోసా ప్రెస్ సెక్రటరీగా ప్రకటించినట్లు కాబోయే అమెరికా అద్యక్షుడు జో బైడెన్ పరివర్తన బృందం ప్రకటించింది.ఆమె ఇంతక ముందు జో బైడెన్- కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రేక్షకుల అభివృద్ధి మరియు కంటెంట్ వ్యూహకర్తగా పనిచేశారు. ప్రచారంలో చేరడానికి ముందు, వర్మ కంటెంట్ బృందంతో స్వచ్చంద సేవకురాలుగా,దేశవ్యాప్తంగా బైడెన్-హారిస్ వాలంటీర్లకు పంపిణీ కోసం గ్రాఫిక్స్ డిజైన్ రూపకల్పన చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రథమ మహిళ డిజిటల్ డైరెక్టర్‌గా ఇండియన్-అమెరికన్ గరిమ వర్మ ఎంపిక
ఎవరు: గరిమ వర్మ
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జనవరి 16
అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ లో చోటు దక్కించుకున్న ఆర్మీ అధికారి :
అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సంపాదించారు. భారత ఆర్మీ అధికారి .శీర్షాసనం వేయడమే ఒక సాహసం అలా౦టిది ర్శసనం లో మరో ఫీట్ చేయడం సవాలే అలాంటిది 50ఏళ్ల వయుసులో ఆ సవాల్ ను అలవోకగా చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. ఒక ఆర్మీ అధికారి ఏకంగా 63 నిమిషాల పాటు శీర్షాసనంలో ఉండి ఆరు వేల సార్లు తన కళ్ళను వెనక్కి తగిలించి కష్టతరమైన ఫీట్ ను చేసారు. ఓడిశా లో బలేష్వర్ జిల్లా ఔషద బ్లాక్ పరిధి లోని బంగూర్ గ్రామానికి చెందిన లక్ష్మి దర్ భుయాన్ 1992 నుంచి భారత సైన్యంలో పని చేస్తున్నారు. ఈ 50ఏళ్ల లెఫ్టినెంట్ కల్నల్ కు మారథాన్ రన్నర్ గానే కాక యోగాలోను 34ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుత రికార్డ్ తో పాటు ఆయన కోకా కోలా బుక్ ఆఫ్ రికార్డ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ,బెస్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ,ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు ను లిఖిన్చుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అరుదైన ఫీట్ చేసి గిన్నిస్ లో చోటు దక్కించుకున్న ఆర్మీ అధికారి
ఎవరు: ఆర్మీ అధికారి లక్ష్మి దర్ భుయాన్
ఎక్కడ: ఓడిశా లో
ఎప్పుడు: జనవరి 16
భారత్ లో ప్రారంబించిన కోవిద్ వైరస్ వ్యాక్సిన్ కోవి షీల్డ్ :
కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన కష్టాలను గుర్తుచేస్తూ స్వదేశంలో తయారు చేసిన వ్యాక్సిన్ గురించి దానిని అందుబాటులోకి తీసుకువస్తు ప్రదాని నరేంద్ర మోడి గారు జనవరి 16న కొవిడ్ టీకాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్స్ పర్డ్ /అస్త్రాజేనిక సాయంతో సీరం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా లో రూపొందించిన “కోవి షీల్డ్ “ భారత్ బయోటెక్ లో స్వదేశి పరిజ్ఞానం తో తయారు చేసిన “కోవ్యాగ్సిన్” టీకాలను అత్యవసర వినియోగం లోకి తెచ్చారు. దేశ వ్యాప్తంగా 3,352 కేంద్రాల్లో దీన్ని ప్రారంబించారు. తొలి విడుతగా 1,91,181 మంది పారిశుధ్య కార్మికులకు కింది స్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందారు. డిల్లీ మరియు పది రాష్ట్రాల్లో కూడా ఈ టీకాను ఉపయోగించారు. కాగా దేశం లో కోవిద్ వ్యాక్సిన్ ను డిల్లీ రాష్ట్రానికి చెందిన పారిశుధ్య కార్మికుడు సుషీల్ కుమార్ కు డిల్లీ ఎయిమ్స్ లో భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్సిన్ ను ఈయన కు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రము లో తొలి టీకా తీసుకున్న పారిశుధ్య కర్మికురాలు గా కిష్టమ్మ ఈమె గాంధీ ఆసుపత్రి పారిశుధ్య కర్మికురాలిగా పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ లో ప్రారంబించిన కోవిద్ వైరస్ వ్యాక్సిన్ కోవి షీల్డ్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: జనవరి 16
భారత సంతతి అమెరికా ప్రొఫెసర్ కి దక్కిన అరుదైన గౌరవం :
భారత సంతతి అమెరిక ప్రొఫెసర్ అయిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అరుదైన ఘనత సాదించారు. అమెరికా ప్రతిష్టాత్మక కెరీర్ లో ఫెలోషిప్ అవార్డును సాధించారు. మెదడు పై చేస్తున్న ప్రయోగానికి గాను ఆయనకు యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ దీనిని ప్రదానం చేసింది. ఇందుకు గాను ఐదేళ్ళ కాలం లో రూ.13 కోట్ల ఫెలోషిప్ అందుకున్నాడు. కాశ్మీర్ కు చెందిన ముబారక్ ఉస్సేన్ సయ్యద్ అమెరికా లో న్యు మెక్సికో యునివర్సిటీ న్యూరాలాజి విబాగం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కాశ్మీర్ లోని భుద్గాం జిల్లాకు చెందిన సయ్యద్ స్థానికంగా నే విద్య ను అబ్యాసించారు. జర్మని లో పిహెచ్ డి పూర్తి చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత సంతతి అమెరికా ప్రొఫెసర్ కి దక్కిన అరుదైన గౌరవం
ఎవరు: ముబారక్ ఉస్సేన్ సయ్యద్
ఎప్పుడు:జనవరి 16
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |