Daily Current Affairs in Telugu 30-01-2021
భారత్ బయోటెక్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్ దేశ సంస్థ :
ఔషద తయారీలో ఉన్న బ్రిటన్ సంస్థ జి.ఎస్.కే ( గ్లాక్సో స్మిత్ క్లైన్) మలేరియా వ్యాక్సిన్ ల తయారిని భారత్ లో చేపట్టనుంది. ఇందుకోసం వ్యాక్సిన్ ల తయారీలో ఉన్న హైదరాబాద్లో ని ప్రముక కంపెని భారత్ బయోటెక్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మలేరియా టీకా (ఆర్ టిఎస్,ఎస్/ఏ ఎస్ 01) తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్ బయోటెక్ జిఎస్ కే కు బదిలీ చేస్తుంది. అలాగే టీకా తయారీలో ఉపయోగించే సహాయ ఔషదాన్ని కూడా ఇదీ సరఫరా చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ బయోటెక్ సంస్థ తో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్ దేశ సంస్థ
ఎవరు: బ్రిటన్ దేశ సంస్థ
ఎప్పడు: జనవరి 30
ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన ఐటి సంస్థ గా నిలిచిన యాక్సేంచర్ సంస్థ :
ప్రపంచంలోనే అత్యంత విలువైన,బలమైన ఐటి సర్వీసెస్ బ్రాండ్గా యాక్సెంచర్ కంపెని ముందువరుస లో ఉంది. యాక్సెంచర్ తర్వాత ఐబిఎం కంపెని రెండో స్థానంలో భారత ఐటి దిగ్గజ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కు (టిసిఎస్) మూడో స్థానంలో నిలిచాయి. జనవరి 30 విడుదల అయిన బ్రాండ్ ఫైనాన్స్ -2021 నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. కాగా యీక్సేంచర్ బ్రాండ్ వాల్యు 26 బిలియన్ డాలర్లుగా ఐబిఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లు గా ఉంది. టిసిఎస్ యొక్క బ్రాండ్ విలువ 2020 తో పోలిస్తే 2021 లో 1.4 బిలియన్ డాలర్లు ఎగిసి 14.9బిలియన్ డాలర్లుగా చేరింది. నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్ సంస్థ ఉంది. మొత్తంగా టాప్ 10 లో భారత్ నుంచి పలు కంపెనిలు చోటు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన ఐటి సంస్థ గా నిలిచిన యాక్సేంచర్ సంస్థ
ఎవరు: యాక్సేంచర్ సంస్థ
ఎప్పడు: జనవరి 30
ఆసియా క్రికెట్ కౌన్సిల్ అద్యక్షుడిగా ఎన్నికయిన జై షా :
బిసిసిఐ కార్యదర్శి గా ఆసియా క్రికెట్ కౌన్సిల్ గా (ఏసిసి )అద్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జనవరి 30ఏసిసి సభ్య దేశాల ప్రతినిధులు షా ను అద్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చీఫ్ నజ్మల్ హసన్ ఖాళి చేసిన స్థానాన్ని షా భర్తీ చేయనున్నారు. ఆసియా పరిధిలో క్రికెట్ దేశాలు ఏసిసి పరిధిలో ఉంటాయి. ఆసియా కప్ ను నిర్వహించేది ఏసిసినే. 2020లో కరోనా కారణంగా ఈ టోర్నీ ఈ ఏడాది జూన్ కు వాయిదా పడగా శ్రీలంక లేదా బంగ్లా దేశ్ అతిత్యం ఇచ్చే అవకాశాలున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా క్రికెట్ కౌన్సిల్ అద్యక్షుడిగా ఎన్నికయిన జై షా
ఎవరు: జై షా
ఎప్పడు: జనవరి 30
ఆసియా ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న షూటర్ చేనాయ్ :
ఆసియా ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో హైదరాబాద్ లో షూటర్కైనన్ చేనాయ్ స్వర్ణంతో మెరిసారు. కరోనా విరామం తరువాత జరిగిన తొలి ఆసియా అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ లో అతను సత్తా చాటాడు. కువైట్ షూటింగ్ సమాఖ్య అద్వర్యంలో ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ టోర్నీలో పురుషుల ట్రాప్ లో టైటిల్ నెగ్గారు. ఈ చాంపియన్ షిప్ లో భారత షూటర్లు అద్బుత ప్రదర్శనతో పథకాలు పట్టికలో అగ్రస్థానం లో నిలిచారు. 22దేశాల నుంచి 274 మంది షూటర్లు పాల్గొన్న ఈ టోర్నీ లో భారత్ నాలుగు స్వర్ణాలు రెండు రజతాలు అయిదు కాంస్య పథకాలతో మొత్తం 11 పథకాలు ఖాతాలో వేసుకొని అగ్రస్థానం దక్కించుకుంది. చేనాయ్ తో పాటు సౌరభ్ చౌదరి (పురుషుల 10.మీ ఎయిర్ పిస్టల్ )దివ్యాన్ష్ సింగ్ (పురుషుల 10.మీ ఎయిర్ రైఫిల్ )రాజేశ్వరి కుమారి (మహిళల ట్రాప్ )పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా ఆన్ లైన్ షూటింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకున్న షూటర్ చేనాయ్
ఎవరు: షూటర్ చేనాయ్
ఎప్పడు: జనవరి 30
కేరళ కోజికోడ్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి ‘జెండర్ పార్క్:
300 కోట్ల రూపాయలతో మూడు టవర్ల జెండర్ పార్క్ ను కోజికోడ్ లో ప్రారంబించడానికి కేరళ ప్రభుత్వం సిద్దం అయింది. లింగ సమానత్వం పై అంతర్జాతీయ సదస్సు (ICGE) యొక్క రెండవ ఎడిషన్ ను సందర్బంగా ఈ పార్క్ ను క్రియాత్మకంగా మారనుంది. ఈ పార్క్ ను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫిబ్రవరి 11-13 మద్య ప్రారంబించనున్నారు. ICGE యొక్క రెండవ ఎడిషన్ ప్రారంబోత్సవం ను లింగ ఆదారిత సమస్యల పరిష్కారానికి సంబంధిత విషయాలను స్పృశించే లక్ష్యంతో ఈ జెండర్ పార్క్ స్థాపించబడింది. ఇది ఆన్ క్యాంపస్ మరియు ఆన్ క్యాంపస్ కార్యకలాపాలను నిర్వర్తిస్తూ మరియు వ్యక్తుల ద్వారా సమాజంను శక్తి వంతం చేయడానికి పని చేస్తుంది. ఈ జెండర పార్క్ ను కేరళ ప్రభుత్వం 2013 లో స్థాపించింది. ఇది కేరళ లో లింగ సమానత్వం కోసం మరియు సాదికరత కోసం పని చేసే ఒక ఆలోచన .
క్విక్ రివ్యు :
ఏమిటి: కేరళ కోజికోడ్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి ‘జెండర్ పార్క్
ఎవరు: కేరళ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: కేరళ
ఎప్పడు: జనవరి 30
షహీద్ దివాస్ గా జనవరి 30 :
ప్రతి సంవత్సరం జనవరి 30న భారతదేశం అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివాస్ జరుపుకుంటుంది. భారత దేశ స్వాతంత్ర్య౦ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన అమరవీరులను గౌరవించటానికి ఈ రోజు గుర్తించబడింది. జనవరి 30 1948న బిర్లా హౌస్‌లో తన సాయంత్రం ప్రార్థనల సందర్భంగా, ది నేషన్ ఫాదర్ గా పిలువబడే మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. వారిని స్మరిస్తూ ఈ జనవరి 30 రోజును షహీద్ దివాస్ గా జరుపుకుంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: షహీద్ దివాస్ గా జనవరి 30
ఎప్పడు: జనవరి 30
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |