Daily Current Affairs in Telugu 28-11-2020
ఏ.ఐ.సిసీ తాత్కాలిక కోశాదికరిగా పి.కే బన్సాల్ నియామకం :
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి తాత్కాలిక కోశాదికరిగా కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ గారు నియమితులయ్యారు. ఇప్పటి వరకు కోశాధికారిగా ఉన్న అహ్మద్ పటేల్ గారు కోవిద్-19 కారణంగా కన్ను మూయడం తో ఆయన స్థానం లో తాత్కాలిక బన్సాల్ ను నియమించి నట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నవంబర్ 28న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. బన్సాల్ కుమార్ గారు ప్రస్తుతం పార్టీ పరిపాలన వ్యవహారల బాద్యుడిగా ఉన్నారు. చండీగడ్ కు చెందిన ఈయన నాలుగు సార్లు లోక్ సభ కు ఎన్నిక అయ్యారు .మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో పార్లమెంటరి వ్యవహారాలు, కేంద్ర జలవనరుల రైల్వే శాఖ మంత్రిగా పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏ.ఐ.సిసీ తాత్కాలిక కోశాదికరిగా పి.కే బన్సాల్ నియామకం
ఎవరు: పి.కే బన్సాల్
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: నవంబర్ 28
షాంగై సహకార సంస్థ సదస్సుకు తొలిసారిగా ఆథిత్యం ఇస్తున్న భారత్ :
వర్చువల్ విధానం లో నవంబర్ 30న నిర్వహించనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సివో) సదస్సుకు భారత్ తొలి సారిగా ఆథిత్యం ఇవ్వనుంది. భారత్ తరపున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అద్యక్షత వహించనున్నట్లు విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఎ)నవంబర్ 28 న ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సుకు రష్యా,చైనా,కిజికిస్తాన్,కిర్గిస్తాన్,తజికిస్తాన్,ఉజ్బెకిస్తాన్ దేశాల,ప్రధానులు హాజరవుతున్నట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ తరపున విదేశీ వ్యవహారాల పార్లమెంటరి కార్యదర్శి సదస్సుకు హాజరవుతారని తెలిపింది. ఈ సమావేశం లో వాణిజ్య ఆర్ధిక పరమైన అంశాల పై ప్రదానంగా చర్చించినట్లు వివరించారు. ఎస్.సి.వో సభ్య దేశాలతో పాటు పరిశీలన దేశాలైన ఆఫ్గనిస్తాన్,బెలారస్,ఇరాన్,మంగోలియా,సైతం ఈ సదస్సులో పాల్గొనబోతున్నాయని తెలిపింది. ఇందులో భారత్ ఆహ్వానం మేరకు తుర్కుమేనిస్తాన్ దేశం అతిదిగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: షాంగై సహకార సంస్థ సదస్సుకు తొలిసారిగా ఆథిత్యం ఇస్తున్న భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: : నవంబర్ 28
సముద్ర బద్రత సహకరం పై త్రైపాక్షిక సమావేశం లో పాల్గొన్న శ్రీలంక భారత్,మాల్దీవులు దేశాలు :
హిందు మహాసముద్రం ప్రాంతంలో తలెత్తే బద్రత పరమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి మున్మందు మరింత సహకరించుకోవాలని భారత్ శ్రీలంక ,మాల్దీవులు దేశాలు తీర్మానించాయి. ఉన్నత స్థాయి త్రైపాక్షిక సమవేశంలో ఈ మేరకు మూడు దేశాల ప్రతినిధులు నవంబర్ 28న మూడు దేశాల ప్రతినిధులు పలు అంశాలపైన చర్చించారు. శ్రీలంక ఆతిత్యమిస్తున్న ఈ సమావేశానికి భారత్ తరపున జాతీయ బద్రత సలహాదారు అజిత్ దోవల్ హాజరు అయ్యారు. చర్చల అనంతరం ఉమ్మడి ప్రకటనను శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖా విడుదల చేసింది. హిందూ మహా సముద్రంలో శాంతిని పరిరక్షించేందుకు పాటు పడాలని మూడు దేశాలు ప్రతి నిధులు నిర్ణయించినట్లు ప్రకటనలో తెలిపారు. సంయుక్త విన్యాసాలు,సముద్ర బద్రత ,ముప్పు ,సామర్థ్య నిర్మాణం ,సముద్ర కాలుష్యం పై పరస్పరం సహకారం పై చర్చించుకున్నారు. ఉగ్రవాదం సైబర్ బద్రత సముద్రాల పై వాతావరణ మార్పు ప్రభావం మానవ ఆయుద అక్రమ రవాణా తదితర అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిపియన్ మహా సముద్రం ప్రాంతాల్లో ఆధిపత్యం కోసం చైనా కుయుక్తులను పాల్పడుతున్న నేపద్యం లో ఈ సమావేశం ప్రాదాన్యం సంతరించుకుంది. శ్రీలంక ఆథిత్యం ఇవ్వడం ఇది నాలుగో సారి చివరగా 2014 లో డిల్లి లో ఈ సమావేశం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సముద్ర బద్రత సహకరం పై త్రైపాక్షిక సమావేశం లో పాల్గొన్న శ్రీలంక భారత్,మాల్దీవులు
ఎవరు: శ్రీలంక భారత్,మాల్దీవులు
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు: : నవంబర్ 28
ఫిఫా ర్యాంకింగ్ లో 104స్థానానికి చేరుకున్న భారత్ :
తాజాగా ప్రకటించిన ఫిఫా ర్యాంకింగ్స్ లో భారత్ జాతీయ జట్టు 104వ స్థానం లో నిల్చింది. అక్టోబర్ 2020 ర్యాంకింగ్స్ లో భారత జట్టు 108వ స్థానంలో నిలిచింది. రెండు నెలలో సెప్టెంబర్ 109వ స్థానంలో ఉన్న భారత దేశం 5 స్థానాలకు ఎగబాకింది. ఇ౦దులో ప్రపంచ ర్యాంకింగ్ దృష్ట్యా మొదటి ఆరు స్థానాలు మారలేదు .అలాగే ర్యాంకింగ్స్ లో బెల్జియం ఆధిక్యం లో కొనసాగుతుంది.తరువాత ఫ్రాన్స్ .బ్రెజిల్ ,ఇంగ్లాండ్ పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాలు ఉన్నాయి.ఎనిమిదో స్థానంలో ఉన్న ఉరుగ్వే పరస్పరం మార్చుకున్న స్థానం లో అర్జెంటిన దేశం ఏడవ స్థానం లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫిఫా ర్యాంకింగ్ లో 104స్థానానికి చేరుకున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: : నవంబర్ 28
సిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం :
ఆర్కిటిక్ లోని సిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని రష్యా విజయవంతగా పరీక్షించింది. సముద్రంలోని యుద్దనౌక ను అడ్మిరల్ గోర్ష్కోవ్ సిర్కాన్ హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ని పేల్చారు. ఇది బారేట్స్ సముద్రం లో 450 కిలో మీటర్ల దూరం లో ఉన్న నావికా లక్ష్యాన్ని మాక్ 8కంటే ఎక్కువ వేగం తో డీ కొట్టింది. గత నెలల్లో సముద్రం లో మోహరించిన యుద్ద నౌక సిర్కాన్ క్షిపణి తో బారేట్స్ సముద్రం లో నావికా లక్ష్యాన్ని పూర్తి చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సిర్కాన్ హైపర్ సోనిక్ క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించిన రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎక్కడ: రష్యా దేశం
ఎప్పుడు: : నవంబర్ 28
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |