Daily Current Affairs in Telugu 28-01-2021
భారత్ లో జరగనున్న 2022 ఆసియా మహిళల పుట్ బాల్ క్రీడలు :
వచ్చే ఏడాది 2022లో మహిళల ఆసియా కప్ పుట్ బాల్ క్రీడలకు భారత్ ఆథిత్యం ఇవ్వనుంది. 2022 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6వరకు ఈ టోర్నీ భారత్ లోజరగనుందని ఆసియా పుట్ బాల్ సమాఖ్య ప్రకటించింది. ఆసియా కప్ 2022లో భారత్ తో సహా 12 జట్లు ఇందులో పోటీ పడతాయి. ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటాయి. 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్ కు ఆసియా కప్ అర్హత టోర్నీగా పని చేస్తుంది. గత కొన్నేళ్ళుగా భారత్ పుట్ బాల్ క్రీడలో బాగా వృద్ది చెందింది అని ఏఎఫ్సి కార్యదర్శి డాటో విండ్ సర్ అన్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ లో జరగనున్న 2022 ఆసియా మహిళల పుట్ బాల్ క్రీడలు
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: జనవరి 28
అవినీతి సూచిలో 86 వ స్థానం లో నిలిచిన భారత్ :
ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతికి సంబంధించి నిర్వహించిన సర్వేలో మన దేశం గత ఏడాది కన్నా మరో ఆరు స్థానాలు దిగువకు పడి పోయిందని ట్రాన్స్ ఫరేన్సి ఇంటర్నేషనల్ వెల్లడించింది. 2020కి సంబంధించిన 180దేశాలు అవినీతి సూచీని ఆ సంస్థ జనవరి 28 విడుదల చేసింది. సున్నస్కోర్ సాదించిన దేశాలు అవినీతి మరకలు అంటని(క్లీన్)విగా పరిగణిస్తూ ఈ ర్యాంకులను విడుదల చేసారు. దీని ప్రకారం 2020లో మన దేశంలో స్కోరు 40కాగా మొత్తం 180 దేశాలలో 86వ స్థానంలో నిలిచింది. 2019సర్వే ప్రకారం మన దేశంలో 41స్కోరుతో 80వ స్థానంలో ఉండింది. అంటే ఏడాది కాలంలో మన దేశంలో అవినీతి పెరిగిందే కానీ తగ్గించలేదని స్పష్టం అవుతుంది. తాజా నివేదిక ప్రకారం న్యూజిలాండ్ ,డెన్మార్క్ ,88 స్కోరుతో అవినీతి బాగా తక్కువ ఉన్న దేశాలుగా అగ్రస్థానం లో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏఏమిటి : భారత్ లో జరగనున్న 2022 ఆసియా మహిళల పుట్ బాల్ క్రీడలు
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: జనవరి 28
ఈఐయు సమర్పించిన నివేదిక ఆరోగ్య సూచికలో పదవ స్థానం లోభారత్ :
ఆసియా ఫసిఫిక్ దేశాలలో వ్యక్తిగత ఆరోగ్య బద్రత విషయమై కొత్తగా ప్రారంబం అయిన ఆరోగ్య సూచిలో భారత దేశానికి పదో ర్యాంకు (10/11) వచ్చింది. ది ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయు) నివేదిక ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ జాబితాలో ఇండోనేసియ చివరి స్థానం లో (11) ఉంది. అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలతో సింగపూర్ అన్నిటి కన్నా అగ్ర స్థానంలో ఉండగా తర్వాత తైవాన్,జపాన్,ఆస్ట్రేలియా లు వరుస స్థానాలలో ఉన్నాయి. చైనా,మలేసియ,దక్షిణ కొరియా,థాయ్ లాండ్, న్యూజిలాండ్ దేశాలు మద్యస్థంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంటుంది. వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఆరోగ్య సమాచారం సేవలు సాంకేతికత విదానాలు ఇలా నాలుగు విభాగాలుగా చేసి మొత్తం 27అంశాలను ఈ సూచీ పరిశీలిచింది.
క్విక్ రివ్యు :
ఏఏమిటి : ఈఐయు సమర్పించిన నివేదిక ఆరోగ్య సూచికలో పడవ స్థానం లోభారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: జనవరి 28
అగ్రికల్చరల్ పంప్ పవర్ కనెక్షన్ ను పాలసి ని ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం :
మహారాష్ట్ర లో ముఖ్యమంత్రి ఉద్దావ్ తాక్రే గారు వ్యవసాయ పంపు విద్యుత్ కనెక్షన్ విదానాన్ని అదికారికంగా ప్రారంబించారు. కృషి పంప్ ఎలక్ట్రిసిటి కనెక్షన్ విధానంద్వారా రైతులకు తక్షణ విద్యుత్ కనెక్షన్ అందించడానికి విద్యుత్ బిల్లు బకాయిలపై వృద్దికి ఉపశమనం కలిగించడం మరియు ఆలస్యపు చార్జిలలో కలిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం సహకారాన్ని విస్తరిస్తు౦డగా దీర్గకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను తొలగించాలని ఆయన రైతులను కోరారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : అగ్రికల్చరల్ పంప్ పవర్ కనెక్షన్ ను పాలసి ని ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : మహారాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: మహారాష్ట్ర
ఎప్పుడు: జనవరి 28
ఉత్తమ ఎన్నికల నిర్వహణ 2020లో జాతీయ అవార్డును గెలుచుకున్న మేఘాలయ :
జాతీయ ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్ అవార్డులు-2020లో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) చేత ఎన్నికలలో సమాచార సాంకేతిక అనువర్తనాలను ఉపయోగించడంలో ప్రత్యేకతకు మేఘాలయ ప్రధాన ఎన్నికల అధికార కార్యాలయం ఎంపికైంది. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారు ఈ అవార్డును వర్చువల్ గా ప్రదానం చేశారు. మొత్తం ఎన్‌రోల్‌మెంట్ టు ఎలక్షన్స్ (ఇ2ఇ) ప్రక్రియలో సిఇఒ కార్యాలయం చేస్తున్న ఎన్నికల కార్యకలాపాల్లో నిరంతర౦గా మరియు స్థిరమైన ఐటి అప్లికేషన్ ఉపయోగించిన ప్రయత్నాలకు గాను ఈ అవార్డు లబించింది.సాధారణ మరియు వికలాంగుల (పిడబ్ల్యుడి) అన్ని వర్గాల ఓటర్ల ప్రయోజనం కలుగచేస్తుంది..ఎసిఐ నిరంతరం ఎన్నికల సమయాన్ని కవర్ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. వాటిలో ముఖ్యంగా ఓటరు పోర్టల్, ఓటరు హెల్ప్‌లైన్ అనువర్తనం, ఎస్ఎంఎస్, 1950 హెల్ప్‌లైన్, రాజకీయ పార్టీ నమోదు మరియు ఆన్‌లైన్ ట్రాకింగ్ వంటివి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఉత్తమ ఎన్నికల నిర్వహణ 2020 జాతీయ అవార్డును గెలుచుకున్న మేఘాలయ
ఎవరు: : మేఘాలయ
ఎక్కడ: : మేఘాలయ
ఎప్పుడు: జనవరి 28
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |