Daily Current Affairs in Telugu 26&27-01-2021
ఎయిర్ మార్షల్ శ్రీనివాస్ కు దక్కిన విశిష్ట సేవా పురస్కారం :
భారత వాయుడలం సేనలో ఎయిర్ వైస్ మార్షల్ గా పని చేస్తున్న తెలంగాణ కు చెందిన అధికారి విష్ణు బోట్ల నాఫరాజ్ శ్రీనివాస్ కు గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా విశిష్ట సేవా పురస్కారం లబించింది. గత ఏడాది జులై ల ఒకటో తేది నుంచి ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ విధులు నిర్వర్తించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో చేరిన తొలి వ్యక్తి శ్రీనివాస్. రక్షణ రంగంలో విశిష్ట అనుభవం ఉన్న శ్రీనివాస్ బడ్జెటింగ్ ఫర్ ఇండియన్ డిఫెన్స్ ఇష్యుస్ ఆఫ్ కంటెంపరరి రిలవెన్స్ అండ్ ఇంప్లి కేశన్స్ ఫర్ ఇండియా 2010 పుస్తకాలను ఆయన రచించాడు. డిల్లీ లోని సెంటర్ ఎయిర్ పవర్ స్టడీస్ (సిఏపిఎస్) లో పరిశోదక విద్యార్థిగా ఉన్న సమయం లో ఆయన వీటిని రాశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎయిర్ మార్షల్ శ్రీనివాస్ కు దక్కిన విశిష్ట సేవా పురస్కారం
ఎవరు: శ్రీనివాస్
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 27
అణ్వాయుధ ఒప్పందాన్ని పొడగించిన రష్యా దేశం :
అమెరికా కుదుర్చుకున్న న్యూ స్టార్డ్ అణ్వాయుధ ఒప్పందాన్ని రష్యా దేశం మేరో ఐదేళ్ళు పొడగించింది. ఈ మేరకు జనవరి 26న ప్రవేశ పెట్టిన తీర్మానానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమ ఆమోదం తెలిపింది. త్వరలో ఎగువ సభ కూడా ఆమోదించింది. 2010 లో బరాక్ ఒబామా అద్యక్షుడిగా ఉన్న సమయం లో ఈ న్యూ స్టార్ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం అద్యక్షుడిగా ఉన్న బైడెన్ అప్పటి ఉపాద్యక్ష హోదాలో ఈ ఒప్పందం కుదరడంలో అప్పట్లో కీలక పాత్ర పోషించారు. దీని ప్రకారం రెండు దేశాల అణ్వస్త్ర ఆయుదాల మోహరింపు 1550 కి మించి ఉండకూడదు. ఈ ఒప్పందం గడువు ఫిబ్రవరి 05 తో ముగియనుంది. అయితే జనవరి 26న రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బైడెన్ జరిపిన సంభాషణ లో కూడా ఈ ఒప్పందం పై చర్చ జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వాయుధ ఒప్పందాన్ని పొడగించిన రష్యా దేశం
ఎవరు: రష్యా దేశం
ఎప్పుడు: జనవరి 27
అమెరికా కాంగ్రెస్ లో కమిటి లో ఇద్దరు భారతీయులకు దక్కిన కీలక పదవులు :
అమెరికా కాంగ్రెస్ లో ని కీలక కాంగ్రెస్ కమిటీ లో భారత సంతతి కి చెందిన చట్టబర సబ్యులు ప్రమీల జయపాల్ ,రాజా కృష్ణ మూర్తి లకు చోటు దక్కింది.వీరి పేర్లు ప్రతినిధులను సభ స్పీకర్ నాన్సీ పెలోసీ సిపార్సు చేసారు.55ఏళ్ల జయపాల్ కు కీలక మైన బడ్జెట్ కమిటీ లో చోటు లబించింది.అమెరికా బడ్జెట్ ప్రక్రియలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించింది.కోవిద్ -19 మహమ్మారి పోరాటంలో ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే కమిటీ కి 47 ఏళ్ల రాజా కృష్ణ మూర్తి ఎంపిక అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా కాంగ్రెస్ లో కమిటి లో ఇద్దరు భారతీయులకు దక్కిన కీలక పదవులు
ఎవరు: ప్రమీల జయపాల్ ,రాజా కృష్ణ మూర్తి
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: జనవరి 27
40 మందికి దక్కిన రాష్ట్రపతి జీవన్ రక్ష పురస్కారాలు :
ప్రజల ప్రాణాలను కాపడడానికి కృషి చేసిన 40 మందికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి జీవన్ రక్షా పతకాలను ప్రకటించింది. గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా కేంద్ర హోం శాఖ జనవరి 26న ఈ జాబితాను విడుదల చేసింది. సర్వోత్తమ జవన్ రక్షా ,ఉత్తమ జీవన్ రక్షా,జీవన్ రక్షా అనే మూడు విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది. సర్వోత్తమ పథకం కేరళ కు చెందిన 16ఏళ్ల బాలుడు మహ్మద్ మహిషిన్ కు మరణం తరువాత లబించింది. సముద్రం లో మునిగి పోతున్న ముగ్గురు సహాచరులను తన ప్రాణాలను పణంగా పెట్టి రక్షించినందుకు గాను ఆ బాలుడికి కేంద్ర ప్రభుత్వం మరణం అనంతరం ఈ ప్రతిస్థాత్మక పతకాన్ని ప్రకటించింది. ఉత్తమ జీవన్ రక్షా పతకానికి 8మందిని ,జీవన్ రక్షా పతకానికి 31మందిని ఎంపిక చేసింది.జీవన్ రక్షా పథకానికి ఎంపిక యైన 8మందిలో తెలంగాణ కు చెందిన కొరిపల్లి సృజన రెడ్డి ఆంధ్రప్రదేశ్ చెందిన కలగార్ల సాహితీలు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 40 మందికి దక్కిన రాష్ట్రపతి జీవన్ రక్ష పురస్కారాలు
ఎప్పుడు: జనవరి 26
జమ్మూ కష్మీర్ లో ప్రారంబం అయిన రెండు రోజుల మెగా పోయెట్రీ ప్రోగ్రాం :
జమ్మూ కాశ్మీర్ భూబాగం లో జె.కే అకాడమి ఆఫ్ కల్చర్ అండ్ లాంగ్వేజెస్ రేడియో మిర్చి సహకరంతో జనవరి 27,28 తేదిల్లో జమ్మూ కాశ్మీర్ లో రెండు రోజుల మెగా కవితా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దేశంలో అగ్రశ్రేణి హింది ,ఉర్దూ కవులు ,బాలీవుడ్ గేయ రచయితలు ,రచయితలు ఇందులో పాల్గొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జమ్మూ కష్మీర్ లో ప్రారంబం అయిన రెండు రోజుల మెగా పోయెట్రీ ప్రోగ్రాం
ఎవరు: జమ్మూ కష్మీర్
ఎక్కడ: జమ్మూ కష్మీర్
ఎప్పుడు: జనవరి 26
తెలంగాణ లో షి పాహి అనే ఒక నూతన ఇన్షి యేటివ్ ను ప్రారంబించిన సైబరాబాద్ పోలిస్ స్టేషన్ :
తెలంగాణ రాష్ట్రంలో సైబరాబాద్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఒక నూతన ఇన్షియేటివ్ ను ప్రారంబించారు.సైబరాబాద్ లో పోలిస్ జనవరి 27న ప్రారంబించారు. ఇందులో తమ మహిళా సిబ్బందిని ఏకతాటి పైకి తీసుకురావడం మరియు డ్యూటీ లో వారిని ప్రేరేపించడం సైబరాబాద్ లో పోలిస్ 750 మంది మహిళా సిబ్బందికి ఒకరికి ఒకరు పరస్పరం సంబాశించుకోవడానికి మరియు ప్రేరేపించడానికి ఇది ఒక వేదికగా పని చేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ లో షి పాహి అనే ఒక నూతన ఇన్షి యేటివ్ ను ప్రారంబించిన సైబరాబాద్ పోలిస్ స్టేషన్
ఎవరు: తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ: సైబరాబాద్ పోలిస్ స్టేషన్
ఎప్పుడు: జనవరి 26
భారత గణతంత్ర్య దినోత్సవంగా జనవరి 26 :
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని గౌరవించటానికి 1950 నుండి ప్రతి సంవత్సరం జనవరి 26 న భారతదేశంలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమం తరువాత బ్రిటిష్ వారి పాలన నుండి స్వతంత్రమైంది. మరియు దాని తరువాత 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగంను ఆమోదం తెలుపబడింది.మరియు రాజ్యాంగం1950జనవరి జనవరి 26 అమల్లోకి రావడంతో దీనిని జరుపుకుంటారు. 2021 గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా జరిగిన వేడుకలకు ముఖ్య అతిధి లేకుండా జరిగింది. ఇప్పటి వరకు ఇంది మూడవసారి గణతంత్ర్య వేడుకలు ముఖ్యఅతిది లేకుండా జరుపుకోవడం ఇది మూడవ సారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత గణతంత్ర్య దినోత్సవంగా జనవరి 26
ఎవరు: భారత ప్రభుత్వం
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 26
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |