Daily Current Affairs in Telugu 21-01-2021
ఫ్లిఫ్ కార్ట్ విజయగాధ పై రచించిన పుస్తకానికి దక్కిన గాజా కేపిటల్ బహుమతి :
పాన్ మేకిల్మిన్ ఇండియా సంస్థ ఇటీవల ప్రచురించిన బీగ్ బిలియన్ స్టార్టప్ :ది అన్ టోల్డ్ ఫ్లిఫ్ కార్ట్ స్టొరీ పుస్తకం ను జనవరి 21న ప్రకటించిన గాజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ 2020 ను గెలుచుకుంది.పాత్రికేయులు మిహిర్ దలాల్ రచించిన ఈ పుస్తకం భారతీయ వాణిజ్యం పై వచ్చిన ఆరు ఉత్తమ పుస్తకాలలో అత్యుత్తమైనదిగా నిలిచింది.విజేతగా నిలిచిన వారికి రూ.15 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్లిఫ్ కార్ట్ విజయగాధ పై రచించిన పుస్తకానికి దక్కిన గాజా కేపిటల్ బహుమతి
ఎవరు: మిహిర్ దలాల్
ఎప్పుడు: జనవరి 21
అమెరిక అద్యక్ష పదవి స్వీకారించిన తరువాత ఆమోదం పంపిన తొలి బిల్లు వలసల సంస్కరణల బిల్లు :
అమెరికా కొత్త అద్యక్షుడు జో బైడేన్ కార్యాలయంలో తన తొలి రోజున వలసలపైన సమగ్రమైన సంస్కరణల బిల్లును కాంగ్రెస్ ఆమోదానికి పంపారు. ఇప్పుడు కొనసాగుతున్న చట్టం భారీ మార్పులను ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. వలసదారులను న్యాయమైన రక్షణ ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న వేలాది మంది పౌరసత్వానికి మార్గం సుగమం చేయడం తద్వారా గ్రీన్ కార్డుల కోసం పడిగాపుల కష్టాన్ని తగ్గించడం బిల్లు ఉద్దేశాలుగా పేర్కొన్నారు.యుఎస్ సిటిజన్ యాక్ట్ ఆఫ్ 2021 గా పేర్కొన్న ఈ బిల్లు కింద వలసల విధానానికి ఆన్దునికరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరిక అద్యక్ష పదవి స్వీకారించిన తరువాత ఆమోదం పంపిన తొలి బిల్లు వలసల సంస్కరణల బిల్లు
ఎవరు: జో బైడెన్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: జనవరి 21
జలాంతర్గామి రెస్క్యూ సహకారానికై భారత్, సింగపూర్ కుదురిన ఒప్పందం :
సైనిక సహకారాన్ని మరింతగా పెంచే ప్రయత్నంలో 2021 జనవరి 20 న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారతదేశం మరియు సింగపూర్ మధ్య రక్షణ మంత్రుల సంభాషణ (డిఎండి) యొక్క 5 వ ఎడిషన్ విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో, రెండు దేశాల నావికాదళాల మధ్య ‘జలాంతర్గామి రెస్క్యూ సపోర్ట్ అండ్ కోఆపరేషన్‌పై అమలుచేయాలనే ఒప్పందం’ కుదిరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు సింగపూర్ దేశ ప్రతినిధి డాక్టర్ ఎన్జి ఇంగ్ హెన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యు :
ఏమిటి:జలాంతర్గామి రెస్క్యూ సహకారానికై భారత్, సింగపూర్ కుదురిన ఒప్పందం
ఎవరు: భారత్, సింగపూర్
ఎప్పుడు: జనవరి 21
ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ని విడుదల చేసిన నీతి ఆయోగ్ :
ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటిటివ్‌నెస్‌తో పాటు2021 జనవరి 20 న ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ యొక్క రెండవ ఎడిషన్‌ను నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసింది. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 2 వ ఎడిషన్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ విడుదల చేశారు.దీని తొలి ఎడిషన్ 2019అక్టోబర్ 17న విడుదల చేసారు. దేశాన్ని ఒక ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం నిరంతర నిబద్ధతను సూచిక ప్రదర్శిస్తుంది. నివేదిక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆవిష్కరణ సామర్థ్యాలను మరియు పనితీరును పరిశీలిస్తుంది. ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఐదు ఎనేబుల్ పారామితులపై (‘హ్యూమన్క్యా పిటల్’,’ఇన్వెస్ట్మెంట్’,’నాలెడ్జ్వ ర్కర్స్’,’బిజినెస్ ఎన్విరాన్మెంట్’, ‘సేఫ్టీ అండ్ లీగల్ ఎన్విరాన్మెంట్’)పై ఆధారపడి ఉంటుంది. మరియు రెండు పనితీరు అంశాల (‘నాలెడ్జ్ అవుట్ పుట్’ మరియు ‘నాలెడ్జ్ విస్తరణ మేజర్ స్టేట్స్’అనే సంబందింత విభాగంలో కర్ణాటకరాష్ట్రము మొదటిస్థానంలో, మహారాష్ట్ర, తమిళనాడు వరుసగా ఉన్నాయి.కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో నగర రాష్ట్రాల విభాగంలో న్యుడిల్లి మొదటి స్థానంలో ఉంది.తరువాత చండీగడ్ ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో కొండ ప్రాంతాల కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మొదటి స్థానం లో ఉంది.
నగరాల కేటగిరీ లో
- డిల్లీ
- చండీగడ్
- డామన్ డయ్యు
- పుదుచ్చేరి
- గోవా
ఈశాన్య పర్వత ప్రాంతాల కేటగిరీ లో :
- హిమాచల్ ప్రదేశ్
- ఉత్తరాఖండ్
- మణిపూర్
- సిక్కిం
- మిజోరం
17 పెద్ద రాష్ట్రాల కెటగిరీ లో
- కర్ణాటక
- మహారాష్ట్ర
- తమిళనాడు
- తెలంగాణా
- కేరళ
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ని విడుదల చేసిన నీతి ఆయొగ్
ఎవరు: నీతి ఆయొగ్
ఎప్పుడు: జనవరి 21
లక్నో లో జరగనున్న 24వ హునర్ హాత్ కార్యక్రమం నిర్వహించనున్న స్వదేశ్ మంత్రిత్వ శాఖ :
స్వదేశి మంత్రిత్వ శాఖా 24వ హునర్ హాత్ ను ఉత్తరప్రదేశ్ లోని లక్నో లోని అవద్ శిల్ గ్రామ్ లో జనవరి 22న ఫిబ్రవరి 04వరకు వోకల్ ఫర్ లోకల్ అనే అంశం తో నిర్వహించనుంది.దేశంలోని 31రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కళాకారులు హస్తకళకారులు ‘హునర్ హాత్‘ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500మంది చేతి వృత్తులవారు హస్తకళకారులు మరియు పాక నిపుణులు వారి సున్నిత౦గా చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయిస్తారు. దేశంలోనే ప్రఖ్యాత కళాకారులూ ఆత్మ నిర్బర్ భారత్ అనే అంశంపై ప్రతి రోజు హునర్ హాత్ లో సాంస్కృతిక కార్యక్రమాలను ఇందులో నిర్వహిస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: లక్నో లో జరగనున్న 24వ హునర్ హాత్ కార్యక్రమం నిర్వహించనున్న స్వదేశ్ మంత్రిత్వ శాఖ
ఎవరు: స్వదేశ్ మంత్రిత్వ శాఖా
ఎక్కడ: లక్నో లో
ఎప్పుడు: జనవరి 21
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |