Daily Current Affairs in Telugu 25-01-2021
ఐరాస సలహా సంఘం సబ్యురలిగా నియమితులయిన జయంతి జోష్ :
- ఐక్య రాజ్యసమితి (ఐరాస) సామాజిక ఆర్ధిక వ్యవహారల ఉన్నతస్థాయి సలహా సంఘం సబ్యురలిగా భారత ఆర్ధిక వేత్త జయంతి ఘోష్ ఎన్నికయ్యారు.
- కేవలం 20మంది ఉండే బృందం లో ఘోష్ కు చోటు దక్కడం విశేషం. భవిష్యత్ లో సామాజిక ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొనేందుకు అవసరమైన సలహాలు సూచన లను ఐరాస సెక్రటరీ జనరల్ కు ఈ బృందం ఇవ్వనుంది.
- ఐరాసా సామజిక ఆర్తికబివ్రుద్ది విభాగం లో ఇది రెండవ ఉన్నత స్థాయి సంఘం ప్రపంచ సుస్తిర అబివృద్ది కి వచ్చే రెండేళ్ళ పాటు ఈ బృందం పాటు పడుతుంది.
- జయతి ప్రస్తుతం అమెరికా లోని మసాచుసెట్స్ యునివర్సిటీ లో ఆర్ధిక శాస్త్రం లో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.భారత్ లోను 35ఏళ్ల జవహార్ లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం లో విధులు నిర్వహించారు.అనేక పుస్తకాలను రచించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐరాస సలహా సంఘం సబ్యురాలిగా నియమితులయిన జయంతి ఘోష్
ఎవరు: జయంతి ఘోష్
ఎప్పుడు: జనవరి 25
అమెరికా లో ఇంధన శాఖ లో కీలక పదవులకు ఎంపిక అయిన మరో ఇద్దరు భారత అమెరికన్ లు
:
అమెరికా నూతన అద్యక్షుడు జో బైడేన్ మరో నలుగురు భారతీయ అమెరికన్ లను తన బృందం లో చోటు ఇచ్చారు. కీలకమైన ఇంధన శాఖ లో వారికి ఉన్నత పదవులను కట్టబెట్టారు.చీఫ్ ఆఫ్ స్టాఫ్ తారక్ షా ఎంచుకున్నారు.ఈ పదవికి ఎంపిక అయిన తొలి శ్వేత జతేతర వ్యక్తి గా నిలిచారు.మరో వైపు సైన్స్ కార్యాలయానికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ తాన్యా దాస్ ,జనరల్ కౌన్సెల్ కార్యాలయం లో న్యాయ సలహా దారునిగా నారాయణ్ సుబ్రమణ్యణ్ ,శిలాజ ఇందనం కార్యాలయం చీఫ్ ఆఫ్ స్టాఫ్ సుచితా లాటి లను బైడేన్ ఎంపిక చెసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా లో ఇంధన శాఖ లో కీలక పదవులకు ఎంపిక అయిన మరో ఇద్దరు భారత అమెరికన్ లు :
ఎవరు: ఇద్దరు భారత అమెరికన్ లు తాన్యా దాస్, నారాయణ్ సుబ్రమణ్యణ్
ఎక్కడ:అమెరికా
ఎప్పుడు: జనవరి 25
మణిపూర్ రాష్ట్ర హైకోర్ట్ సిజె గా జస్టిస్ సంజయ్ కుమార్ నియామకం :
- మణిపూర్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సిజె గా జస్టిస్ పి.వి సంజయ్ కుమార్ కు పదోనతి కలిగించాలన్న ప్రతిపాదనన ను సుప్రీం కోర్టు కొలిజియం ఆమోదం తెలిపింది.
- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బొబ్డే గారి అద్వర్యం లో కొలిజియం గత నెల డిసెంబర్ 16, 2020 న నిర్ణయం తీసుకోగా ఆ విషయం ను జనవరి 25న వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రస్తుతం ఆయన చండీగడ్ లోని పంజాబ్ -హరియానా హైకోర్టు లో న్యాయ మూర్తిగా పని చేస్తున్నారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన పి.రామాచంద్ర రెడ్డి కుమారుడైన ఆయన 1963 ఆగస్టు 14న హైదరబాద్ లో జన్మించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మణిపూర్ రాష్ట్ర హైకోర్ట్ సిజె గా జస్టిస్ సంజయ్ కుమార్ నియామకం
ఎవరు: సంజయ్ కుమార్
ఎక్కడ: మణిపూర్ రాష్ట్ర
ఎప్పుడు: జనవరి 25
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం :
- గాన గంధర్వుడు ఎస్పి బాల సుబ్రమణ్యమన్యం కు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అవార్డు ను ప్రకటించింది. జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబె తో కలిసి మొత్తం ఏడుగిరికి భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం ను ప్రకటిస్తూ కేంద్ర హోం శాఖ జనవరి 25న ఒక ప్రకటన విడుదల చేసింది.
- గణతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఈ ఏడాది మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్ అవార్డు,10మందికి పద్మ భూషణ్ అవార్డులను ,102మందికి పద్మ శ్రీ అవార్డులను ఎంపిక చేసారు.
- బాల సుబ్రహ్మణ్యం కు తమిళనాడు నుంచి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.తెలుగు రాష్ట్రాల్లో ఏపి నుంచి ముగ్గిరిని తెలంగాణ నుంచి ఒకరికి పద్మ శ్రీ వరించింది.
- దివంగత అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ,గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కేంద్ర మాజీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ లకు మరణం అనంతరం పద్మ భూషణ్ లు ప్రకటించారు.లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ ,ప్రదాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా ప్రముఖ గాయని చిత్ర లకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. గోవా మాజీ గవర్నర్ దివంగత మృదులా సిన్హా కు పద్మ శ్రీ ప్రకటించారు.
పద్మ భూషణ్ అవార్డులు:
1.షింజో అబే ప్రజా జీవితం జపాన్
2.ఎస్.పి బాల సుబ్రమణ్యం కలలు తమిళనాడు
3.డాక్టర్ బెల్లెమొనప్ప హెగ్డే వైద్యం ,కర్ణాటక
4.నరీoడర్ సింగ్ కపని సైన్స్ అండ్ టెక్నాలజీ
5.మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఆధ్యాత్మికం ఢిల్లీ
6. బిబిలాల్ ఆర్కియాలజీ ఢిల్లీ
7.సుదర్శన్ సాహు ,కళలు ఒడిష
పద్మ భూషణ్
- కృష్ణన్ నాయర్ శాంత కుమారి చిత్ర ,కళలు కేరళ
- తరుణ్ గగోయ్ మరణం అనంతరం
- చంద్ర శేఖర్ కంబర ,సాహిత్య ,విద్య ,కర్నాటక
- సుమిత్ర మహాజన్ ,ప్రజా జీవితం ,మధ్యప్రదేశ్
- సృపెంద్ర శర్మ ,సివిల్ సర్వీసెస్
- రాం విలాస్ పాశ్వాన్ (మరణం అనంతరం),ప్రజా జీవితం బీహార్
- కేశుబాయ్ పటేల్ (మరణం అనంతరం),ప్రజా జీవితం గుజరాత్
- కల్బే సాదిక్ (మరణం అనంతం )ఆద్యాత్మికం ఉత్తరప్రదేశ్
- తల్లోచన్ సింగ్ ,ప్రజా జీవితం ,హరియానా
- రజిని కాంత్ దేవి దాస్ ప్రాష్ ,వాణిజ్యం పరిశ్రమ ,మహారాష్ట్ర
క్విక్ రివ్యు :
ఏమిటి: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
ఎవరు: కేంద్ర ప్రభుత్వం
ఎప్పుడు: జనవరి 25
21ఏళ్ల తరువాత ఒక తెలుగు వీరుడికి దక్కిన ప్రతిష్టాత్మక మహావీర్ చక్ర అవార్డు :
- భారత చైనా సరిహద్దులు అయిన లద్దాక్ లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత౦ గా వారి దాడి ని తిప్పి కొడుతూ అమరుడైన తెలుగుతేజం కర్నల్ బిక్కుమల్ల సంతోష్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాతాత్మక మహావీర్ చక్ర పురస్కారం ను ప్రకటించింది.
- ఆర్మీలో మహావీర్ చక్ర అనేది రెండవ అత్యున్నత సైనిక పురస్కారం కాగా మొదటి అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర పురస్కారం.
- సంతోష్ బాబు పెరు చిరస్థాయిగా నిలిచిపోవలని ఢిల్లీలోని ఒక యుద్ధ స్మారకం పైన ఆయన పేరు ను చెక్కారు. తాజా గా ఈ మహావీర చక్ర అవార్డు అందించే నిర్ణయం ను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 16 వ బీహార్ రెజిమెంట్ లో పని చేసిన సంతోష్ బాబు తెలంగాణ లోని సూర్యాపేట. ఈయన అతి తక్కువ వయసులోనే కర్నల్ హోదా ను సంపాదించారు. 21ఏళ్ల తరువాత ఒక తెలుగు వీరుడికి దక్కిన ప్రతిష్టాత్మక మహావీర్ చక్ర అవార్డుకావడం విశేషం .
క్విక్ రివ్యు :
ఏమిటి: 21ఏళ్ల తరువాత తెలుగు వీరుడికి దక్కిన ప్రతిష్టాత్మక మహావీర్ చక్ర అవార్డు
ఎవరు: సంతోష్ బాబు
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: జనవరి 25
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |