Daily Current Affairs in Telugu 24-01-2021
ప్రదాన మంత్రి బాల పురస్కార్ కు తెలుగు రాష్ట్రాల చిన్నారులను ఎంపిక చేసిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ :
గణతంత్ర్యం దినోత్సవం సందర్బంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించే ప్రదాన మంత్రి బాల పురస్కార కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు చిన్నారులు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది మొత్తం 21రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను చెందిన 32 మంది విధ్యార్హులను ఈ పురస్కారానికి ఎంపిక చేసారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అమేయ లగుదు (కళలు ,సంస్కృతి) తెలంగాణా రాష్ట్రము నుంచి హిమేష్ చదల వాడ (నవకల్పన) ఉన్నారు. అమేయ లగుడు వైజాగ్ కు చెందిన భారత నాట్య కళాకారిణిగా కాగా హేమేష్ హైదరాబాద్ కు చెందిన వెబ్ డేవలపింగ్ ఇన్నోవేటర్ లో మొత్తం 32మందిలో ఏడు అవార్డులు కళలు సంస్కృతి విభాగం లో ,9అవార్డులు నవకల్పన,5 స్కాలస్టిక్ అచీవ్ మెంట్స్ ,7క్రీడా ,దైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రకటించారు. సామాజిక సేవ కోసం కృషి చేసినందుకు ఒకరిని ఎంపిక చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రదాన మంత్రి బాల పురస్కార్ కు తెలుగు రాష్ట్రాల చిన్నారులను ఎంపిక చేసిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎవరు: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 24
రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ గా నియమితులయిన కుమార సంగక్కర :
రాజస్తాన్ రాయల్స్ క్రికెట్ జట్టు డైరెక్టర్ గా ఇటీవల శ్రీలంక దిగ్గజ ఆటగాడిగా కుమార సంగక్కర నియమితులయ్యారు. ప్రస్తుతం మారిల్ బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి)అద్యక్షుడిగా ఉన్న సంగక్కర రాజస్తాన్ ప్రాంచైజీ కార్యకలాపాలకు అన్నింటికీ బాద్యుడిగా వేలం లో ప్రణాళికలు జట్టు వ్యూహాలు ప్రతిభాన్వేషణ లో విభాగం లో తదితర బాద్యతలు ఈ శ్రీలంక మాజీ కీపర్ చూసుకుంటారు. తాజగా ప్రస్తుత కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను వదులుకున్న రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సంజీవ్ శంసన్ కు సారద్యం అప్పగించిన విషయ౦ తెలిసిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ గా నియమితులయిన కుమార సంగక్కర
ఎవరు: కుమార సంగాక్కర
ఎక్కడ:
ఎప్పుడు: జనవరి 24
జాతీయ బాలికల దినోత్సవం గా జనవరి 24 :
భారత దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24 న జరుపుకుంటారు. ఈ రోజును 2008 లో మహిళా మరియు శిశు అబివృద్ది శాఖా మంత్రిత్వ శాఖ యొక్క చొరవ ను తీసుకువచ్చింది. జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉన్న లక్ష్యం భారత దేశ బాలికలకు మద్దతు మరియు అవకాశాలను అందించడం ఆడపిల్లకు హక్కుల గురించి అవగాహన కల్పించడం మరియు బాలిక విద్య యొక్క ప్రాముఖ్యత ను మరియు వారి ఆరోగ్యం మరియు పోషణ పై అవగాహన పెంచడం కూడా దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఆడ శిశు హత్య నుంచి లింగ అసమానత నుంచి లైంగిక వేధింపుల వరకు సమస్యలకు కొరత ఉండదు. సమాజంలో బాలికల ఎదుర్కొంటున్న అసమనాతలను ఎత్తిచూపడం ఆడ పిల్లలు హక్కుల విద్య ఆరోగ్యం మరియు పోషణ యొక్క అవగాహన ను కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం .
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ బాలికల దినోత్సవం గా జనవరి 24
ఎవరు: జనవరి 24
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 24
జనవరి 24నుంచి ప్రారంబం అయిన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు :
ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఈ ఎఫ్) అద్వర్యం లో ఆరు రోజుల పాటు జరిగే శిక్రగ్ర సదస్సు జనవరి 24న దావోస్ లో ప్రారంబం కానుంది. దీనిలో పాల్గొంటున్న అగ్రనేతలో ప్రదాని నరేంద్ర మోడి,చైనా అద్యక్షుడు జిన్ పింగ్ తదితరులు ఉన్నారు. ఈ సారి సదస్సును ఆన్ లైన్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాదినేతలు దేశాధినేతలు పలు కంపెని ల చైర్మన్ లు సియివో పౌర సమాజ ప్రతినిధులు సహా దాదాపు వెయ్యు మంది దీనిలో పాలుపంచుకుంటారు. కోవిద్-19 అనంతరం తలెత్తిన ఆర్ధిక సామజిక సాంకేతిక పర్యావరణంను అయిన ఆరు రోజులు నిర్వహిస్తారు.జిన్ పింగ్ జనవరి 25న ఈ సదస్సులో ప్రత్యెక ప్రసంగం చేయనున్నారు. దీనిలో భారత ప్రదాని నరేంద్ర మోడి ,కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమార్,హర్షవర్దన్ ,దర్మేన్ద్రప్రదాన్,పారిశ్రామిక ,వాణిజ్య రంగాలకు చెందిన ముఖేష్ అంబానీ,గౌతం అదాని ,ఆనంద్ మహీంద్రా ,శోబన కామినేని తదితరులు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జనవరి 24 నుంచి ప్రారంబం అయిన ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు
ఎవరు: ప్రపంచ ఆర్థిక దేశాలు
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 24
ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆఫ్ ఇండియా లో ఇన్ టు ది డార్క్ నెస్ చిత్రం కు దక్కిన గోల్డెన్ పీకాక్ అవార్డ్ :
గోవా లో నిర్వహిస్తున్న 51వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియా (ఇఫీ) చిత్రోత్సవాలు జనవరి 24తో ముగిసాయి. ముగింపు కార్యక్రమంలో రెండో ప్రపంచ యుద్ద నేపద్యంలో వచ్చిన డానిష్ చిత్రం ‘ఇన్ టు ది డార్క్ నెస్’ గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకుంది. అండర్స్ రేఫ్న్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. లేనే బోర్ గ్లం నిర్మించారు. నాజీల ఆక్రమణ సమయంలో డెన్మార్క్ ప్రజలు ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్తితులను మానసిక కల్లోలకాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పుడీ అవార్డులో బాగంగా చిత్ర దర్శక నిర్మాతలకు రూ రూ.40 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంస పత్రం అందించనున్నారు. ఈ చిత్రోత్సవాల బాగంలో మొత్తం 244 సినిమాలని వేరు వేరు విభాగాల్లో ప్రదర్శించారు. ముగింపు చిత్రంగా కియోషి కురోసావా రాసిన జపన్స్ చారిత్రిక నాటకం వైఫ్ ఆఫ్ ఏస్పై ని ప్రదర్శించారు. ఈ 51 వ ఇఫీ చిత్రోత్సవాల్లో అసోంకు చెందిన దర్శకుడు కృపాల్ కలిత స్పెషల్ మేన్షన్ అవార్డు ను అందుకున్నారు. ఆయన తెరకెక్కిన బ్రిడ్జ్ చిత్రానికి ఈ పురస్కారం దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆఫ్ ఇండియా లో ఇన్ టు ది డార్క్ నెస్ చిత్రం కు దక్కిన గోల్డెన్ పీకాక్ అవార్డ్
ఎవరు: గోల్డెన్ పీకాక్ అవార్డ్
ఎప్పుడు: జనవరి 23
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |