Daily Current Affairs in Telugu 22-01-2021
అణ్వాయుదాస్త్రాల నిషేదానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం అమల్లోకి ను తీసుకువచ్చిన ఐరాసా :
అన్వయుదాలు నిషేదానికి సంబందించిన మొట్టమొదటి ఒప్పందం జనవరి 22న నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మారణాయుధాల నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలని దిశగా ఇది ఒక చారిత్రంత్మక అడుగు అని పలువురు అబివర్నించారు. అణ్వస్త్ర దేశాలు మాత్రం దీన్ని గట్టిగ వ్యతిరేకించాయి.రెండో ప్రపంచ యుద్ద సమయంలో జపాన్ లోని హిరోషిమా,నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులు వేసి వేల మందిని బలితీసుకుంది. అలాంటి ఘోరం పునరావృతం కాకుండా ఆ సాముహిక జనావాస ఆయుదాల నిషేధం కోసం దాడులులగా ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి.ఇందుకోసం అణ్వస్త్ర నిషేద ఒప్పందం తెరపైకి వచ్చింది. దీనికి తుది ఆమోదం తెలిపిన దేశాలు అన్వాయుదాలను పూర్తిగా త్యజించాలి. అంతర్జాతియంగా నెలకోన ప్రస్తుత పరస్థితిలో ఇది చాలా సంక్లిష్టం అన్వస్త్రాలు కలిగిన అమెరికా ,రష్యా, బ్రిటన్,చైనా ,ఫ్రాన్స్ ,భారత్,పాకిస్తాన్,ఉత్తరకొరియా, ఇజ్రాయిల్ దేశాలతో పాటు నాటో కూటమిలోని 30దేశాలు ఆ ఒప్ప౦దాన్ని కూడా దీనికి సమర్దించ లేదు. అణ్వస్త్ర ,అన్వస్త్ర యేతర దేశాల మద్య ఈ అంశం పై తీవ్ర విభేదాలు నెలకొన్న నిషేధ ఒప్పందం నిరుపయోగం అని జపాన్ పేర్కొంది. అయితే ఇంటర్నేషనల్ కాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ సంస్థ కృషి వల్ల ఒప్పందం విషయం లో ముందడుగు పడింది.2017 జులై లో ఐరాసా సర్వ ప్రతినిధి సభ దీనికి ఆమోదం తెలిపింది.120 పైగా దేశాలు దీనికి అంగీకరించాయి.అనంతర౦ ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే కనీసం యాబై దేశాలు దాన్ని ర్యాటిఫై చేయాల్సి ఉంది. గత ఏడాది అక్టోబర్ లో 50వ ర్యాటిఫీ కేషన్ పూర్తి అయింది. ఆ తర్వాత నిర్దేశిత రీతిలో 90రోజుల విరామాన్ని పూర్తి చేసుకుని జనవరి 22నుంచి ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ర్యాటి ఫై చేసిన దేశాలన్నీ ఎట్టి పర్తిస్థిత్తుల లలోను అన్వయుదాలను అణ్వస్త్ర పేలుడు పరికరాలను అబివృద్ది చేయడం ,ఉత్పత్తి చేయడం ,సమీకరించడం వంటివి చేయకూడదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వాయుధ నిషేదానికి సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం అమల్లోకి అనే ఒప్పందం ను తీసుకువచ్చిన ఐరాస
ఎవరు: ఐరాస
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: జనవరి 21
ఎన్ డిఎఫ్ బికి లొంగిపోయిన ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేసిన అస్సాం సిఎం :
ఎన్ డి ఎఫ్ బికి లొంగిపోయిన ఉగ్రవాదులకు అస్సాం రాష్ట్ర సిఎం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఇటీవల వారికి ఆర్ధిక సహాయం చేసారు. జనవరి 22 న లొంగిపోయిన ఉగ్రవాద సంస్థ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ఎన్ డి.ఎఫ్ బి గువహతి లో ని సబ్యులకు ఆర్ధిక సహాయం పంపిణి చేసారు.మొత్తం 4 ఎన్ డిఎఫ్బి లొంగిపోయిన వర్గాల్లో 1615 మంది సభ్యులలో 1279 మందికి రూ .4లక్షల ఫిక్సెడ్ డిపాజిట్ సర్తిఫెకేట్ లు అందించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్ డిఎఫ్ బి కి లొంగిపోయిన ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేసిన అస్సాం సిఎం
ఎవరు: అస్సాం సిఎం సర్బానంద సోనోవాల్
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు: జనవరి 21
గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం లో నిలిచిన అమెరికా దేశం :
ఇటీవల సైనిక వెబ్ సైట్ అయిన గ్లోబల్ ఫెయిర్ పవర్ 138దేశాలను కలిగి ఉన్న 2021 కొరకు సైనిక బలం ర్యాంకిగ్స్ ను ప్రచురించింది. పవర్ ఇండెక్స్ ను నిర్ణయించడానికి 50కంటే ఎక్కువ విబిన్న అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ను ప్రకటించారు . 2021 లో 1.4 మిలియన్ల క్రియాశీల సైనిక సిబ్బంది ,13,233 విమానాలు ,60000 కంటే ఎక్కువ ట్యాంకులు మరియు 740 బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ తో యుఎస్ ప్రపంచం లో అత్యంత శక్తి వంతమైన సైన్యం కల దేశంగా పేరు పొందింది. రెండవ స్థానంలో రష్యా ఒక మిలియన్ ల క్రియా శీల సిబ్బంది 4100 విమానాలు,13000 ట్యాంకులు మరియు రక్షణ బడ్జెట్ 42.1 బిలియన్ డాలర్లు గా ఉంది. చైనా,ఇండియా మరియు జపాన్ దేశాలు మొదటి ఐదు స్థాన౦లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా ప్రపంచంలోని 32 వ గొప్ప సైనిక బలాన్ని కలిగి ఉంది. ఆఫ్రికా లో ఈజిప్ట్ దేశం 13 వ స్థానం మరియు అల్జీరియ 27వ స్థానం లో ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం లో నిలిచిన అమెరికా దేశం
ఎవరు: అమెరికా దేశం
ఎప్పుడు: జనవరి 21
అవలోకన అనే ఒక నూతన సాఫ్ట్ వేర్ ను ప్రారంబించిన కర్నాటక సిఎం గా యడ్యుయరప్ప :
కర్నాటక సిఎం బిఎస్ యడ్యూరప్ప ఇటీవల ఒక ‘అవలోకన’ ఒక నూతన సాఫ్ట్ వేర్ ను విడుదల చేసారు. ఈ సాఫ్ట్ వేర్ రాష్ట్ర ప్రభుత్వానికి 1800 కార్యక్రమాల కొరకు చేసిన ఖర్చులు మరియు ఆంక్షలపై డేటా ను పొందడానికి వీలు కల్పిస్తుంది.సాఫ్ట్ వేర్ సుస్థిర అబివృద్ది లక్ష్యాలు షెడ్యుల్డ్ కుల ఉప ప్రణాళిక,గిరిజన ఉప ప్రణాళిక మరియు కేంద్రం ప్రవేశపెట్టే పథకాలపై దృష్టి సారించింది. ఇది పారదర్శక ఈ గవేర్నన్స్ కు సాదనం. ఇది అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ప్రభుత్వ నిధులు విడుదల మరియు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేటాయింపు లకు అందిస్తుంది. డిపార్ట్ మెంట్ కు అయ్యే ఖర్చుల ఆదారంగా నిధుల విడుదలపై నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది. ఇది చివరికి వనరులపై ప్రభుత్వ పట్టును పెంచుతుంది. సాఫ్ట్ వేర్ షెడ్యుల్ కుల ఉప ప్రణాళిక లపై స్తిరమైన అబివృద్ది లక్ష్యాలు మరియు గిరిజిన ఉప ప్రణాళిక మరియు కేంద్ర ప్రాయోజిత పథకాల పై దృష్టి కేంద్రీకరిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: అవలోకన అనే ఒక నూతన యాప్ ను ప్రారంబించిన కర్నాటక సిఎం గా యడ్యుయరప్ప
ఎవరు: సిఎం గా యడ్యుయరప్ప
ఎక్కడ: కర్ణాటక
ఎప్పుడు: జనవరి 21
భారత ఆర్మీ 42వ వైస్ చీఫ్ గా చండి ప్రసాద్ మొహంతి నియామకం :
ఇటీవల దక్షిణ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ చండి ప్రసాద్ మొహంతి భారత ఆర్మీ కి 42వ వైస్ చీఫ్ గా నియమితులయ్యారు. 2021 జనవరి 31న పదవి విరమణ చేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనిగారి స్థానంలో ఈయన బర్తీ చేయనున్నారు. ప్రస్తుతం చండి ప్రసాద్ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత ఆర్మీ 42వ వైస్ చీఫ్ గా చండి ప్రసాద్ మొహంతి నియామకం
ఎవరు: చండి ప్రసాద్ మొహంతి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు: జనవరి 21
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |