Daily Current Affairs in Telugu 30 June -2022
మహారాష్ట్ర నూతన సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఎక్ నాద్ షిండే :
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం. శివసేన తిరుగుబాటు: నేత ఏక్నాథ్ శిందే జూన్ 30న రాత్రి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కీలక వ్యక్తిగా నిలుస్తారనుకున్న వ్యక్తి ఆశ్చర్యకరమైన రీతిలో ఏకంగా సీఎం పదవిని అధిష్టించారు. ఉద్ధవ్ రాక్రే రాజీనామా అనంతరం శిందే వర్గీ యులతో కలిసి బాజపా నేత దేవేంద్ర పద్నవీస్ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన విషయం. తెలిసిందే. అనేక మలుపుల మధ్య ఆయన చివ రకు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఉదయం కిందే గోవా నుంచి ముంబయికి చేరుకున్న తర్వాత బాజపా నేతలతో పలు విడతలు మంతనాలు జరిపారు.
- మహారాష్ట్ర రాజధాని :ముంబాయ్
- మహారాష్ట్ర సిఎం : ఎక్ నాద్ షిండే
- మహారాష్ట్ర గవర్నర్ :భగత్సింగ్ కోష్యారి
క్విక్ రివ్యు :
ఏమిటి: మహారాష్ట్ర నూతన సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఎక్ నాద్ షిండే
ఎవరు: ఎక్ నాద్ షిండే
ఎక్కడ : మహారాష్ట్ర లో
ఎప్పుడు : జూన్ 30
మరోసారి ‘నెస్సెట్ రద్దయిన ఇజ్రాయిల్ దేశ పార్లమెంట్ :
ఇజ్రాయెల్లో కథ మళ్లీ మొదటికొచ్చింది. సైద్ధాంతిక విభేదాలున్న. బెంజమిన్ నెతన్యాహును దేశాధ్యక్ష పీఠం నుంచి దించేయడమే ఏకైక లక్ష్యంగా గత ఏడాది ఏర్పడిన సంకీర్ణ సర్కారు తాజాగా కూలిపోయింది. . పార్లమెంటు ‘నెస్సెట్ గురు వారం రద్దయింది. దీంతో నాలుగేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే దేశంలో ఐదోసారి సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు రంగం సిద్ధ మైంది. నవంబరు 1న ఎన్నికలు నిర్వహించ నున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కూటమిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రం ఇన్నాళ్లూ ప్రధానమంత్రిగా కొనసాగిన నఫ్తాలీ బెన్నెట్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తన పదవీ బాధ్యతలను విదేశాంగ మంత్రి గురు యయిర్ లిపిడక్కు అప్పగించారు. తదుపరి కంటే ప్రభుత్వం ఏర్పడేంతవరకు లిపిడ్ ఆపద్దర్మ ప్రధానమంత్రిగా కొనసాగానున్నారు.
- ఇజ్రాయెల్ దేశ రాజధాని : జెరూసలేం
- ఇజ్రాయెల్ దేశ కరెన్సీ :ఇస్రాయిల్ షెకెల్
- ఇజ్రాయెల్ దేశ అద్యక్షుడు : ఇసాక్ హీర్జోగ్
క్విక్ రివ్యు :
ఏమిటి: మరోసారి ‘నెస్సెట్ రద్దయిన ఇజ్రాయిల్ దేశ పార్లమెంట్
ఎవరు: ఇజ్రాయెల్
ఎక్కడ : ఇజ్రాయిల్ దేశంలో
ఎప్పుడు : జూన్ 30
డైమండ్ లీగ్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న ఒలింపిక్ జావెలిన్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా
ఒలింపిక్ జావెలిన్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. ప్రతి ఈవెంట్ కూ మెరుగవుతున్న అతడు స్టాక్ హోమ్ మండ్ లీగ్ లోనూ మెరిశాడు. 5న పేరిటే ఉన్న జాతీయ రికార్డ్ ను బద్దలు కొడుతూ 89.94 మీటర్లు త్రో చేసి. రజతం సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ కు ఇదే కాలి పతకం. 24 ఏళ్ల నీరజ్ ఇటీవల పావోనుర్మి క్రీడల్లో 89.30మీ త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్ లో అతడు తన తొలి ప్రయత్నంలోనే 8994 మీటర్ల లో చేశాడు. ఆ తర్వాత వరుసగా 81.37మీ. 87. 16ము.. 8477ము, 86,67మీ, 86,84మీ త్రోలు చేశాడు. స్వర్ణ విజేత పీటర్స్ అండర్సన్ (గ్రెనెవా) తన మూడో ప్రయత్నంలో 30 31 మీటర్ల త్రో చేసే వరకు నీరజ్ అత్యతను ప్రదర్శన జర్మనీ అటగాడు వెటర్ తో చేసే వరకు నీరజ్ దే అత్యుత్తమ ప్రదర్శన జర్మనీ ఆటగాడు వెబ్బర్ (83.08మీ) కాంస్యం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డైమండ్ లీగ్ లో స్వర్ణ పథకం గెలుచుకున్నఒలింపిక్ జావెలిన్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా
ఎవరు: నీరజ్ చోప్రా
ఎప్పుడు : జూన్ 30
తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం :
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ప్రభుత్వరంగ సంస్థలకు చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఆయన ఆదేశాల మేరకు తెలంగాణ ఆహార సంస్థ (టీఎస్ ఫుడ్స్) చైర్మన్ గా మేడె రాజీన్నాగర్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ గా మంత్రి శ్రీదేవి, ఉర్దూ అకాడమీ చైర్మన్ గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్దూ అకాడమీకి మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా నియమితులయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నారపల్లికి చెందిన మంత్రి శ్రీదేవి పట్టభద్రురాలు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆమె 2004లో తెరాసలో చేరారు. తెలం గాణ భాషా సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం
ఎవరు: మంత్రి శ్రీదేవి
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు : జూన్ 30
‘అభ్యాస్’ గగనతల పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో :
దేశీయంగా అభివృద్ధి చేసిన హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ (హెచ్ఐఏటీ) విమానం ‘అభ్యాస్’ గగనతల పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాతీరం చాందీపుర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో దీన్ని పరీక్షించారు. క్షిపణుల గగనతల పరీక్షల్లో లక్ష్యంగా వినియోగించడానికి వీలుగా డీఆర్డీవోలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ విభాగం అభ్యాస ను రూపొందించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘అభ్యాస్’ గగనతల పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో
ఎవరు: డీఆర్డీవో
ఎప్పుడు : జూన్ 30
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం కు వ్యతిరేఖంగా తీర్మానం తెలిపిన మొదటి రాష్ట్రము పంజాబ్ :
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ జూన్ 30న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా పంజాబ్ రాష్ట్రం అవతరించింది. పంజాబ్ కు చెందిన లక్ష మందికి పైగా సైనికులు దేశ సాయుధ దళాలలో పనిచేశారని, వారిలో చాలా మంది ప్రతి సంవత్సరం దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను అర్పిస్తున్నారని తీర్మానం పేర్కొంది.
- పంజాబ్ రాష్ట్ర రాజధాని :చండీఘర్
- పంజాబ్ రాష్ట్ర సిఎం : భగవత్ మన్
- పంజాబ్ రాష్ట్ర గవర్నర్ : బన్వర్ లాల్ పురోహిత్
క్విక్ రివ్యు :
ఏమిటి: అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీం కు వ్యతిరేఖంగా తీర్మానం తెలిపిన మొదటి రాష్ట్రము పంజాబ్
ఎవరు: పంజాబ్
ఎక్కడ : పంజాబ్
ఎప్పుడు : జూన్ 30
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |