
Daily Current Affairs in Telugu 29 June -2022
భారత అటార్నీ జనరల్ కే.కే వేణు గోపాల్ పదవి కాలం మరో మూడు నెలలు పొడగింపు :

సినియర్ న్యాయవాది కె.కె.వేణు గోపాల్(91)ను భారత అటార్నీ జనరల్(ఏజీ)గా మరో మూడు నెలలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. జూన్ 30తో ఆయన పదవీకాలం ముగియనున్న నేపద్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ”జులై 1 నుంచి వేణుగోపాల్ నియామకం అమల్లోకి వస్తుంది. మరో మూడు నెలల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.” అని న్యాయవ్యవహారాల విభాగం ఉత్తర్వులో పేర్కొంది. వేణుగోపాల్ వ్యక్తి. గత కారణాల వల్ల మళ్లీ ఏజీగా కొనసాగడానికి సుముఖంగా లేరని, అయితే ప్రభుత్వం అభ్యర్ధించడంతో అంగీకరించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఏజీ పదవి చేపట్టిన అతిపెద్ద వయస్కు’డిగా ఆయన ప్రత్యేకత చాటుకున్నారు. సాధార ణంగా ఏజీ పదవీకాలం మూడేళ్లపాటు ఉంటుంది.. 2017 జులైలో తొలిసారి ఏజీగా నియమితులైన వేణుగోపాల్ 2020 జజూన్ వరకు ఆ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత అటార్నీ జనరల్ కే.కే వేణు గోపాల్ పదవి కాలం మరో మూడు నెలలు పొడగింపు
ఎవరు: కే.కే వేణు గోపాల్
ఎక్కడ : ఢిల్లీ
ఎప్పుడు : జూన్ 28
హుక్కా మరియు దానికి పొగాకు నిషేధించిన ఐరోపా సమాఖ్య :

హుక్కా పరికరాలు, అందులో వాడే పొగాకును నిషేధించాలని ఐరోపా సమాఖ్య(ఈయూ) కార్యనిర్వాహక విభాగమైన యూరోపియన్ కమిషన్ జూన్ 30న ప్రతిపాదించింది. 27 ఈయూ సభ్య దేశాల్లో క్యాన్సర్ పైన పోరుకు ఈ ప్రతిపాదనను ముందు కుతెచ్చింది. ఈ ప్రతిపాదనను ఈయూ సభ్య దేశాలు, యూరోపియన్ పార్లమెంటు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాయి. ఈయూ సభ్యదేశాలు అయిదింటిలో హుక్కా పొగాకు, పరికరాల విక్రయాలు 10 శాతం పెరిగాయి. ఈయూ అంతటా పొగాకు ఉత్పత్తుల విక్రయాల్లో హుక్కా వాటా 25 శాతాన్ని దాటింది ప్రతి ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో పొగాకు వాడకం.వల్లనే సంభవిస్తున్నాయి అని తేలింది. కాబుల్ లో పౌరులు పొగాకును, ఏ రూపంలో కూడా వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోదలిచామని ఈయూ ఆరోగ్య ఆహార భద్రత కమిషనర్ కైడియా క్రడస్ వివరించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హుక్కా మరియు దానికి పొగాకు నిషేధించిన ఐరోపా సమాఖ్య
ఎవరు: ఐరోపా సమాఖ్య
ఎప్పుడు : జూన్ 28
గెయిల్ ఇండియా తదుపరి డైరెక్టర్ గా కుమార్ గుప్తా నియామకం :

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ ఇండియా తదుపరి డైరెక్టర్ గాకుమార్ గుప్తాను (56) ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో (ఐఓసీ) ఫైనాన్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న ‘గెయిల్ ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ స్థానాన్ని సందీప్ భర్తీ చేయకున్నారు. సందీప్ వాటి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసి తర్వాత ఛార్టర్డ్ అకౌంటెన్సీ చేశారు. ఎడస్ట్రీలో 3) ఎలిగా సేవలు అందిస్తున్నారు.. ఐఓసీలో 31 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ సంఘం ఆమోదం లభిస్తే, సందీప్ 2026 ఫిబ్ర వరి వరకు గెయిల్ ఇండియా సీఎండీగా కొనసాగే అవకాశం ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గెయిల్ ఇండియా తదుపరి డైరెక్టర్ గా కుమార్ గుప్తా నియామకం
ఎవరు: కుమార్ గుప్తా
ఎప్పుడు : జూన్ 28
టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంబించిన సిఎం కెసిఆర్ :

టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. టీ హబ్-2 ప్రాంగణమంతా కేసీఆర్ కలియ తిరుగారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ. 276 కోట్లతో అత్యాధునిక డిజైన్ తో సాండ్ విచ్ ఆకారంలో దీన్ని నిర్మించారు. టీ హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టీ హబ్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంబించిన సిఎం కెసిఆర్
ఎవరు: సిఎం కే చంద్ర శేఖర్ రావు
ఎక్కడ : తెలంగాణ
ఎప్పుడు : జూన్ 28
ఢిల్లీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ :

జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జూన్28, 2022న ఢిల్లీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. LG సచివాలయం రాజ్ నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా చేత జస్టిస్ చంద్ర ప్రమాణం చేయించారు. జస్టిస్ ధీరూభాయ్ నారన్ భాయ్ పటేల్ పదవీ విరమణ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉంది, జస్టిస్ విపిన్ సంఘీ మార్సిలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిన్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఢిల్లీ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
ఎవరు: జస్టిస్ సతీష్ చంద్ర శర్మ
ఎక్కడ : ఢిల్లీ
ఎప్పుడు : జూన్ 28
ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ హసన్ జిలూదన్ ఎన్నిక :

ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) అల్బేనియాలోని టిరానాలో జరిగిన 2022 IWF స్పెషల్ మరియు ఎలక్టోరల్ కాంగ్రెస్ లో ఇరాక్ కు చెందిన మహమ్మద్ హసన్ జిలూదన్ను తన కొత్త అధ్యక్షుడిగా. ఎన్నుకుంది. అధ్యక్షుడైన మొదటి ఆసియా వ్యక్తి కూడా. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ (IWF) అల్బేనియాలోని టిరానాలో జరిగిన 2022 IWF స్పెషల్ మరియు ఎలక్టోరల్ కాంగ్రెస్ ఇరాక్ కు చెందిన మహమ్మద్ హసన్ ఆలూరున్ ను తన కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అధ్యక్షుడైన మొదటి ఆసియా వ్యక్తి కూడా.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మహమ్మద్ హసన్ జిలూదన్ ఎన్నిక
ఎవరు: మహమ్మద్ హసన్ జిలూదన్
ఎప్పుడు : జూన్ 28
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |