Daily Current Affairs in Telugu 27 June -2022
ఇంగ్లాండ్ టి20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు :

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల టి20 క్రికెట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించాడు. మోర్గాన్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పైకాడు. అతడు ఏడున్నరేళ్ల పాటు ఇంగ్లాండ్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ లో కూడా జట్టును నడిపించాలని మోర్గాన్ భావించాడు. కానీ పేలవ ఫామ్, ఫిటెనెస్ తో సతమతమవుతున్న నేపథ్యంలో రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. గత 28 ఇన్నింగ్స్ ల్లో అతడు రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. మోర్గాన్ 2015లో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అతడి సారద్యంలో ఇంగ్లాండ్ బలమైన వన్డే, టీ20 ప్రపంచకప్ కూడా జట్టును నడిపించాలని మోర్గాన్ భావించాడు. కానీ పేలవ ఫామ్, ఫిట్ నెస్ తో సతమతమవుతున్న నేపథ్యంలో రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. గత 28 ఇన్నింగ్స్ లో అతడు రెండు అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. మోర్గాన్ 2015లో కుక్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఇంగ్లాండ్ బలమైన వన్డే, టీ20 జట్టుగా ఎదిగింది. 2019లో వన్డే ప్రపంచకప్ ను కూడా గెలుచుకుంది. 35 ఏళ్ల మోర్గాన్ 128 వన్డేల్లో, 72 టీ20ల్లో ఇంగ్లాండ్కు కెప్టెన్ గా వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇంగ్లాండ్ టి20 జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: ఇయాన్ మోర్గాన్
ఎక్కడ: ఇంగ్లాండ్
ఎప్పుడు : జూన్ 27
జర్మనీలో ప్రారంబం అయిన జి 7 శిఖరాగ్ర సదస్సు :

జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్ ప్రాంతంలోని షోల్స్ ఎలామావ్ జీ7 శిఖరాగ్ర సదస్సు జూన్ 26న ప్రారంభమైంది. జూన్ 28 వరకు జరిగే ఈ సమా దేశంలో ఉక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఇంధన సరఫరాలను రక్షించుకోవడానికి ఉన్న మార్గాలపై కూటమిలో జి-7 దేశాలు చర్చిస్తాయి . కాగా ఈ కూటమిలో అమెరికా, బ్రిటన్, కెనడా,ఫ్రాన్స్ ,జర్మని ఇటలీ జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.
- జర్మని దేశ రాజధాని : బెర్లిన్
- జర్మని దేశ కరెన్సీ :యూరో
- జర్మని దేశ అద్యక్షుడు :ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మేయిర్
క్విక్ రివ్యు :
ఏమిటి: జర్మనీలో ప్రారంబం అయిన జి 7 శిఖరాగ్ర సదస్సు
ఎవరు: జి 7 దేశాలు
ఎక్కడ: జర్మని
ఎప్పుడు : జూన్ 27
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా నితిన్ గుప్తా నియామకం :

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్మన్ గా నితిన్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. జూన్ 27న ఆయన బాధ్యతలు చేపట్టారు. 1986 బ్యాచ్ ఇన్కమ్ ట్యాక్స్ కేడర్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో దర్యాప్తు సభ్యుడిగా ఉన్నారు. 2023 సెప్టెంబరులో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. 1986 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి, బోర్డులో సభ్యురాలిగా ఉన్న సంగీతా సింగ్ ప్రస్తుతం సీబీడీటీ చైర్మన్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. జేబీ మహాపాత్ర ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయడంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. సీబీడీటీకి చైర్మన్, ప్రత్యేక కార్యదర్శి హోదాతో ఆరుగురు సభ్యులు ఉంటారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా నితిన్ గుప్తా నియామకం
ఎవరు: నితిన్ గుప్తా
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 27
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేష నల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఏఎస్ రాజన్ నియామకం :

హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్పీపీఎన్పీఏ) డైరెక్టర్ 1987 బ్యాచ్ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి ఏఎస్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన కేంద్రహోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. రాజన్ ను నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా నియమించాలని నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించినట్లు సిబ్బంది వ్యవహారాలశాఖ జూన్ 27న జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న ఆయన పదవీ విరమణ చేసే వరకూ అకాడమీ డైరెక్టర్ గా కొనసాగనున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో 1988 బ్యాచ్ గుజరాత్ కేడర్: ఐపీఎస్ అధికారి అతుల్ కర్వాల్ సేవలందిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేష నల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా ఏఎస్ రాజన్ నియామకం
ఎవరు: ఏఎస్ రాజన్
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు : జూన్ 27
ఏపి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్ గా చాగరి ప్రవీణ్ కుమార్ నియామకం :

ఆ౦ద్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్ గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పదవికి న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ పేరును గవర్నర్ సూచించారు. హైకోర్టులో రెండో స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. కాగా మొన్నటివరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా “ఉన్న జస్టిస్ అససుద్దీన్ అమానుల్లా బదిలీపై వెళ్లారు.
- ఆ౦ద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిస్వభూషణ్ హరిచంద్
- ఆ౦ద్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏపి రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూ టివ్ చైర్మన్ గా చాగరి కుమార్ నియామకం
ఎవరు: చాగరి కుమార్
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : జూన్ 27
సైక్లింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టంచిన భారత సైక్లిస్ట్ ప్రీతీ మస్కే :

పుణెకు చెందిన ప్రీతి మస్కే అలాట సైక్లింగ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. లేహ్ నుంచి మనాలి వరకు ఉన్న 430 కిలో మీటర్ల దూరాన్ని 45 ఏళ్ల ప్రీతి సైకిల్ తొక్కుకుంటూ 55 గంటల 13 నిమిషాల్లో చేరుకొంది.ఈ సాహసోపేతమైన ఫీట్ సాధించిన తొలి మహిళగానూ ప్రీతి నిలిచింది. ఆమె ఫీట్ కు గిన్నిస్ బుక్ లోకి ఎక్కగల అర్హత ఉందని అధికారులు తెలిపారు. 6 వేల కిలోమీటర్ల గోల్డెన్ క్వాడ్రిలేటరలు చుట్టేసిన వేగవంతమైన మహిళా సైక్లిస్ట్ గా కూడా ప్రీతి రికార్డు నెలకొల్పింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: సైక్లింగ్ లో ప్రపంచ రికార్డు సృష్టంచిన భారత సైక్లిస్ట్ ప్రీతీ మస్కే
ఎవరు: ప్రీతీ మస్కే
ఎప్పుడు : జూన్ 27
ఒలింపిక్ సెల్ సభ్యుడిగా ఎంపికైన స్టార్ షూటర్ గగన్ నారంగ్ :

స్టార్ షూటర్, ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్ మిషన్ ఒలింపిక్ సెల్ సభ్యుడిగా ఎంపికయ్యాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం-స్కేమ్ (టాప్స్) లో భాగమయ్యే క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడం ఈ సెల్ ప్రధాన విధి. 2024, 2028 ఒలింపిక్స్ కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించడానికి, ఎంపిక చేయడానికి, వారి ప్రదర్శనలను ఎప్పటికప్పుడు గమనించడానికి ఈ సెల్ పని చేస్తుంది. ప్రస్తుతం టాప్స్ ప్రధాన బృందంలో 117 మంది డెవలప్ మెంట్ గ్రూప్ లో 244 మంది క్రీడాకారులు ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్ సెల్ సభ్యుడిగా ఎంపికైన స్టార్ షూటర్ గగన్ నారంగ్
ఎవరు: గగన్ నారంగ్
ఎప్పుడు : జూన్ 28
జియో ఇన్ఫోకామ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఆకాష్ అంబాని :

రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో మూడో తరం పాలనాపగ్గాలు చేపట్టే ప్రక్రియకు ముందడుగు పడింది. 217 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్ల) విలువైన గ్రూప్ నాయకత్వ వారసత్వ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖేశ్ అంబానీ కీలక అడుగేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ బాధ్యతలను తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబా అప్పగించారు. ‘రిలయన్స్ జియో డైరెక్టర్ల బోర్డుకు చైర్మన్ గా ఆకాశ్ ఎం అంబానీని నియమించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింద’ని ఎక్స్చేంజీలకు కంపెనీ తెలిపింది. జూన్ 27 పని వేళల ముగింపు నుంచి వర్తించేలా, జియో బోర్డు డైరెక్టర్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా సమర్పించాక, ఈ పరిణామం చోటుచే సుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జియో ఇన్ఫోకామ్ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించిన ఆకాష్ అంబాని
ఎవరు: ఆకాష్ అంబాని
ఎప్పుడు : జూన్ 28
ప్రముఖ వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత :
ప్రముఖ వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ (93) జూన్ 27న తెల్లవారుజామున దక్షిణ ముంబయిలోని స్వగృహంలో కన్నుమూశారు. 100 బిలియన్ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన వాటాలున్నాయి. గ్రూప్ లో 18.37 శాతం వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు. 1965లో స్థాపితమైన షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్ వారసుడైన పల్లోంజీ మిస్ట్రీ 1921లో జన్మించారు. తండ్రి షాపూర్ణ మిస్త్రీ మరణంతో చిన్న వయసులోన మరణించడంతో 1917లో ఈయన కుటుంబ వ్యాపార బాధ్యతల్ని తీసుకున్నారు. ఎస్పీ గ్రూపు 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,000 కోట్ల) స్థాయికి పల్లోంజీ మిస్ట్రీ తీసుకెళ్లారు. నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎస్ పి గ్రూప్ ను తీర్చిదిద్ది, కార్యకలాపాలను పలు దేశాలకు విస్తరిం చారు మస్కట్లో ఒమన్స్ రాయల్టీ ప్యాలెస్ వంటి చారిత్రక కట్టణాలను ఈ గ్రూప్ నిర్మించింది ఈ సంస్థే .
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ వ్యాపార దిగ్గజం, పద్మభూషణ్ పురస్కార గ్రహీత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
ఎవరు: ఆకాష్ అంబాని
ఎప్పుడు : జూన్ 27
ఒలింపిక్స్ ప్రపంచకప్ పతక విజేత హాకీ దిగ్గజం వరీందర్ సింగ్ కన్నుమూత :
ఒలింపిక్స్ ప్రపంచకప్ పతక విజేత హాకీ దిగ్గజం మరీందర్ సింగ్ (75) ఇకలేరు. భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమైన వరీందర్ జూన్ 28న ఉదయం జలం’ధర్ లో తుదిశ్వాస విడిచారు. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. ఫైనల్లో 2-1తో పాకిస్థాన్ ను చిత్తుచేసిన భారత్ కు ప్రతిష్టాత్మక టోర్నీలో ఇదే ఏకైక స్వర్ణ పతకం. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ లో కాంస్యం, 1973 ఆమ్స్టర్మ్ ప్రపంచకప్ లో రజతం సాధించిన భారత జట్టుకు వరేందర్ ప్రాతినిద్యం వహించాడు. 1974, 1978 ఆసియా క్రీడల్లో రజతాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడు కూడా. 1975 మాంట్రియల్ ఒలింపిక్స్ లోనూ పాల్గొన్నాడు. 2007లో వరీందరు ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కార౦. లభించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒలింపిక్స్ ప్రపంచకప్ పతక విజేత హాకీ దిగ్గజం మరీందర్ సింగ్ కన్నుమూత
ఎవరు: మరీందర్ సింగ్
ఎప్పుడు : జూన్ 28
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |