Daily Current Affairs in Telugu 01&02 July -2022
కొత్తగా ఏడు ఉపగ్రహాలను ప్రయోగించిన అమెరికా దేశ రక్షణ శాఖ :
అమెరికా దేశ రక్షణ శాఖ ఇటీవల కొత్తగా ఏడు ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. లాస్ ఏంజెలెస్ లోని మొహావీ ఎడారిలో ఉన్న అంతరిక్ష క కేంద్రం నుంచి వర్జిన్ ఆర్బిట్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరి బోయింగ్ 747 విమానం నింగిలోకి ట్ తీసుకెళ్లింది. అక్కడి నుంచి ఆది భూ కక్ష్యలోకి దూసుకెళ్లింది.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్
- అమెరికా దేశ అద్యక్షుడు :జో బిడెన్
- అమెరికా దేశ ఉపాధ్యక్షుడు :కమలా హారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి : కొత్తగా ఏడు ఉపగ్రహాలను ప్రయోగించిన అమెరికా దేశ రక్షణ శాఖ
ఎక్కడ : అమెరికా దేశ రక్షణ శాఖ
ఎవరు : అమెరికా దేశ ప్రభుత్వం
ఎప్పుడు : జులై 01
ప్రపంచ రికార్డును తిరిగి రాసిన పోల్ వాల్ట్ అథ్లెట్ ఆర్మండ్ డుప్లాంటిస్ :
స్వీడన్ దేశ పోల్ వాల్ట్ అథ్లెట్ అయిన ఆర్మండ్ డుప్లాంటిస్ ఇదివరకు తన పేరిటే ఉన్న ఔట్ డోర్ ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. స్టాక్ హోమ్ లో జరిగిన డైమండ్ లీగ్ మీట్ లో అతను 6.16 మీటర్ల (20 అడుగులు 2.5 అంగుళాలు) ఎత్తు దూకి ఛాంపియన్ గా నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రపంచ రికార్డును తిరిగి రాసిన పోల్ వాల్ట్ అథ్లెట్ ఆర్మండ్ డుప్లాంటిస్
ఎవరు : ఆర్మండ్ డుప్లాంటిస్
ఎప్పుడు : జులై 01
మానవ రహిత యుద్ధ విమానను విజయవంతంగా ప్రయోగించిన కర్ణాటక రాష్ట్రము :
మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో మన దేశం స్వయం సమృద్ధి సాధించడానికి మరెంతో కాలం వేచి చూడాల్సిన పనిలేదు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా నాయకనహట్టి దగ్గర ఉన్న డీఆర్డీవో ఏరోనాటికల్ టెస్టు రేంజ్ లో జులై 03న నిర్వహించిన రిమోట్ కంట్రోల్డ్ మానవ రహిత యుద్ధవిమాన ప్రయోగం విజయవంతమైనట్లు అధికారులు జులై 03న ప్రకటించారు. ఈ విమానాన్ని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. పరీక్షల్లో భాగంగా రన్ వె పై విజయవ౦తంగా ఎగిరిన విమానం 15 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. నిర్దేశించిన రీతిలో తిరిగి రన్వేపై దిగింది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీకి డీఆర్డీవో శాస్త్రవేత్తలు దశాబ్దం కిందట శ్రీకారం చుట్టారు. మొదట్లో నిర్వహించిన రెండు ప్రయోగాలు విఫలమైన రెండున్నరేళ్లుగా కొవిడ్ వల్ల ఆటంకం ఏర్పడినా శాస్త్రవేత్తలు వెనుకంజ వేయలేదు. అనుకున్న రీతిలో యుద్ధ విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణమంత్రి రాజ్ నాద్ సింగ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
- కర్ణాటక రాష్ట్ర రాజధాని : బెంగళూర్
- కర్నాటక రాష్ట్ర సిఎం : బసవరాజ్ బొమ్మై
- కర్నాటక రాష్ట్ర గవర్నర్ : థావర్ చాంద్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి : మానవ రహిత యుద్ధ విమానను విజయవంతంగా ప్రయోగించిన కర్ణాటక రాష్ట్రము
ఎక్కడ : కర్ణాటక రాష్ట్రము
ఎవరు : కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : జులై 01
ప్రతిష్టాత్మక డయానా పురస్కారం గెలుచుకున్న హైదరాబాది యువ వైద్యుడు :
బ్రిటన్ లో ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసిన హైదరాబాద్కు చెందిన యువ వైద్యుడిని ప్రతి ష్టాత్మక డయానా పురస్కారం వరించింది. కిమ్స్ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం డైరెక్టర్ డాక్టర్ రఘురాం, డాక్టర్ వైజయంతిల కుమారుడు డాక్టర్ సాయిరాం పిల్లారిశెట్టి ఈ ఆవార్డును సొంతం’ చేసుకున్నారు. బ్రిటన్ లో దృశ్య మాధ్యమంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డయానా పేరిట 1999లో నెలకొల్పిన ఈ అవార్డును బ్రిటన్ లో యువతకు లభించే అత్యు న్నత గౌరవంగా భావిస్తారు. దార్శనికత, సామాజిక సేన,యువతపై ప్రభావం, తదితర అంశాలను పరిగణిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు ఇతర దేశాల నుంచి యవకులు వైద్యవిద్యను అభ్యసించడానికి వచ్చే మార్గదర్శనం లేని వారి కోసం ‘బ్రిటిష్ ఇంటరీ డాక్టర్స్ అసోసియేషన్ (బిదా)’ను స్థాపించారు. “ఈ సంఘంలో విద్యార్థి విభాగాన్ని స్థాపించ౦డంలో డా. సాయిరాం కీలక పాత్ర పోషించారు. అంతకుముందు తెలుగాణలో స్థాపించిన ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రానికి సంబంధించిన యాప్ రూప కల్పనలోనూ కేలకంగా వ్యవహరించారు ఈ యాప్ పైన బ్రిటిష్ పార్లమెంట్ లో మాట్లాడే అరుదైన అవకాశాన్ని సాయిరాం దర్శించుకున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రతిష్టాత్మక డయానా. పురస్కారం గెలుచుకున్న హైదరాబాది యువ వైద్యుడు
ఎవరు : డాక్టర్ సాయిరాం
ఎప్పుడు : జులై 02
ఆయిల్ ఇండియా లిమిటెడ్సంస్థ డైరెక్టర్ గా అదనపు బాద్యతలు స్వీకరించిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ :
ఆయిల్ ఇండియా లిమిటెడ్ రెండవ అతిపెద్ద భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని హైడ్రోకార్బన్ అన్వేషకుడు మరియు ఉత్పత్తిదారు కంపెనీ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) సంస్థకు డైరెక్టర్ గా (ఫైనాన్స్), హరీష్ మాధవ్ OIL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. మాధవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో సభ్యుడు గా మరియు ఆగస్టు 02, 2019 నుండి బోర్డ్ ఆఫ్ ఆయిల్ ఇండియా -లిమిటెడ్ డైరెక్టర్ (ఫైనాన్స్) గా పని చేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆయిల్ ఇండియా లిమిటెడ్సంస్థ డైరెక్టర్ గా అదనపు బాద్యతలు స్వీకరించిన ఆయిల్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : ఆయిల్ ఇండియా లిమిటెడ్
ఎప్పుడు : జులై 02
భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్గ నిలిచిన రామగుండం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ :
భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా పని చేస్తోంది. తెలంగాణలోని రామగుండం వద్ద 100 మెగావాట్ల రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పివి ప్రాజెక్ట్ లో 20 మెగావాట్ల తుది భాగం సామర్ధ్యం యొక్క వాణిజ్య కార్యకలాపాలను జూలై 1 నుండి ప్రారంభం అవుతున్నట్లు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ప్రకటించింది.అంతకుముందు, NTPC కేరళలోని కాయంకులంలో 92 మెగావాట్ల ఫోటింగ్ సోలార్ మరియు ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రిలో 25 మెగావాట్ల అంతకుముందు, వాణిజ్య కార్యకలాపాలను ప్రకటించింది. రామగుండం వద్ద 100-మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూల లక్షణాలను కలిగి ఉంది. 423 కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావంతో నిర్మించబడిన ఈ ప్రాజెక్ట్ రిజర్వాయర్ లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSU).
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం : కే.చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందరరాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి : భారతదేశపు అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్గ నిలిచిన రామగుండం ఫ్లోటింగ్ సోలార్ప్రాజెక్ట్
ఎక్కడ : రామగుండం
ఎవరు :తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం
ఎప్పుడు : జులై 02
(FATF) అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన టి రాజా కుమార్ బాధ్యతలు :
ప్రపంచంలోని ఉగ్రవాద వ్యతిరేక ఫైనాన్సింగ్ ఏజెన్సీ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన టి రాజా కుమార్ గారు బాధ్యతలు స్వీకరించారు. గ్లోబల్ యాంటీ మనీలాండరింగ్ మరియు కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చర్యల ప్రభావాన్ని మెరుగుపరచడం కోసం, ఆస్తుల రికవరీని మెరుగుపరచడం మరియు ఇతర కార్యక్రమాలపై రాజా కుమార్ దృష్టి సారిస్తారని FATF ట్వీట్ చేసింది. అతను సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ మరియు పోలీసు దళంలో 35 సంవత్సరాల కంటే ఎక్కువ నాయకత్వం మరియు కార్యాచరణ అనుభవం కలిగి ఉన్నాడు. డాక్టర్ మార్కస్ ప్లేయర్ తర్వాత రాజా కుమార్ FATF చీఫ్ గా నియమితుడయ్యాడు.
- FATF యొక్క పూర్తి రూపం: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం : ప్యారిస్
- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్థాపన : 1989
- ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అద్యక్షుడు : టి.రాజా కుమార్
క్విక్ రివ్యు :
ఏమిటి : (FATF) అధ్యక్షుడిగా భారతీయ సంతతికి చెందిన టి రాజా కుమార్ బాధ్యతలు
ఎవరు : టి రాజా కుమార్
ఎప్పుడు : జులై 02
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |