Daily Current Affairs in Telugu 28-03-2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకం :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ పొందిన నీలం సాహ్ని రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్ గా ఖరారయ్యారు ఈ మేరకు ఆమె నియామకానికి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మార్చి 26న ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఆ బాధ్యతలో పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారి పదవీ కాలం మార్చి 31వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. తొలిసారి1984 బ్యా చ్ ఐఏఎస్ అధికారి అయిన నీలం సాహ్ని 2019 నవంబర్ 15 నుంచి 2020 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని నియామకం
ఎవరు : నీలం సాహ్ని
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : మార్చ్ 28
మహీంద్రా అండ్ మహీంద్రా నూతన ఎండీ, సీఈవోగా అనీష్ షా నియమకం :
ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) నూతన ఎండీ, సీఈవోగా అనీష్ షా గారు నియమితులయ్యారు తద్వారా ఎంఅండ్ ఎం గ్రూప్ చరిత్రలో తొలిసారి వృత్తిగత నిపుణుడిని సీఈవోగా ఎన్నుకున్నట్లు అయ్యింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ గోయెంకా గారి స్థానంలో అనీష్ బాధ్యతలు చేపట్టనున్నారని మార్చి 26న కంపెనీ తెలిపింది. 2021 ఏప్రిల్ 2న గోయెంకా పదవీ విరమణ చేయనున్నారు. అనీష్ షా ప్రస్తుతం ఎంఅండ్ఎం కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూప్ సీఎఫ్వోగా విధులు నిర్వహిస్తున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: మహీంద్రా అండ్ మహీంద్రా నూతన ఎండీ, సీఈవోగా అనీష్ షా నియమకం
ఎవరు : అనీష్ షా
ఎప్పుడు : మార్చ్ 28
2021 ఫిలిం ఫేర్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్ర౦గా నిలిచిన ‘థప్పడ్ చిత్రం :
ప్రతి యేటా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్ ఫేర్ అవార్డు వేడుక ముంబయిలో జరిగింది తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన ‘థప్పడ్’ ఉత్తమ చిత్రంతో పాటు అనేక విభాగాల్లో పురస్కారాలు సంపాదించింది. ‘అంగ్రేజీ మీడియం’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడుతో పాటు జీవిత సాఫల్య పురస్కారాలు దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కు దక్కాయి. ‘థప్పడ్ తో విమర్శకుల ప్రశంసలు పొందిన తాప్సీకి ఉత్తమ నటి పురస్కారం దక్కింది. గతేడాది కరోనా ప్రభావం ఉన్న కూడా. మార్చికి ముందు పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. ఆపై ఓటీటీలో వినోదాన్ని పంచాయి. అలా గతేడాది విభిన్న శైలిలో తమ నటనతో చెరగని ముద్రవేసిన నటులకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు 2021 వరించాయి. ఈ పురస్కారాలపై పలువురు ఖులు హర్షం ప్రకటించారు
ఉత్తమ చిత్రం | థప్పాడ్ |
ఉత్తమ దర్శకుడు | ఓం రౌత్ (తానాజీ ) |
ఉత్తమ నటుడు | ఇర్ఫాన్ ఖాన్ (అంగ్రేజీ మీడియం ) |
ఉత్తమ నటి | తాప్సి (థప్పడ్) |
ఉత్తమ సహాయ నటుడు | సైఫ్ ఆలీఖాన్ (తానాజీ) |
ఉత్తమ సహాయ నటి | ఫరూక్ జాఫర్ (గులబో సితాబో) |
క్విక్ రివ్యు :
ఏమిటి: 2021 ఫిలిం ఫేర్ అవార్డు వేడుకల్లో ఉత్తమ చిత్ర౦గా నిలిచిన ‘థప్పడ్ చిత్రం
ఎవరు : ‘థప్పడ్ చిత్రం
ఎప్పుడు : మార్చ్ 28
బంగ్లాదేశ్ నుంచి మరో నూతన రైలు ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
బంగ్లాదేశ్, భారత్ ల మధ్య మార్చ్ 27న కొత్త ప్రయాణీకుల రైలు ప్రారంభమయింది. డాకా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగుడి వరకు ‘మిథాలీ ఎక్స్ ప్రెస్ “ అనే పేరుతో ఇది నడవనుంది. ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోడీ, షేక్ హసీ నాలు సంయుక్తంగా వీడియో కాన్సరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. తేజ్గా లోని ప్రధాని హసీనా కార్యాలయం ఇందుకు వేదిక యింది ఢాకా కంటోన్మెంట్ స్టేషన్ నుంచి సరిహద్దులో ఉన్న చిలహటి మీదుగా న్యూ జల్చాయిగుడి ని చేరుకుంటుంది. ఇప్పటికే మైక్రీ ఎక్స్ ప్రెస్ (ధారా-కోల్ కతా), బంధన్ ఎక్స్ ప్రెస్ (బుల్నా-కోల్ కతా) నడుస్తున్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: బంగ్లాదేశ్ నుంచి మరో నూతన రైలు ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు : మార్చ్ 28
యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం-2020 విజేతగా నిలిచిన ఎం.నరేంద్ర నాథ్ :
దిఆంద్ర షుగర్స్ లిమిటెడ్ తణుకు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనాథ్ కు యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం-2020 లభించింది. చక్కెర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా క్షేత్రం వారు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో మార్చి 25న జరిగిన కిసాన్ మేళా కార్యక్రమంలో నరేంద్రనాథ్ పురస్కారంతో పాటు గోల్డ్ మెడల్, మొమెంటోను ” అందుకున్నారు. ఇంతవరకు నరేంద్రనాథ్ 3 రాష్ట్ర అవార్డులు, 1 దక్షిణ భారతదేశ అవార్డు, 3 జాతీయ అవార్డులు, 3 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: యూబీ రాఘవేంద్రరావు స్మారక పురస్కారం-2020 విజేతగా నిలిచిన ఎం.నరేంద్ర నాథ్
ఎవరు : ఎం.నరేంద్ర నాథ్
ఎప్పుడు : మార్చ్ 28
ప్రముఖ ఒడిస్సీ నర్తకి లక్ష్మిప్రియ మోహపాత్ర కన్నుమూత :
ప్రముఖ ఒడిస్సీ నర్తకి లక్ష్మిప్రియ మోహపాత్ర మార్చ్ 27 రాత్రి భువనేశ్వర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 86 మరియు వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. రాత్రి 11 గంటలకు లక్ష్మిప్రియా తుది శ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆమెకు కుమారుడు రతికాంత మోహపాత్రా, కోడలు సుజాత మోహపాత్రా ఉన్నారు. పురాణ ఒడిస్సీ గురు కేలుచరన్ మోహపాత్రా భార్య, లక్ష్మిప్రియా 1947 లో పూరిలోని అన్నపూర్ణ థియేటర్ లో ఒడిస్సీ నర్తకిగా తన వృత్తిని ప్రారంభించి వివిద ప్రదేశాలలో నృత్యాని ప్రదర్శించారు. కొన్ని సంవత్సరాల తరువాత, అన్నపూర్ణ థియేటర్ (బి) లో ప్రదర్శించిన నృత్య నాటకాలలో ప్రదర్శన కోసం ఆమె కటక్ కు తిరిగి వచ్చింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ ఒడిస్సీ నర్తకి లక్ష్మిప్రియ మోహపాత్ర కన్నుమూత
ఎవరు : లక్ష్మిప్రియ మోహపాత్ర
ఎక్కడ:ఓడిశా
ఎప్పుడు : మార్చ్ 27
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |