Daily Current Affairs in Telugu 26-03-2021
దేశంలోనే ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచిన జమ్మూ-కమ్మర్‌లోని బడ్డాం జిల్లా :
జమ్మూ-కమ్మర్‌లోని బడ్డాం దేశంలోనే ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచింది, దేశవ్యాప్తంగా మొత్తం 85 జిల్లాలు టీబీ రహిత ప్రాంతాల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేయగా. వాటిల్లో బడ్డాం తన మెరుగైన పనితీరుతో ఆగ్ర స్థానంలో నిలిచినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. గత ఐదేళ్లలో కనబరిచిన పనితీరుకు ఈ జిల్లాకు స్వర్ణ పతకం అందించింది. 2025 నాటికి భారత్ ను క్షయ రహిత దేశంగా చేయాలన్న లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో క్షయ వ్యాధి పై అవగాహన ప్రచారాన్ని వేగవంతం చేయాలని అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏ జిల్లా అయిన ఐదేళ్లలో క్షయ వ్యాధిని 60 శాతం తగ్గిస్తే స్వర్ణ పతకాన్ని, 40శాతం తగ్గిస్తే కాంస్యం,20 శాతం అయితే రజత పతకాన్ని అందిస్తోంది
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలోనే ఏకైక క్షయ రహిత జిల్లాగా జమ్మూ-కమ్మర్‌లోని బడ్డాం జిల్లా
ఎవరు: జమ్మూ-కమ్మర్‌లోని బడ్డాం జిల్లా
ఎక్కడ: జమ్మూ-కమ్మర్‌లోని
ఎప్పుడు : మార్చ్ 26
అణ్వస్త్ర సామర్థ్యమున్న షాహీన్-1ఎ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాకిస్థాన్ :
అణ్వస్త్ర సామర్థ్యమున్న షాహీన్-1ఎ క్షిపణిని పాకిస్థాన్ మార్చ్ 26 న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించే విదంగా ఈ అస్త్రాన్ని రూపొందించారు. ఈ అస్త్రం 900 కిలోమీటర్లు దూసుకెళ్లగలదు. ఈ అధునాతన మార్గనిర్దేశ వ్యవస్థతో సహా ఈ ఆయుధంలోని డిజైన్ ను సాంకేతిక అంశా లపై మదింపు చేయడానికి ఈ పరీక్షను నిర్వ హించినట్లు పాక్ సైన్యం తెలిపింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం ఈ క్షిపణి యొక్క సొంతమని పేర్కొంది
క్విక్ రివ్యు :
ఏమిటి: అణ్వస్త్ర సామర్థ్యమున్న షాహీన్-1ఎ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన పాకిస్థాన్
ఎవరు: పాకిస్థాన్
ఎక్కడ: పాకిస్థాన్
ఎప్పుడు : మార్చ్ 26
జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో ప్రపంచ రికార్డును సృష్టించిన సుమిత్ :
జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో సుమిత్ తన పేరు మీదనే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. మార్చ్ 26 జావెలిన్ త్రో ఎఫ్4 విభారంలో ఈటెను 68.80 మీటర్ల దూరం విసిరిన ఈ 22 ఏళ్ల పారా అథ్లెట్ ఇటీవల ఇండియన్ గ్రాండ్ ప్రిలోనే తాను నెలకొల్పిన 88 49 మీటర్ల రికార్డును అతనే బద్దలు కొట్టాడు. సుమిత్ ఇప్పటికే టోక్యో పారాలింపిక్స్ కు అర్హత సాధించాడు. ఈ పోటీల్లో సందీప్ చౌదరీ (80.90మీ) రెండో స్థానంలో నిలిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌లో ప్రపంచ రికార్డును సృష్టించిన అథ్లెట్ సుమిత్
ఎవరు: సుమిత్
ఎప్పుడు : మార్చ్ 26
దక్షిణ భారతదేశంలో మొదటి అమెరికా కార్నర్ ను ప్రారంభించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం :
ప్రతిష్టాత్మకమైన అమెరికా కార్నర్(అమెరికా స్పేస్)ను దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. దేశంలో అహ్మదాబాద్ తరువాత అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండో కార్నర్ ఇది కావడం విశేషం. మార్చి 23న జరిగిన దేశంలో అహ్మదాబాద్ తరువాత అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండో కార్నర్ ఇదినిలిచింది. మార్చి 23న జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఈ కార్నర్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో అమెరికా కాన్సులేట్ అధికారులు ఆంధ్రా వర్సిటీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఈ కార్నర్ ఆరంభమైనట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికా-భారత్ మధ్యం విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సహకారం, బంధాల బలోపేతానికి ఈ కేంద్రం దోహదపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణ భారతదేశంలో మొదటి అమెరికా కార్నర్ ప్రారంభమైన ఆంధ్రా విశ్వవిద్యాలయం
ఎవరు: ఆంధ్రా విశ్వవిద్యాలయం
ఎప్పుడు : మార్చ్ 26
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియామకం :
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల ను నియమించినట్లు వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు రత్నాకర్ ఎన్నో బాధ్యతల్లో వివిధ పదవులలో ప్రవాస సంఘాల్లో పని చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియామకం
ఎవరు: రత్నాకర్ కడుదుల
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు : మార్చ్ 26
దేశంలో సమాంతర రన్‌వేలను కలిగి ఉన్న మొదటిది విమానాశ్రయం నిలిచిన కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ :
లక్నో నుండి ఇండిగో విమానం విజయవంతంగా టచ్ డౌన్ కావడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కెఐఎ) దక్షిణ భారతదేశంలో సమాంతర రన్‌వేలను కలిగి ఉన్న మొట్టమొదటిదిగా నిలిచింది ఇది జూన్ 2020 లో పునరుద్ధరణ మరియు నవీకరణల కోసం మూసివేయబడిన ఉత్తర రన్ వె నుండి విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు గుర్తించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: దేశంలో సమాంతర రన్‌వేలను కలిగి ఉన్న మొదటిది విమానాశ్రయం కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్
ఎవరు: కెంపెగౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్
ఎక్కడ: బెంగళూర్
ఎప్పుడు :మార్చ్ 26
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |