Daily Current Affairs in Telugu 24 June -2022
అంతర్గత భద్రత స్పెషల్ సెక్రటరీగా స్వాగత్ దాస్ నియామకం :
కేంద్ర హోం మంత్రిత్వశాఖలో అంతర్గత భద్రత (internal Security) స్పెషల్ సెక్రటరీగా స్వాగత్ దాస్ గారు నియమితులయ్యారు. ఈ హోదాలో స్వాగత్ దాస్ గారి నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 1987 బ్యాచ్ కు చెందిన ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన స్వాగత్ దాస్ ప్రస్తుతం ఇంటిలిజెన్స్ బ్యూరో స్పెషల్స్ డెరెక్టర్ గా ఉన్నారు. 2024 నవంబర్ 30న ఈయన పదవీ విరమణ చేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్గత భద్రత స్పెషల్ సెక్రటరీగా స్వాగత్ దాస్ నియామకం
ఎవరు: స్వాగత్ దాస్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 24
ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం దక్కించుకున్న డా ప్రతాప్ :
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డికి ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు) లభించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమిళనాడు శాఖ, జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ యువ వైద్యుల దినోత్సవం (వరల్డ్ యంగ్ డాక్టర్స్ డే) సదస్సులో ఈ ఆవార్డును ఆయనకు అందజేశారు. దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం చేసిన నేపథ్యంలో… ఆయనను ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా గుర్తించి ఈ పుర స్కారం అందజేసినట్లు తెలిపారు ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రతి భారతీ యుడికే అందుబాటులోకి తీసుకురావడంలో డా. ప్రతాప్ సీ.రెడ్డి చేసిన కృషి ఫలితంగా ఆపోలో సంస్థ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక జీవన సాఫల్య పురస్కారం దక్కించుకున్న డా ప్రతాప్
ఎవరు: డా ప్రతాప్
ఎప్పుడు : జూన్ 24
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా తపన్ కుమార్ నియామకం
కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్ 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీ ఎస్ అధికారి తపన్ కుమార్ డేకా నియమితు లయ్యారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న 1984 అస్సాం క్యాడర్ ఐపీఎస్ అధికారి ఆరు సంవత్సరాల పదవి కాలం పూర్తికావడంతో డేకాను నియమిస్తూ నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. కొత్త డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. డేకా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆపరేషన్స్ డెస్క్ బాధ్యతలు చూస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా తపన్ కుమార్ నియామకం :
ఎవరు: తపన్ కుమార్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 24
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సెక్రెటరీ సామంత్ కుమార్ గోయల్ పదవి కాలం పెంపు :
ప్రస్తుతం రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) సెక్రెటరీగా పనిచేస్తున్న 1984 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సామంత్ కుమార్ గోయల్ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు రెండేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇలా ఏడాది పాటు ఆయన పద వీకాలాన్ని ఇది రెండోసారి.
క్విక్ రివ్యు :
ఏమిటి: రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ సెక్రెటరీ సామంత్ కుమార్ గోయల్ పదవి కాలం పెంపు
ఎవరు: సామంత్ కుమార్ గోయల్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 24
నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ నియమకం :
నీతి ఆయోగ్ సీఈఓగా 1981 బ్యాచ్ యూపీ క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పరమేశ్వరన్ అయ్యర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న అమితా బాకాంత్ పదవీకాలం ఈనెల 30వతేదీన ముగియనున్న నేపథ్యంలో ఈయన్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. పరమేశ్వరన్ అయ్యర్ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య. గ్రామీణ తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిర్వహణ బాధ్యతలను ఈయనకు అప్పగించింది.. దేశవ్యాప్తంగా మరుగుదొడ్లను నిర్మించి బహిరంగ మల విసర్జన లేకుండా చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. 2009లో స్వచ్ఛంద పదవీ రమణ చేసి.ప్రపంచబ్యాంకు చేపట్టిన తాగు నీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నీతి ఆయోగ్ సీఈఓగా కీలక బాధ్య తల్లో నియమితులయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ నియమకం
ఎవరు: పరమేశ్వరన్ అయ్యర్
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 24
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న కె. సజయ :
సామాజిక ఉద్యమకారిణి,రచయిత్రి కె. సజయను అనువాద రచనలో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకా డమీ పురస్కారం వరించింది. 2021 సంవత్సరానికి గాను అనువాద రచనల విభాగంలో పురస్కారాలను అకాడమీ జూన్ 24న ప్రకటించింది. ఇంగ్లీషు సహా 22 భారతీయ భాషల్లో అనువాద రచనలకు అవార్డులు ప్రకటించిన అకాడమీ మైథిలీ, రాజస్థానీ భాషల్లో అనువాద పురస్కారాలను త్వరలో లేదని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రముఖ రచయిత్రి భాషాసింగ్ హిందీలో రచించిన ‘అదృశ్య భారత’ను (నాస్ఫిక్షన్) సజయ ‘అశుద్ధ భారత్’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మి కుల దుర్భర జీవన స్థితిగతులపై ఆధారాల సహితంగా తెలుగులోకి తీసుకొచ్చారు ఈ ప్రచురణ అనువాద రచన ఎంపికకు జ్యూరీ సభ్యు లుగా ప్రొఫెసర్ ఎస్. శేషారత్నం, వై.పాత్రలు ముకుంద రామారావు, డాక్టర్ జి. సాంబశివరావు వ్యవహరించారు. అవార్డు కింద సజయకు రూ. 50వేల రూపాయల నగదు, తామ్రఫలకం అందజేయనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం గెలుచుకున్న కె. సజయ
ఎవరు: కె. సజయ
ఎప్పుడు : జూన్ 24
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |