Daily Current Affairs in Telugu 24-03-2021
అమెరికా సర్జన్ జనరల్ గా వివేక్ మూర్తి సెనేట్ నియామకానికి ఆమోదం :
అమెరికా సర్జన్ జనరల్ గా భారత సంతతి చెందిన ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి నియామకం ఖారారైంది. ఇందుకు సంబంధించి అద్యక్షుడు జో బైడేన్ చేసిన ప్రతిపాదనకు 57-43 ఓట్ల తేడాతో సెనేట్ అమోదం తెలిపింది. ఏడుగురు రిపబ్లిక్ సబ్యులు కూడా మూర్తి ఎంపికను సమర్దించారు. కరోనా మహమ్మారి నియంత్రణ సహా ప్రజారోగ్య విషయాలలో అధ్యక్షునిగా వివేక్ సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు.వైరస్ కట్టడి చేసేందుకు ఇప్పటికే ఆయన ప్రణాళికలు రూపొంచించారు. 2011 లో ఒబామా హయాం లో అమెరికన్ సర్జన్ జనరల్ వివేక్ పనిచేసాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా సర్జన్ జనరల్ గా వివేక్ మూర్తిని సెనేట్ నియామకానికి ఆమోదం
ఎవరు: వివేక్ మూర్తి
ఎక్కడ :అమెరికా
ఎప్పుడు : మార్చ్ 24
ప్రపంచ క్షయవ్యాధి (టిబి) దినోత్సవ౦గా మార్చ్ 24 :
ప్రతి సంవత్సరం, టిబి యొక్క వినాశకరమైన ఆరోగ్యం, సామాజిక మరియు ఆర్ధిక పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి మరియు ప్రపంచ (టిబి) మహమ్మారిని అంతం చేసే ప్రయత్నాలను వేగవంతం చేయడానికి మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి (టిబి) దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1882 లో డాక్టర్ రాబర్ట్ కోచ్ టిబికి కారణమయ్యే బాక్టీరియంను కనుగొన్నట్లు ప్రకటించిన రోజును గుర్తు చేస్తుంది. ఇది ఈ వ్యాధిని నిర్ధారించడానికి మరియు నయం చేయడానికి మార్గం ను చూపించింది. TB ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక అంటు వ్యాదులలోఒకటి గా ఉంది. ప్రతి రోజు, దాదాపు 4000 మంది టిబితో ప్రాణాలు కోల్పోతున్నారు. టిబిని ఎదుర్కోవటానికి ప్రపంచ ప్రయత్నాలు చేయగా 2000 సంవత్సరం నుండి 63 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడగలిగారు. ప్రపంచ టిబి డే 2021 యొక్క థీమ్ – ‘ది క్లాక్ ఈస్ టికింగ్’ – ప్రపంచ టిబిని అంతం చేసే కట్టుబాట్లపై చర్య తీసుకోవడానికి ప్రపంచంలో సమయం ముగిసిందనే భావనను ఇది తెలియజేస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ క్షయవ్యాధి (టిబి) దినోత్సవ౦గా మార్చ్ 24 :
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎక్కడ:
ఎప్పుడు : మార్చ్ 24
జంతుసంరక్షణ కొరకు అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్ లను ప్రారంబించనున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం :
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) తెలిపింది. పశువైద్య సేవలను ఇంటి వద్దనే అందించడానికి 108 సేవల తరహాలో మొత్తం 175 మొబైల్ అంబులెన్సులు (వెటర్నరీ) క్లినిక్‌లను అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మొబైల్ అంబులెన్సులు స్పాట్ డయాగ్నసిస్ మరియు అత్యవసర కేసులకు స్పందించడం తో పాటు పశువైద్య ప్రథమ చికిత్స సేవలను అందిస్తాయి. ఈ అంబులెన్సులు అందించే ప్రధాన సౌకర్యాలలో ఒకటి జంతువులను ఎత్తడానికి మరియు అత్యవసర పరిస్థితుల్లో సమీప ప్రభుత్వ వెటర్నరీ ఫెసిలిటీకి మార్చడానికి ‘హైడ్రాలిక్ లిఫ్ట్’ సౌకర్యం ను కూడా ఏర్పాటు చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: జంతుసంరక్షణ కొరకు అంబులెన్స్ వెటర్నరీ క్లినిక్ లను ప్రారంబించనున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ: ఆంద్రప్రదేశ్
ఎప్పుడు : మార్చ్ 24
వ్యాస్ సమ్మన్ -2020 పురస్కారాన్ని గెలుచుకున్న ప్రసిద్ధ హిందీ రచయిత ప్రొఫెసర్ శరద్ పగారే :
ప్రసిద్ధ హిందీ రచయిత ప్రొఫెసర్ శరద్ పగారే తను రచించిన ‘పట్లిపుత్రు సమ్రాగి’ అనే ఒక నవలకు గాను ప్రతిష్టాత్మక అవార్డు అయిన వ్యాస్ సమ్మన్ – 2020 ను దక్కించుకున్నారు. 1991లో ప్రారంభమైన వ్యాస్ సమ్మన్ అవార్డు, కె కె బిర్లా ఫౌండేషన్ అనేది హిందీ భాషలో లో అత్యుత్తమ౦గా చేసిన సాహిత్య రచనల కు గాను ఈ అవార్డు ను ఇస్తారు. గత 10 సంవత్సరాలలో ప్రచురించిన రచనలలో ఒక భారతీయ పౌరుడిగా ఈయన నిలిచారు. ఈ పురస్కారం ను ఓక మేమెంటో తో పాటు మరియు ఫలకంతో పాటు నాలుగు లక్షల రూపాయల పురస్కారాన్ని అందించనున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వ్యాస్ సమ్మన్ – 2020 పురస్కారాన్ని గెలుచుకున్న ప్రసిద్ధ హిందీ రచయిత ప్రొఫెసర్ శరద్ పగారే
ఎవరు: ప్రొఫెసర్ శరద్ పగారే
ఎప్పుడు : మార్చ్ 24
దుబాయ్ ఉప పాలకు డు షేక్ హ మ్ దాన్ కన్నుమూత :
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక మంత్రి, దుబాయ్ ఉప పాల కుడు (డిప్యూటీ రూలర్) షేక్ హమ్దాన్ బిన్ రషీద్ ఆల్ మన్రోమ్ (75) కన్నుమూసినట్లు ఆయన సోదరుడు మార్చ్ 24న తెలిపారు. షేక్ హమ్దాన్ కొన్ని నెలలుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో విదేశాలకు వెల్లి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేయాలంటూ కొద్ది వారాల క్రితం ఆయన సోదరుడు షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. 1971లో యూఏఈ తొలి కేబినెట్ ఏర్పాటైన నాటి నుంచి షేక్ హమ్దాన్ అర్టిక మంత్రిగా పనిచేస్తూ ‘వచ్చారు. షేక్ మహమ్మద్ వద్ద ఉప పాలకుడుగా కూడా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశ చమురు సంపదను సమర్థంగా నిర్వహించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. తన సోదరుడితో కలిసి దుబాయ్ ని ప్రాంతీయ ఆర్థిక హబ్ గా తీర్చిది ద్దంలో కృషి చేశారు
క్విక్ రివ్యు :
ఏమిటి: దుబాయ్ ఉప పాలకుడు షేక్ హ మ్ దాన్ కన్నుమూత
ఎవరు: షేక్ హ మ్ దాన్
ఎక్కడ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
ఎప్పుడు :మార్చ్ 24
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |