Daily Current Affairs in Telugu 22-03-2021
2020 సంవత్సరానికి గాను బంగ బంధు కు దక్కినగాంధీ శాంతి పురస్కారం :
ప్రపంచంలోనే వివిధ రంగాల ప్రముఖుల ఇచ్చే గాంధీ శాంతి పురస్కారాలను మార్చి 22 కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 2020 సంవత్సరానికి దివంగత బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కు 2019 సంవత్సరానికి గాను ఒమాన్ దేశ దివంగత సుల్తాన్ కాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ బహుకరించనున్నట్లు తెలిపింది.ఈ ఏడాదే బంగ బంధు శత జయంతి ఉత్సవాలు జరగనుండం గమనార్హం. భారత్ మరియు ఒమన్ దేశాల మద్య సంబందాలు మెరుగుదలకు చేసిన కృషి గాను సుల్తాన్ కాబూస్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాదే కన్నుమూసారు. మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్బంగా 1995 లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ప్రదాని నరేంద్ర మోడి అద్యక్షతన మార్చి 19 న జరిగిన కమిటీ సమావేశం లో వీరిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పురస్కారం కింద కోటి రూపాయలు నగదు ,ప్రశంసా పత్రం చేనేత వస్త్రాన్ని , సంప్రదాయ హస్త కళ ల వస్తువు ను బహుకరిస్తారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: 2020 సంవత్సరానికి బంగ బంధు కు దక్కిన గాంధీ శాంతి పురస్కారం
ఎవరు: బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్
ఎప్పుడు: మార్చ్ 22
అమెరికా దేశ నౌక దళ తొలి మహిళా అధికారికి దక్కిన గౌరవం :
అమెరికా నౌక దళం లో చీఫ్ పెట్టి ఆఫీసర్ గా నియమితులైన తొలి మహిళకు అరుదైన గౌరవం దక్కింది.యు.ఎస్ ఎస్ కు కాన్స్టి ట్యూషన్ అనే యుద్ద నౌకలోని ఒక భారీ తుపాకీ కి ఆమె పేరును పెడుతున్నట్లు నేవి పేర్కొంది. లోరెట్ట పర్ఫెక్ట్ వాల్ష్ పేరిట ‘పర్ఫెక్షనిస్ట్’ అని ఆ అయుదానికి నామకరణం చేసింది. ఆమె 1917 మార్చి 21 న నౌకా దళ చీఫ్ పెట్టి ఆఫీసర్ బాద్యతలు చేపట్టారు.మహిళా మాసాన్ని పురస్కరించుకొని మార్చి 22బోస్టన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ఈ పేరును ఖరారు చేసారు.యు.ఎస్.ఎస్ కాన్స్టిట్యూషన్ ప్రపంచం లోనే అత్యంత పురాతన యుద్దనౌక 1797నుంచి 1855 వరకు అది సేవలు అందించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అమెరికా దేశ నౌక దళ తొలి మహిళా అధికారికి దక్కిన గౌరవం
ఎక్కడ: యు.ఎస్
ఎప్పుడు: మార్చ్ 22
క్వాంటం ప్రయోగం ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో సంస్థ :
భవిష్యత్ తరం క్వాంటం కమ్యునికేషన్ వ్యవస్థ కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోదన సంస్థ ఇస్రో మార్చి 22 ఒక కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రీ స్పేస్ క్వాంటం కమ్యునికేషన్ ను 300 మీటర్ల దూరంలో దిగ్విజయంగా నిర్వహించింది. ఈ తరహ ప్రయోగాన్ని నిర్వహించడం దేశంలో ఇది మొదటి సారి.అరుదైన ఈ ఘనత ను సాధించడానికి అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో దేశీయంగా సాధించింది. ట్రాన్స్ మీటర్ రిసీవర్ మాడ్యుల్స్ కు మద్య సమయాన్ని సమన్వయ పరచడానికి సొంతంగా అబివృద్ది చేసిన నావిక్ రిసీవర్ కూడా ఇందులో ఉపయోగించింది. ఆప్టికల్ ఆలైన్ మెంట్ కోసం భారీ టేలిస్కోపులకు బదులు గింబాల్ వ్యవస్థలు వాడింది. క్వాంటం కి ఎన్ క్రిప్ట్ సంకేతాలను ఈ వీడియో కాన్ఫరెన్స్ గాను నిర్వహించింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: క్వాంటం ప్రయోగం ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో సంస్థ
ఎవరు: ఇస్రో సంస్థ
ఎప్పుడు: మార్చ్ 22
అంతర్జాతీయ నీటి దినోత్సవం గా మార్చ్ 22 :
ప్రతి ఏటా మార్చ్ 22 ను అంతర్జాతీయ నీటి దినోత్సవం ను జరుపుకుంటారు. మంచినీటి యొక్క ప్రాముఖ్యత మరియు కాలుష్యం నుండి నీటిని సురక్షితంగా ఉంచడానికి స్థిరమైన పద్ధతులను ఎలా ఉపయోగించాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి 1992 లో ఐక్యరాజ్య సమితి ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించింది: 1993 ఉద్దేశ్యం:నీటి అవసరం, ప్రాముఖ్యత, నీటి సంరక్షణ,నీటి వనరుల స్థిరమైన నిర్వహణ తెలియజేయడం. కాగా ఈ సంవత్సరం నీటి దినోత్సవం థీం “Valuing Water” and “a conversation about what water means to you గా ఉంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: అంతర్జాతీయ నీటి దినోత్సవం గా మార్చ్ 22
ఎక్కడ:ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మార్చ్ 22
మెక్సికో ఓపెన్ ఏటి పి-500 టోర్నమెంట్ విజేతగా నిలిచిన జ్వేరేవ్ :
మెక్సికో ఓపెన్ ఏటి పి-500 టోర్నీ విజేతగా జర్మని టెన్నిస్ స్టార్ జ్వేరేవ్ నిలిచాడు. మెక్సికో లోని అకాపుల్కో నగరంలో మార్చ్ 21న జరిగిన ఫైనల్లో జ్వేరేవ్ 6-4,7-6(7/3)తో స్పిటి పాస్ (గ్రీస్) ను ఓడించాడు. ఓవరాల్ జ్వేరేవ్ కెరీర్లో ఇది 14వ సింగిల్స్ టైటిల్ 28 ఏళ్ల ఈ టోర్నీలో చరిత్రలో సింగిల్స్ చాంపియన్ గా నిలిచిన తొలి జర్మని ప్లేయర్ జ్వేరేవ్ గుర్తింపు పొందాడు. కాగా విజేతగా నిలిచిన జ్వేరేవ్ కు 88,940 డాలర్ల ప్రైజ్ మని (రూ.64లక్షల 41వేలు) తో పాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి: మెక్సికో ఓపెన్ ఏటి పి -500 టోర్నమెంట్ విజేతగా నిలిచిన జ్వేరేవ్
ఎవరు: జ్వేరేవ్
ఎప్పుడు: మార్చ్ 22
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం గా నిలిచిన జెర్సీ :
67 వ జాతీయ చిత్ర పురస్కారాలు ప్రకటించబడ్డాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఒక సంవత్సరంపాటు ఆలస్యం అయిన ఈ అవార్డులను .డిల్లీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమం చివరకు ,మార్చి 22 జరిగింది మరియు ఇక్కడ మేము నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2020లో విజేతల పూర్తి జాబితాను ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్ విభాగలో హిందీ చిత్రాలు పెద్ద సంఖ్యలో నిలిచాయి. ఉత్తమ నటుడి అవార్డు మనోజ్ బాజ్‌పేయి (భోస్లే) సినిమాకు, ధనుష్ (తమిళం) లకు దక్కించుకోగా, కంగనా రనౌత్ మణికర్ణిక సినిమాకు, పంగా సినిమాకు చిత్రాలలో నటించినందుకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. మరక్కర్ ఉత్తమ చలన చిత్రంగా అవతరించగా, ఉత్తమ చలనచిత్రం (హిందీ) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ యొక్క చిచోరే సినిమాకు దక్కింది..
ఉత్తమ చలన చిత్రం | మరక్కర్: అరబికడాలింటే సింహామ్ |
ఉత్తమ హిందీ చిత్రం | చిచోర్ |
ఉత్తమ నటుడు (మగ) | మనోజ్ బాజ్‌పేయి (భోస్లే), ధనుష్ (అసురాన్) |
ఉత్తమ నటుడు (స్త్రీ) | కంగనా రనౌత్ (మణికర్ణిక మరియు పంగా) |
ఉత్తమ సహాయ నటుడు (మగ) | విజయ్ సేతుపతి |
ఉత్తమ సహాయ నటుడు (ఆడ): | పల్లవి జోషి |
ఉత్తమ ఎడిటింగ్ చిత్రం | జెర్సీ (తెలుగు) |
ఉత్తమ ఆడియోగ్రఫీ | రేసుల్ పూకుట్టి |
ఉత్తమ స్క్రీన్ ప్లే | గుమ్నామి |
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయని | బార్డో (మరాఠీ) కోసం సవాని రవీంద్ర |
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ గాయని | బార్డో (మరాఠీ) కోసం సవాని రవీంద్ర |
క్విక్ రివ్యు:
ఏమిటి: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం గా నిలిచిన జెర్సీ
ఎప్పుడు: మార్చ్ 22
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |