Daily Current Affairs in Telugu 20&21-03-2021
ప్రపంచ౦ లోనే నాలుగో అతి పెద్ద సైనిక శక్తి గా నిలిచిన భారత్ :
ప్రపంచం లోనే అత్యంత బలమైన సైనిక శక్తి చైనా వద్ద ఉందని మిలిటరీ డైరెక్ట్ వెబ్ సైట్ పేర్కొంది.ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానం లో ఉందని మార్చి 20న విడుదల చేసిన నివేదికలో తెలిపింది.అమెరికా రెండో స్థానం లో ఉందని వివరించింది. మూడో స్థానం లో రష్యా నిలిచిందని పేర్కొంది.ఫ్రాన్స్ కు ఐదువ స్థానం బ్రిటన్ కు తొమ్మిద వ స్థానం దక్కాయని తెలిపాయి. చైనా కు 82, అమెరికా కు 74, రష్యా కు 69, భారత్ కు 61 ,ఫ్రాన్స్ కు 58, బ్రిటన్ కు 43 పాయింట్లు లబించాయని వెల్లడించింది. రక్షణ బడ్జెట్లు క్రియాశీల రిజర్వ్ బలగాల సంఖ్య వైమానిక నౌకా శక్తి అన్వస్త్రాలు వంటి అంశాల ఆదారంగా సైనిక సామర్ద్యాన్నిలెక్కించినట్లు తాజా నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ౦ లోనే నాలుగో అతి పెద్ద సైనిక శక్తి గా నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: మార్చ్ 20
షూటింగ్ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్ :
షూటింగ్ ప్రపంచ కప్ లో భారత్ సత్తా చాటింది. మార్చి 21న మన షూటర్లు రెండు స్వర్ణాలు ఖాతాలో చేర్చారు. డాక్టర్ కర్నిసింగ్ రేంజ్ లో జరుగుతున్న ఈ టోర్నీ లో పోటీలలో మూడో రోజు పురుషుల 10మీటర్ల ఎయిర్ ఫిస్తల్ టీం విభాగం ఫైనల్లో సౌరభ్ చౌదరి ,అభిషేక్ వర్మ ,షాహ్ జార్ రిజర్వ్ లతో కూడిన జట్టు 17-11తో వియత్నాం( దిన్ తా కంగ్ ట్రాన్ ,చుయె న్ )పై గెలిచింది. మహిళా 10మీటర్ల ఎయిర్ పిస్టల్ టీం విభాగం లో ఫైనల్లో యశశ్విని,మను భాకర్ శ్రినివేత బృందం 16-18 తో పోలెండ్ (జులిటా,జానా)అగ్నేస్టా) ను ఓడించి పసిడి పథకం సొంతం చేసుకుంది. ఈ టోర్నీ లో భారత్ కు ఇది మూడో స్వర్ణం .రెండో రోజు పోటీ లో మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగం లో యశశ్వి సింగ్ పసిడి గెలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు పురుషుల ఎయిర్ రైపిల్ టీం విభాగం లో రజత పతకం ను భారత్ సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: షూటింగ్ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారత్
ఎవరు: భారత్
ఎప్పుడు: మార్చ్ 21
ప్రపంచ కప్ షూటింగ్ మహిళల స్కీట్ లో పథకం గెలుచుకున్న తొలి మహిళా షూటర్ గా గనమత్ :
మహిళల స్కీట్ లో భారత యువ షూటర్ గనమత్ సేకో ఇటీవల కాంస్యం పతకం ను గెలుచుకుంది.ప్రపచంలోనే షూటింగ్ కప్ లో మహిళల స్కీట్ లో ఈ ఘనత సాధించిన భారత తొలి షూటర్ గా ఆమె రికార్డ్ సృష్టించింది .ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగం (2018) లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్ కూడా ఆమెనే నిలిచింది .స్కీట్ ఫైనల్లో గనిమీత్ 40 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. పురుషుల స్కీట్ లో గుర్ జ్యోత్(17పాయింట్లు ) ఆరో స్థానం లో నిలిచారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ కప్ షూటింగ్ మహిళల స్కీట్ లో పథకం గెలుచుకున్న తొలి మహిళా షూటర్ గా గనమత్
ఎవరు: గనిమీత్
ఎప్పుడు: మార్చ్ 21
జాతీయ టెన్నిస్ చాంపియన్ గా నిలిచిన రష్మిక :
తెలంగాణా అమ్మాయి రష్మిక భమిడి పాటి సత్తా చాటింది.జాతీయ టెన్నిస్ హార్ట్ కోర్ట్ చాంపియన్ షిప్ లో ఆమె చాంపియన్ గా నిలిచింది. మార్చ్ 21న మహిళల సింగిల్స్ ఫైనాల్లో రెండో సీడ్ రష్మిక 6-2,7-,7/2)తో టాప్ సీడ్ వైదేహి చౌదరి (గుజరాత్) ని వరుస సెట్లలో ఓడించింది. తొలి సెట్ ఆరంబం లోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 3-0 తో ఆధిక్యం లోకి వెళ్ళిన రష్మిక ఆ తర్వాత అదే జోరును కొనసాగించింది.సెట్ గెలుచుకుంది.రెండో సెట్ లో బ్రేక్ సాధించి 3-2 తో నిలిచిన రష్మిక ఆ తర్వాత ఎనిమిదో గేం లో సర్వీస్ కోల్పోయింది. ఆపై స్కోర్లు సమం కావడంతో సెట్ ట్రై బ్రేకర్ కు మళ్ళింది .త్రైబెకర్ 7-2 తో గెలిచిన రష్మిక సెట్ తో పాటు టైటిల్ ను సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ టెన్నిస్ చాంపియన్ గా నిలిచిన రష్మిక :
ఎవరు: రష్మిక
ఎప్పుడు: మార్చ్ 21
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ కు దక్కిన స్కోచ్ అవార్డు :
తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ (టి.ఎస్.ఎస్.పి.డి.సి ఎల్ ) ను స్కోచ్ అవార్డ్ వరించింది. 72వ స్కోచ్ సదస్సు సందర్బంగా మార్చి 20న సిఎం.డి అన్నమనేని గోపాల్ రావు కు అందజేస్తున్నట్లు ప్రకటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో విజయవంతమైన పలితాలు సాధింసినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నట్లు పెర్కొన్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తిలో తమ శాఖ చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లబించిందని గోపాల్ రావు తెలిపారు. ఎస్.పి.డి.సి డి ఎల్ పరిధిలో వ్యవసాయ అవసరాలకు పెరుగుతున్న డిమాండ్ ను అందుకోవడానికి అంతరాయం లేకుండా సరఫరా అందించడానికి సౌర విద్యుత్ ఉపకరిస్తుందని చెప్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ కు దక్కిన స్కోచ్ అవార్డు
ఎవరు: తెలంగాణ
ఎక్కడ: తెలంగాణ
ఎప్పుడు: మార్చ్ 21
మూడవ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు :
ఇస్రో ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ సి.ఎస్.ఈ.ఎస్ సెంటర్ నేషనల్ ఎట్యుడ్స్ స్పెషియల్స్ ) సంయుక్తంగా మూడో అంతరిక్ష ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. విజ్ఞాన్ ప్రసార్ నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యునికేషన్ అన్ లాకింగ్ ఇండియాస్ స్పేస్ పోటేన్శియాల్ జియో స్పేషియో డేటా మ్యాపింగ్ అనే అంశం పై నిర్వహించిన దృశ్య మాద్యమం సమావేశం లో ఇస్రో చైర్మన్ డాక్టర్ కే.శివన్ ఈ విషయం ను ద్రువికరించారు .ఇస్రో సి.ఎస్.ఈ.ఎస్ ఈ లు సంయుక్తంగా 2011 లో మేఘట్రాపిక్స్ 2013 లో సరళ అల్టికా ప్రాజెక్టు లు ప్రయోగించారు. కాగా మళ్లి ఈ రెండు సంస్థలు మళ్లి మూడో అంతరిక్ష ప్రాజెక్ట్ ను రూపొందించేందుకు సిద్దం అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మూడవ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకున్న భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు :
ఎవరు: భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు
ఎప్పుడు: మార్చ్ 21
మిషన్ గ్రామోదయ అనే కార్యక్రమం ప్రారంభించిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ;
మధ్యప్రదేశ్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో మిషన్ గ్రామదయను అనే కార్యక్రమం ను ప్రారంభించారు. గ్రామదయ మిషన్ కింద, గ్రామీణ ప్రాంతాల్లో గృహ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రాథమిక, ప్రాథమిక మౌలిక సదుపాయాలు కూడా విస్తరించనున్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గ్రామోదయ మిషన్ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ప్రసంగిస్తూ గ్రామీణాభివృద్ధి పథకాలు, ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన మధ్యప్రదేశ్‌లో సమర్థవంతంగా అమలు చేయబడుతున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కరోనా కాలం నాటి ప్రతికూల పరిస్థితులలో 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యక్రమంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు చెందిన 1 లక్ష 25 వేల మంది లబ్ధిదారుల కుటుంబాలకు ఇళ్లు ఇచ్చారు
క్విక్ రివ్యు :
ఏమిటి: మిషన్ గ్రామోదయ అనే కార్యక్రమం ప్రారంభించిన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు: మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: మధ్యప్రదేశ్
ఎప్పుడు: మార్చ్ 20
భారత్ మరియు అమెరికా ప్రతిన్దుల మద్య జరిగిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు :
ద్వైపాక్షిక రక్షణ సంబందాలను మరింత బలోపేతం చేసుకోనవాలని భారత్ అమెరికా నిశ్చయించాయి. ఇందుకు గాను ఉభయ సైన్యాల మద్య సహకారం ఒప్పందాన్ని పెంపొందిచుకోవాని నిర్ణయం తీసుకున్నాయి. చైనా దురాక్రమణ ఆధిపత్య ధోరణి కనబరుస్తున్న ఇండో ఫసిఫిక్ ప్రాంతం లో భారత్ లో తమకు దృడమైన భాగస్వామ్యం ఉందని అమెరికా ఉద్గాటించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి అయిన లాయిడ్ఆస్టిన్ ల మద్య మార్చి 21 న చర్చలు జరిగాయి. ఉభయ దేశాలు ఎదుర్కొంటున్న భద్రత సవాళ్లు తూర్పు లద్దాక్ లో చైనా దూకుడు వంటి అంశాలు వారి మద్య ప్రస్తావనకు వచ్చాయి .మూడు రోజుల పాటు పర్యటన నిమిత్తం లాయిడ్ మార్చి 19 న భారత్ కు వచ్చారు .కాగ వివిద అంశాల గురించి చర్చించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత్ మరియు అమెరికా ప్రతిన్దుల మద్య జరిగిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు
ఎవరు: భారత్ మరియు అమెరికా
ఎప్పుడు: మార్చ్ 22
అంతర్జాతీయ అటవీ దినోత్సవం గా మార్చ్ 21:
ప్రతి సంవత్సరం, మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా జరుపుకుంటారు. భూమిపై జీవన చక్రాన్ని సమతుల్యం చేయడానికి అడవుల విలువలు, ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన పెంచడం ఈ రోజు జరుపుకుంటారు. కాగా మొదటి సారిగా ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) యొక్క 16 వ సెషన్ 1971 లో “ప్రపంచ అటవీ దినోత్సవానికి” జరుపుకోవాలని ఓటు వేసింది ప్రైవేటు మరియు ప్రభుత్వం, వివిధ సంస్థలు, ఈ రోజున కలిసి అడవుల గురించి మాత్రమే కాకుండా, అటవీ ప్రాంతాల వెలుపల ఉన్న చెట్లు మరియు వృక్షసంపద గురించి వాటి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాయి. ఈ రోజు మాత్రమే కాకుండా భవిష్యత్ తరాలందరికీ కూడా గ్రీన్ కవర్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలిసేల చేయడం వాటి సంరక్షణ చేపట్టడం గురించి ఈ రోజు జరుపుకుంటారు
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ అటవీ దినోత్సవం గా మార్చ్ 21:
ఎవరు: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మార్చ్ 21:
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |