Daily Current Affairs in Telugu 19-03-2021
రైతు భరోసా కేంద్రం అనే కేంద్ర టీవి చానెల్ ను ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ రాష్టం :
రైతు భరోసా కేంద్రం (ఆర్బికే) నుంచి ఆర్బికే శాస్త్రవేత్తలతో సంభాషించేల వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్ర టీవి చానల్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆయన ప్రారంబించారు. అర్బికే విత్తనాలు ఎరువులు మరియు పురుగుల మందు కొనుగోలు చేసే రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కల్తీ అనేది రైతుల దగ్గరకు రాకూడదు అని తెలిపారు.దానికి సంబంధించిన సమాచారం అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం .
క్విక్ రివ్యు :
ఏమిటి ; రైతు భరోసా కేంద్రం అనే కేంద్ర టీవి చానెల్ ను ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ రాష్టం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి
ఎక్కడ; ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: మార్చ్ 19
అంతర్జాతీయ సౌర కూటమిలో సబ్యదేశంగా చేరిన ఇటలి :
ఇటలి దేశం అంతర్జాతీయ సౌర కూటమి లో సబ్యదేశంగా చేరింది. భారత్ తో ప్రేమ్ వర్క్ ఒప్పందం కుదుర్చుకుంది. 2021 మార్చి 17న ఇటలీ దేశం భారత్ తో అంతర్జాతీయ సౌర కూటమి యొక్క ప్రేం వర్క్ ఒప్పందం పై సంతకం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు. ముసాయిదా ఒప్పందం పై ఇటలి రాయబారి విన్సేన్జో డి లూకా సంతకం చేసారు. అదనపు కార్యదర్శి (ఇ.ఆర్) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా ప్రేం వర్క్ ఒప్పందం పైన సంతకం చేసిన కాఫిలను అందుకున్నారు. కాగా ఈ ఐ.ఎస్.ఏ అనేది భారత దేశం ప్రారంబించిన 120 దేశాల పైగా కూటమి గా ఉన్నది.
క్విక్ రివ్యు :
ఏమిటి ; అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన దేశంగా ఇటలి
ఎవరు: ఇటలి
ఎప్పుడు: మార్చ్ 19
మొబైల్ యాప్స్ వాడకంలో మొదటి స్థానం లో నిలిచిన భారత్
మొబైల్ యాప్ లను వాడుకలో భారత దేశం ప్రపంచంలోనే మొదటి స్థానం లో నిలిచిందని కాగా వివిధ యాప్ లను రూపొందించడం లో కూడా భారతీయ ఆవిష్కర్త లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భారత ఐటి శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గారు మార్చి 18న రాజ్యసభ లో తెలియ జేశారు. ఈయన క్వశ్చన్ అవర్ లో వాటి అనుబంద సంస్థలకు సమాదానం ఇస్తూ డిజిటల్ ఇండియా ప్రోగాం తో పాటు యాప్ లను రూపొందించడానికి భారత ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తో ఆలస్యంగా అయిన పెద్ద ఎత్తున వాటి యొక్క అవసరం గా మారిందని తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; మొబైల్ యాప్స్ వాడకం మొదటి స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ ; భారత్
ఎప్పుడు: మార్చ్ 19
టాంజానియా దేశంలోనే అద్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళా :
టాంజానియా దేశ చరిత్రలో మొదటి సారిగా ఒక మహిళా అద్యక్ష పదవిని చేపట్టారు.ఆ దేశ అతి పెద్ద నగరం డార్ ఎస్ సలాం లో మార్చి 19న పదవి బాద్యతలు స్వీకరించడం ద్వారా సమియా సులుహు హసన్ (61) ఈ ఘనత సాధించారు. హిజాబ్ (ముఖానికి ముసుగు) కట్టుకుని కుడి చేతిలో ఖురాన్ ను పట్టుకొని చీఫ్ జస్టిస్ ఇబ్రహీం జుమావింగ్ సమక్షంలో దేశ రాజ్యాంగం పై సులుహు హసన్ ప్రమాణం చేసారు. అనంతరం మిలిటరీ కవాతును పరిశీలించారు. టాంజానియా మాజీ అద్యక్షులు అలీ హసన్ మ్విని జకాయ్ కిక్వేటే ,అబిద్ కరుమే కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అయ్యారు. కరోనా నియమ నిబందనల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. అద్యక్షుడు జాన్ మగుపులి ఆకస్మిక మరణంతో ఆమె ఈ బాద్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి ; టాంజానియా దేశంలోనే అద్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళా
ఎవరు: సమియా సులుహు హసన్
ఎక్కడ; టాంజానియా
ఎప్పుడు: మార్చ్ 19
ప్రపంచంలోనే అత్యధిక సంతోష కర దేశంగా నిలిచిన ఫిన్లాండ్ :
కరోనా తీవ్ర బయందోలనలో ఒంటరితనాన్ని మరణ ముప్పును మోసుకొచ్చిన ప్రజల లో ఆనందం తరుగలేదు. ఎప్పటిలాగే ప్రపంచం లోనే అత్యధిక సంతోషకర దేశంగా అగ్రస్థానం లో ఫిన్లాండ్ దేశం నిలిచింది.మార్చి 19న అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కావడంతో ప్రపంచ ఆనంద నివేదిక -2021 ఐరాసా విడుదల చేసింది. భారత మాత్రం మొత్తం పరిగణలోకి తీసుకున్న 149 దేశాల జాబితాలో 139 వ స్థానంలో నిలిచింది.గత మూడు సంవత్సరాల మాదిరే ఈ సారి కూడా ఫిన్లాండ్ తన రికార్డును పదిలం చేసుకుంటుంది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా ఐస్ లాండ్ ,డెన్మార్క్ ,స్విట్జర్ లాండ్ ,నెదర్లాండ్ లు దక్కించుకున్నాయి. గత ఏడాది 18వ స్థానం లో ఉన్న అమెరికా ఈ సారి 14స్థానం లో ఎగబాకింది. 2012నుంచి ఐరాసా కు చెందిన సస్టైన బుల్ డెవలప్ మెంట్ సొల్యుషన్ నెట్ వర్క్ ఏటా ప్రపంచ ఆనంద నివేదికకు వెల్లడిస్తూ వస్తోంది. మొత్తం 149దేశాలను పరిగణలోకి తీసుకున్న కోవిద్ వ్యాప్తి కారణంగా 100 దేశాల మిగాతా దేశాల్లో ఇదివరకే చేపట్టిన గ్యాలప్ వరల్డ్ పోల్ డేటాను ఆదారం చేసుకుని వాటికీ ర్యాంకులు కేటాయించింది కాగా నావే 8 వ స్థానం ,బ్రిటన్ 18స్థానం జర్మని దేశం 7వ స్థానం ,చైనా 19స్థానం లో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి ; ప్రపంచంలోనే అత్యధిక సంతోష కర దేశంగా నిలిచిన ఫిన్లాండ్
ఎవరు: ఫిన్లాండ్ దెశం
ఎప్పుడు: మార్చ్ 19
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |