Daily Current Affairs in Telugu 18-03-2021
ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా నిలిచిన న్యుడిల్లి :
ఇటీవల స్విస్ సంస్థ, ఐక్యూఎయిర్ 2020 ప్రపంచ వాయునాణ్యత నివేదికలో ఇటీవల న్యుడిల్లి వరుసగా మూడవ సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా న్యుడిల్లి ప్రపంచంలో 10వ అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నగరం చైనాలోని జిన్జియాంగ్ ఉండగా. దీని తరువాత ప్రపంచంలో అత్యధికంగా కలుషితమైన నగరాలలో తొమ్మిది భారతీయ నగరాలె ఉన్నాయి. అవి ఘజియాబాద్, బులంద్‌షహర్, బిస్రఖ్ జలాల్‌పూర్,నోయిడా,గ్రేటర్ నోయిడా,కాన్పూర్, లక్నో మరియు భీవారీ ఐక్యూఎయిర్ 2020 నివేదిక PM 2.5 అని పిలువబడే ఊపిరితిత్తులు దెబ్బతినే గాలిలో కణాల సంఖ్య ఆధారంగా గాలి నాణ్యత స్థాయిలను కొలువడం ద్వారా వీటిని ప్రకటించారు. దీనిని భూమి ఆధారిత పర్యవేక్షణ కేంద్రాలు కొలుస్తాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా నిలిచిన న్యుడిల్లి
ఎవరు: న్యుడిల్లి
ఎప్పుడు: మార్చి 18
స్టాఫ్ టీబీ పార్టనర్ షిప్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన భారత మంత్రి డా.హర్షవర్దన్ :
ప్రపంచ వ్యాప్తంగా క్షయ నిర్మూలనకు కృషి చేస్తున్న స్టాఫ్ టీబీ పార్టనర్ షిప్ బోర్డు చైర్మన్ గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన హర్షవర్దన్ గారు ఎన్నికయ్యారు. కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రపంచ సంస్థకు హర్షవర్దన్ 2021జులై నుంచి చైర్మన్ గా వ్యవహరించారు. మూడేళ్ళ పాటు ఆపదవిలో కొనసాగుతారని బోర్డు ఆఫ్ టీబీ పార్టనర్ సిప్ తెలిపింది. క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా విస్తృతంగా ప్రజల్లో అవగాహన కలిపించడం వ్యాధి నిర్మూలనకు అవసరం అయిన వైద్య సామాజిక నైపుణ్యాన్ని బోర్డు టీబీ పార్టనర్ షిప్ బోర్డు అందిస్తుంది. భారత్ లో 2025 నాటికీ క్షయ వ్యాధిని తరిమికొట్టాలని భారత ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: స్టాఫ్ టీబీ పార్టనర్ షిప్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన భారత మంత్రి డా.హర్షవర్దన్
ఎవరు: భారత మంత్రి డా.హర్షవర్దన్
ఎక్కడ : న్యుడిల్లి
ఎప్పుడు: మార్చి 18
టాంజానియా దేశ అద్యక్షుడు మగుపులి మృతి :
కోవిద్-19 అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకోనందుకు అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టాంజానియా అద్యక్షుడు జాన్ మగుపులి మృతి చెందాడు. ఆయన వయసు 61 సంవత్సరాలు గుండె పోటు తో అద్యక్షుడు మరణించినట్లు ఉపాధ్యక్షుడు సామియా సులుహు మార్చి 18న తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత మూడు వారాలుగా ఈ ఆఫ్రికా దేశాదినేత ప్రజలకు కనిపించలేదు .ఆ సమయంలో ఆయన ఆరోగ్యం పై పుకార్లు వచ్చాయి. టాంజానియా కి చెందిన రెండో సారి అద్యక్షుడు అయిన మగుపులి ఎన్నడు కరోనా ను తీవ్రంగా తీసుకోలేదు.
క్విక్ రివ్యు :
ఏమిటి: టాంజానియా దేశ అద్యక్షుడు మగుపులి మృతి
ఎవరు: మగుపులి
ఎక్కడ : టాంజానియా
ఎప్పుడు: మార్చి 18
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మౌదుద్ అహ్మద్ కన్నుమూత :
బంగ్లాదేశ్ ప్రభుత్వంలో స్వల్ప కాలానికి వివిధ రాజకీయ కార్యాలయాలు నిర్వహించిన న్యాయవాది మౌదుద్ అహ్మద్ కన్నుమూశారు. అతను బంగ్లాదేశ్ ప్రధానమంత్రి (1988-1989), బంగ్లాదేశ్ దేశ ఉపాధ్యక్షుడు (1989-1990),ఉప ప్రధానమంత్రి (1976-1978 మరియు 1987-1988), మరియు న్యాయ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా (2001– 2006) అతను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) స్టాండింగ్ కమిటీ సభ్యుడు కూడ ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మౌదుద్ అహ్మద్ కన్నుమూత
ఎవరు: మౌదుద్ అహ్మద్
ఎక్కడ; బంగ్లాదేశ్
ఎప్పుడు: మార్చి 18
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |