Daily Current Affairs in Telugu 17-03-2021
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఉన్న పి.కె సిన్హా రాజీనామా :
మాజీ క్యాబినెట్ కార్యదర్శి మరియు ప్రధాన మంత్రి కార్యాలయంలో (పిఎంఓ) ప్రధాన సలహాదారుగా ఉన్న పి.కె. సిన్హా వ్యక్తిగత కారణాలతో తన పదవినకి రాజీనామా చేశాడు.. అతను పిఎంఓలో మొదట ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) గా నియమించబడ్డాడు. తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల తరువాత 2019 సెప్టెంబర్‌లో ఆయన కోసం ప్రత్యేకంగా సృష్టించిన స్థానం ప్రిన్సిపాల్ అడ్వైజర్‌గా నియమించబడ్డాడు.ఆయనతో పాటు ఇద్దరు సీనియర్ అధికారులు పిఎంఓలో సలహాదారులుగా పనిచేస్తున్నారు. భాస్కర్ ఖుల్బే మరియు అమర్జిత్ సిన్హా ఇద్దరూ 1983 బ్యాచ్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు.కాగా మిస్టర్ సిన్హా ఉత్తర ప్రదేశ్ కేడర్ యొక్క 1977 బ్యాచ్ ఐఎఎస్ అధికారి మరియు యుపిఎ మరియు ఎన్డిఎ పాలనలలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. గత లోక్ సభ ఎన్నికల తరువాత పి.ఎంయొక్క ప్రధాన కార్యదర్శి నృపేంద్రమిశ్రా రాజీనామా చేసిన తరువాత పి.ఎం.ఓ నుండి నిష్క్రమించిన రెండవ వ్యక్తి ఆయనే. అంతకుముందు ఆయన ఇంతకుముందు భారత ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు మరియు 2015 నుండి నాలుగు సంవత్సరాలు క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ గా ఉన్న పి.కె సిన్హా రాజీనామా
ఎవరు: పి.కె సిన్హా
ఎక్కడ:న్యుడిల్లి
ఎప్పుడు: మార్చి 17
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎం.సీతారామ మూర్తి ఎంపిక :
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ హెచ్ ఆర్సి చైర్మన్ గా విశ్రాంత న్యాయ మూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఎంపిక అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం జగన్ అద్యక్షతన మార్చి 17న సచివాలయంలో ఎంపిక కమిటీ సమావేశం జరిగింది. కమిషన్ సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండె సుబ్రహ్మణ్యం జ్యుడిషియల్,న్యాయవాది జి.శ్రీనివాస్ రావు (నాన్ జ్యుడిషియల్)ఎంపిక అయ్యారు. వారి నియామక ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి వెళ్ళాక గవర్నర్ ఉత్తర్వులు జారీ చేస్తారు. హెచ్ ఆర్సి చైర్మన్ సబ్యుల కోసం ఎంపిక కోసం నిర్వహించిన సమవేశం కొద్దిసేపటి లోనే ముగిసింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఎం.సీతారామ మూర్తి ఎంపిక
ఎవరు: ఎం.సీతారామ మూర్తి
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు: మార్చి 17
ఐ.సి.సి అంతర్జాతీయ క్రికెట్ వన్డే ర్యాంకింగ్ లో మొదటి స్థానం లో నిలిచిన లిజేల్ లీ :
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజేల్ లీ టాప్ ర్యాంకును అందుకుంది. భారత్ లో జరుగుతున్న సిరీస్ లో లిజేల్ లీ (83నాటౌట్,132నాటౌట్ గా నిలిచి అద్బుత ప్రదర్శన చేసింది.దాంతో ఆమె ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా అగ్రస్తానం లోకి ఎగబాకింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ గా ఆమె గుర్తింపు పొందింది. టాప్ ర్యాంకులో ఉన్న బ్యుమేంట్ (ఇంగ్లాండ్) రెండో స్థానంలోకి పడిపోయింది. భారత్ నుంచి స్మృతి మందాన ఏడవ స్థానంలో మిథాలి రాజ్ తొమ్మిదో స్థానం లో ఉన్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐ.సి.సి అంతర్జాతీయ క్రికెట్ వన్డే ర్యాంకింగ్ లో మొదటి స్థానం లో నిలిచిన లిజేల్ లీ
ఎవరు: లిజేల్ లీ
ఎక్కడ:దక్షిణాఫ్రికా
ఎప్పుడు: మార్చి 17
ప్రముఖ కథాకళి నృత్య కళాకారుడు గురు చమంచేరి కున్హిరామన్ నాయర్ కన్నుమూత :
ప్రముఖ కథాకళి నృత్య కళాకారుడు ఐన గురుచమంచేరి కున్హి రామన్ నాయర్ గారు మార్చి 16న కన్నుమూసారు. ఆయన వయసు105 సంవత్సరాలు. కథాకళి నృత్య రూపానికి ఆయన చేసిన కృషికి గాను 2017సంవత్సరం లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ పురస్కారం ను అందించింది. 1979లో కేరళా సంగీత నాటక అవార్డు 2001లో కేరళా కల మండల అవార్డు 2009 లో కళా రత్న అవార్డు, మాయిల్ పిలీ అవార్డు మరియు సంగీత నాటక అకాడమి, టాగూర్ అవార్డు వంటి అనేక ఇతర అవార్డులు కూడా ఈయన అందుకున్నారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రముఖ కథాకళి నృత్య కళాకారుడు గురు చమంచేరి కున్హి రామన్ నాయర్ కన్నుమూత
ఎవరు: గురు చమంచేరి కున్హి రామన్
ఎక్కడ: కేరళ
ఎప్పుడు: మార్చి 17
పురుషుల కౌంటీ క్రికెట్ జట్టు కు కోచ్ గా ఎంపిక అయిన మహిళా మాజీ క్రికెటర్ సారా టేలర్ :
ఇంగ్లాండ్ మహిళల జట్టు మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ కు ఒక అరుదైన అవకాశం దక్కింది. ఇంగ్లాండ్ దేశ వాలి చాంపియన్ షిప్ కౌంటీ క్రికెట్ లోని సనేక్స్ పురుషుల జట్టుకు ఆమె వికెట్ కీపింగ్ కోచ్ గా ఎంపిక అయింది. 31ఏళ్ల సారా టేలర్ ఇంగ్లాండ్ తరపున మూడు ఫార్మాట్లలో కలిపి (10టెస్టులు ,126వన్డేలు ,90టి 20 మ్యాచ్ లు)మొత్తం 6,533 పరుగులు సాదించింది. మహిళల కెరీర్ లో అత్యంత విజయ వంతమైన వికెట్ కీపర్ గా (128క్యాచ్ లు 104 స్టంపింగ్ లు చేసి గుర్తింపు పొందింది.
క్విక్ రివ్యు:
ఏమిటి: పురుషుల కౌంటీ క్రికెట్ జట్టు కు కోచ్ గా ఎంపిక అయిన మహిళా మాజీ క్రికెటర్ సారా టేలర్
ఎవరు: సారా టేలర్
ఎక్కడ: ఇంగ్లాండ్
ఎప్పుడు: మార్చి 17
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |