Daily Current Affairs in Telugu 16-03-2021
ఎన్.ఎస్ జి అధిపతిగా ఎం.ఏ గణపతి నియామకం :
జాతీయ బద్రత దళం (ఎన్.ఎస్.జి) అధిపతిగా సీనియర్ ఐపీస్ అధికారి ఐన ఎం.ఏ గణపతి గారు నియమితులు కాగా సి ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ గా కుల్దీప్ సింగ్ గారు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి 16న ఉత్తర్వులు జారీ చేసింది. గణపతి ప్రస్తుతం పౌర విమాన యాన భద్రత బ్యూరో బిసిఏఎస్ కు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. 1986 బ్యాచ్ కు చెందిన కుల్డీప్ సింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారి .
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎన్.ఎస్ జి అధిపతిగా ఎం.ఏ గణపతి నియామకం
ఎవరు: ఎం.ఏ గణపతి
ఎక్కడ: న్యుడిల్లి
ఎప్పుడు : మార్చి 16
ఇద్దరు యుఎఈ క్రికెటర్ లపై ఎనిమిదేళ్ళ నిషేధం విధించిన ఐ.సి.సి :
టి20 ప్రపంచ కప్ క్వాలిఫైర్స్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పదుటకు ప్రయత్నించిన యుఎఈ ఆటగాళ్ళు మహమ్మద్ నవీద్ ,ఫైమన్ అన్వర్ లపై ఐసిసి ఎనిమిదేళ్ళ నిషేధం విధించింది. 2019 అక్టోబర్ 16 నుంచి నిషేధం అమలవుతుంది. పేస్ బౌలర్ నవీద్ 39వన్డేలు,31టి20 మ్యాచ్ లు ఆడాడు. యుఎఈ జట్టుకు సారద్యం వహించాడు కూడా. 42ఏళ్ల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ బట్ 40వన్డేలు ,31టి20లు ఆడాడు.2019 లో టి20 ప్రపంచ కప్ క్వాలిఫైర్ సందర్బంగా ఈ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించి నట్లు ఋజువు అయిందని ఐ.సి.సి తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇద్దరు యుఎ ఈ క్రికెటర్ లపై ఎనిమిదేళ్ళ నిషేధం విధించిన ఐ.సి.సి
ఎవరు: మహమ్మద్ నవీద్ ,ఫైమన్ అన్వర్
ఎప్పుడు : మార్చి 16
ఫెడెరేషన్ కప్ అట్లేటిక్స్ లో స్వర్ణం గెలుచుకున్న ధన లక్ష్మి :
ఫెడెరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో ధన లక్ష్మి విజేతగా నిలిచింది. ఈ రేసులో జాతీయ రికార్డు సృస్టించిన ద్యుతి చంద్ ను ఓడించి ఆమె స్వర్ణం గెలుచుకుంది. తమిళనాడు కు చెందిన 22ఏళ్ల ధన లక్ష్మి 11.39 సెకన్ల లో లక్ష్యాన్ని చేరుకోగా ద్యుతి (ఓడిశా) 11.58 సెకన్ల లో రెండో స్థానం లో నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుది .మరో తమిళనాడు అథ్లెట్ అర్చన సుశీల రెడ్డి (11.76సె) తో కాంస్యం సాదించింది. ఫాల్స్ స్టార్ట్ కారణంగా హిమ దాస్ అనర్హత కు గురైంది. 100మీ పరుగులో ఒలింపిక్ అర్హత ప్రమాణం 11.15 సెకన్లు కాగా అథ్లెట్లు దానికి చేరువగా కూడా వెళ్ళలేదు .పురుషుల 100 మీటర్ల పరుగులో పంజాబ్ కు చెందిన బర్వీందర్ సింగ్ (10.92సె )స్వర్ణం గెలుచుకున్నారు.తమిళనాడు రన్నర్అయిన ఎలక్కి యాదాసన్ కన్నద (10.43)రజతం ,మహారాష్ట్ర అథ్లెట్ సతీష్ కృష్ణకుమార్ (10.56సె) కాంస్యం గెలుచుకున్నారు .కాగా దీనిలో పురుషుల విభాగం లో ఒలింపిక్ అర్హత ప్రమాణం 10.15 సెకన్లుగా ఉంది.మరియు మహిళల 400మీటర్ల పరుగులో వెటరన్ అథ్లెట్ పూవమ్మ స్వర్ణం సాధించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫెడెరేషన్ కప్ అట్లేటిక్స్ లో స్వర్ణం గెలుచుకున్న ధన లక్ష్మి
ఎవరు: ధన లక్ష్మి
ఎప్పుడు : మార్చి 16
ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త దీపక్ మిశ్రా ICRIER డైరెక్టర్‌గా నియమకం :
ప్రపంచ బ్యాంకు యొక్క స్థూల ఆర్థిక, వాణిజ్యం మరియు పెట్టుబడి గ్లోబల్ ప్రాక్టీస్‌లో ప్రాక్టీస్ మేనేజర్ ఐన దీపక్ మిశ్రా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) యొక్క తదుపరి డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులయ్యారు. అయన సెప్టెంబర్ 1, 2012 నుండి ICRIER డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన రజత్ కతురియా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రపంచ అభివృద్ధి నివేదిక 2016 (డిజిటల్ డివిడెండ్) యొక్క కో-డైరెక్టర్, ఇథియోపియా,పాకిస్తాన్, సుడాన్ మరియు వియత్నాం దేశ ఆర్థికవేత్తలతో సహా మిశ్రా ప్రపంచ బ్యాంకులో వివిధ పదవులను నిర్వహించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త దీపక్ మిశ్రా ICRIER డైరెక్టర్‌గా నియమకం
ఎవరు: దీపక్ మిశ్రా
ఎప్పుడు : మార్చి 16
అమెరికా జపాన్ ఆస్ట్రేలియాలతో ఇస్రో అ౦తరిక్ష బందానికి బలోపేతం కోసం ఒప్పందం :
చైనా దూకుడు కళ్ళెం వేయడానికి ఏర్పడ్డ చతుర్భుజ కూటమిగా బలోపేతం అవుతుంది .రోదసి రంగంలో ఈ మైత్రి విస్తరిస్తుంది. ఈ దిశగా కూటమి లోని ఇతర దేశాలైన అమెరికా జపాన్ ఆస్ట్రేలియా తో అంతరిక్ష బంధాన్ని భారత్ పటిష్టం చేసుకొంటోంది.చతుర్భుజ కూటమి శికరగ్ర సదస్సు గత వారం జరిగింది. వాతావరణ మార్పులు కీలక సరికొత్త పరిజ్ఞానాలు భవిష్యత్ సాంకేతికను సంయుక్తంగా అబివృద్ది చేయడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలనీ కూటమి దేశాలు నిర్ణయించాయి. అంతరిక్ష రంగం లోను నాలుగు దేశాలు ఉమ్మడిగా సాగేందుకు అడుగులు వేస్తున్నాయి .అమెరికా సంయుక్తంగా అబివృద్ది చేస్తున్న నిసార్ ఉపగ్రహం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ఒక ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చార్ రాడార్ ను ఇటీవల రూపొందించింది. దీన్ని వచ్చే ఏడాది శ్రీహరి కోట నుంచి ప్రారంబించనున్నారు. చంద్రుడి పైకి భారత్ పంపే చంద్రయాన్ 3లో నాసా కు చెందిన లేజర్ రిఫ్లేక్తో మీటర్ ఆరే ఎల్.ఆర్.ఏ) ను అమర్చేందుకు రెండు దేశాలు కసరత్తు చేసాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లతో ఇస్రో అ౦తరిక్ష బందానికి బలోపేతం కోసం ఒప్పందం
ఎవరు: అమెరికా జపాన్ ఆస్ట్రేలియా లతో
ఎప్పుడు : మార్చి 16
జాతీయ టీకా దినోత్సవం గా మార్చి 16:
రోగ నిరోదకతకు అందించే గల టీకా సుదీర్గ చరిత్ర ఉంది . కాగా ప్రతి సంవత్సరం మార్చి 16 తేదిన జాతీయ టీకా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ టీకాల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, పోలియో, మశూచి,కరోన వంటి వ్యాధులకు వ్యతిరేకంగా ఆయుధాలు వేయడం మరియు ప్రపంచం నుండి పూర్తిగా నిర్మూలించడం గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడం.మొదటగా ఆంగ్ల వైద్యుడు అయిన ఎడ్వర్డ్ జెన్నర్ 1796 లో మశూచికి రోగనిరోదక శక్తి ని సృష్టించడానికి కౌపాక్స్ అనే పదార్థం ఉపయోగించి మొదటి వ్యాక్సిన్ కనుగొన్న ఘనత పొందారు.ఆ తరువాత వ్యాక్సిన్ పితామహుడుగా పిలవ బడే లుయి పాశ్చర్ 1885 లో రేబిస్ వ్యాక్సిన్ కనుగొన్నారు. ఆరోజును గుర్తు చేసుకుంటూ ఈ రోజును జరుపుకుంటారు. కాగా 2020 లో తలెత్తిన కోవిద్ -19 వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయం లో వ్యాక్సిన్ యొక్క అవసరం ఏర్పడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ టీకా దినోత్సవం గా మార్చి 16
ఎక్కడ:దేశ వ్యాప్తంగా
ఎప్పుడు : మార్చి 16
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |