Daily Current Affairs in Telugu 14-03-2021
టీ-20 ఇంటర్ నేషనల్ క్రికెట్ లో 3000పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ:
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టి -20 ఇంటర్నేషనల్ క్రికెట్ లో 3,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్ టీమ్ తో జరిగిన రెండో టీ 20-అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు కెప్టెన్ కేవలం 72 పరుగులతో వెనుకబడి ఉన్నాడు మ్యాచ్ తరువాత 73 పరుగులు చేసి అజేయంగా అతను 3,000 పరుగుల మార్కును అధిగమించాడు. ఇప్పుడు 87 టి 20 ఐ మ్యాచ్‌ల్లో 3,001 పరుగులు చేశాడు. 99 మ్యాచ్‌ల్లో 2,839 పరుగులు చేసిన టి 20 ఐ క్రికెట్‌లో ప్రముఖ పరుగులు సాధించిన వారి జాబితాలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కు చెందిన మార్టిన్ గుప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు. 108 మ్యాచ్‌ల్లో 2,773 పరుగులతో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: టీ-20 ఇంటర్ నేషనల్ క్రికెట్ లో 3000పరుగులు చేసిన తొలి బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ
ఎవరు: విరాట్ కోహ్లీ
ఎప్పుడు: మార్చి 15
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యదిక గోల్స్ చేసిన ప్లేయర్ గా క్రిస్టియానో రోనాల్డో:
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యదిక గోల్స్ చేసిన ప్లేయర్ గా క్రిస్టియానో రోనాల్డో రికార్డు సృష్టించారు. ఇటలీ ప్రొఫెషనలింగ్ లీగ్ లో సెరియేలో భాగంగా క్యాలియరీ క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో యువెంటస్ క్లబ్ కు ప్రాతినిత్యం వహిస్తున్న 36 ఏళ్ళ రోనాల్డో హ్యాట్రిక్ సాధించడం తో ఆ జట్టు 3-1తో గెలిచింది. ఈ మూడు గోల్స్ తో అధికారికంగా గుర్తింపు పొందిన మ్యాచ్ లలో రోనాల్డో చేసిన గోల్స్ సంఖ్య 770 చేరింది. దాంతో 675 గోల్స్ తో బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట ఉన్న టైటిల్ రికార్డ్ కనుమరుగైనది. రోనాల్డో తన జట్టు తరపున 120 గోల్స్ చేయగా ప్రొఫెషనల్ క్లబ్ జట్టు తరపున 667 గోల్స్ చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో అత్యదిక గోల్స్ చేసిన ప్లేయర్ గా క్రిస్టియానో రోనాల్డో
ఎవరు: క్రిస్టియానో రోనాల్డో
ఎప్పుడు: మార్చి 15
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ లో అన్ను రాణి జాతీయ రికార్డు :
ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ లో ఉత్తరప్రదేశ్ కు చెందిన జావెలిన్ త్రోయర్ అన్ను రాణి కొత్త జాతీయ రికార్డు ను సృష్టించింది. జావెలిన్ ను అన్ను రాణి 63.24 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. ఈ క్రమము లో 64.43 .మీటర్ల దూరం విసిరి తన పేరిట ఉన్న రికార్డును తిరిగి ఆమె సవరించింది. అయితే టోక్యో ఒలింపిక్స్ అర్హత ప్రమాణం ను 64 మీటర్ల కు అందుకోలేక పోయింది. మహిళల 10,000మీటర్ల రేసులో సవిత (ఉత్తర్ ప్రదేశ్ కు చెందినది 33ని.59.35 సెకన్లు) స్వర్ణం సాధించింది. మహిళల 100 జాబితాలో విభాగంలోద్యుతి చంద్ (ఒడిశా) హిమా దాస్ ఫైనల్ కు చేరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ టోర్నీ లో అన్ను రాణి జాతీయ రికార్డు
ఎవరు: అన్ను రాణి
ఎప్పుడు: మార్చి 15
అత్యదిక గ్రామీ అవార్డులను దక్కించుకున్న ప్రముఖ గాయని బియాన్స్:
ఇప్పటి వరకు సాధారణంగా గ్రామీ అవార్డులలో పురుష గాయకుల అధిపత్యమే కనిపిస్తుంది. కానీ ఈ సారి మాత్రం గాయనిమనుల అవార్డుల గెలుచుకోవడం లో సత్తా చాటారు. 63 వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లో అమెరికా లోని లాస్ ఏంజిలెస్ కన్వెన్షన్ సెంటర్ లో కోవిడ్ 19 ప్రోటీకాల్ ను పాటిస్తూ కన్నుల పండువగా జరిగింది.మెగాన్ థీ స్టాలియన్,హ్యారీ స్టైల్స్ మొదటి సారిగా ఈ గ్రామీ అవార్డు ను అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ వీడియో అవార్డు తో సహా నాలుగు గ్రామీ అవార్డులను ప్రముఖ గాయని బియాన్స్ సొంతం చేసుకున్నారు. దీనితో ఇప్పటి వరకు ఆమె ఖాతాలో 28 గ్రామీ పురస్కారాలు చేరాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి: అత్యదిక గ్రామీ అవార్డులను దక్కించుకున్న ప్రముఖ గాయని బియాన్స్
ఎవరు: బియాన్స్
ఎప్పుడు: మార్చి 15
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15 :
ప్రతి సంవత్సరం మార్చి 15 ను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంను అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ స్ఫూర్తితో 1962 మార్చి 15 న యుఎస్ కాంగ్రెస్‌కు ప్రత్యేక సందేశం ఇచ్చారు. దీనిలో వినియోగదారుల హక్కుల సమస్యను అధికారికంగా పరిష్కరించారు. అలా చేసిన మొదటి ప్రపంచ నాయకుడు జాన్ ఎఫ్ కెన్నెడీ నిలిచారు. వినియోగదారుల ఉద్యమం మొదట 1983 లో ఈతేదీని గుర్తించింది మరియు ఇప్పుడు ప్రతి సంవత్సరం ముఖ్యమైన సమస్యలు మరియు ప్రచారాలపై చర్యలను సమీకరించటానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం అనేది అంతర్జాతీయ వినియోగదారుల ఉద్యమంలో వేడుకలు మరియు సంఘీభావాన్ని సూచించే వార్షిక అంతర్జాతీయ కార్యక్రమం, వినియోగదారుల హక్కులను గౌరవించాలని మరియు పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మార్కెట్ దుర్వినియోగం మరియు ఆ హక్కులను బలహీనం చేసే సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే అవకాశాన్ని ఇస్తుంది
క్విక్ రివ్యూ :
ఏమిటి: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా మార్చ్ 15 :
ఎక్కడ: ప్రపంచ వ్యాప్తంగా
ఎప్పుడు: మార్చి 15
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |