Daily Current Affairs in Telugu 13&14-03-2021
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ క్రీడాకారిణి భవాని దేవి :
తమిళనాడు ఫెన్సర్ భవాని దేవి టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్ కు వెళ్ళబోతున్న తొలి భారత ఫెన్సర్ గా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. వ్యక్తిగత సాబ్రే విభాగంలో ర్యాంకింగ్ ద్వారా భావాని టోక్యో ఒలింపిక్స్ బెర్తు సొంతం చేసుకుంది. ఆసియా ఒసినియానియ విభాగం లో రెండు ఒలింపిక్స్ బెర్తులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 45 ర్యాంకులో ఉన్న భవాని వాటిలో ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా హంగేరిలో జరుగుతున్న ప్రపంచ కప్ లో రాణించడం ద్వారా ఆమె ర్యాంకింగ్ ను మెరుగు పరుచుకుంది. టోక్యో బెర్తు సాధించిన భవాని ని క్రీడల మంత్రి కిరెన్ రిజుజు అబినంధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్ క్రీడాకారిణి భవాని దేవి
ఎవరు : భవాని దేవి
ఎప్పుడు : మార్చి 13
ఆర్సిల్ కంపెని యొక్క ఎండి &సియివో గాపల్లవ్ మోహపాత్రా నియామకం :
పల్లవ్ మోహపాత్రాను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్ (ఆర్సిల్) ఇటీవల ప్రకటించింది. నియామకానికి ముందు, మోహపాత్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క MD మరియు CEO గా ఉన్నారు. ఇంతకుముందు ఈయన MD మరియు CEO గా ఎదగడానికి ముందు, అతను డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ గ్రూప్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పని చేసారు. .వినాయక్ బహుగుణ జూన్ 2020 వరకు ఐదేళ్లపాటు ఆర్సిల్‌కు ఎండి మరియు సిఇఒగా నాయకత్వం వహించారు. 2002 లో స్థాపించబడిన ఆర్సిల్, ప్రస్తుతం అండర్ 12,000 కోట్ల నిర్వహణలో (నిరర్ధక రుణాలలో) ఆస్తులను కలిగి ఉంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఆర్సిల్ కంపెని యొక్క ఎండి &సియివో గాపల్లవ్ మోహపాత్రా నియామకం
ఎవరు : పల్లవ్ మోహపాత్రా
ఎప్పుడు : మార్చి 13
యంగ్ గ్లోబల్ లీడర్స్ 2021 జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాది శ్రీకాంత్ బొల్లా :
యంగ్ గ్లోబల్ లీడర్స్ (వై.జి.ఎల్) లో 2021 సంవత్సరానికి గాను హైదరాబాద్ కు చెందిన బోలంట్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ సియివో శ్రీకాంత్ బొల్లా గారు ఎంపిక అయ్యారు. మసాచు సెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బ్రెయిన్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ అండ్ బిజినెస్ లో తొలి అంతర్జాతీయ అంద విద్యార్థి అయిన శ్రీకాంత్ 2012లో హైదరాబాద్ కేంద్రంగా పర్యావరణ హితమైన ప్యాకేజింగ్ కంపని బోలంట్ ఇండస్ట్రీస్ ను ప్రారంబించారు. ఇందులో పని చేసేవారంతా ఏదో ఒక వైకల్యం కలిగి ఉన్న వారు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నంలో జన్మించిన ఈయన శ్రీకాంత్ బొల్లా హైదరబాద్ లోని దేవ్ నార్ బ్లైండ్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసారు. మన దేశంలో ఇంటర్మిడియాట్ లో సైన్స్ స్ట్రీం అద్యయనం చేసిన తొలి విద్యార్ధి కూడా ఈయనే కాగా ఇదే జాబితాలో బెంగళూర్ కేంద్రంగా పిల్లల మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు చేపట్టే “లైవ్ లవ్ లాఫ్” ఫౌండేషన్ ఫౌండర్ బాలివుడ్ కు చెందిన ప్రముఖ నటి దిపిక్ పదుకొనే కూడా ఇందులో ఎంపిక అయ్యారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : యంగ్ గ్లోబల్ లీడర్స్ 2021 జాబితాలో చోటు దక్కించుకున్న హైదరాబాది శ్రీకాంత్ బొల్లా
ఎవరు : శ్రీకాంత్ బొల్లా
ఎప్పుడు : మార్చి 13
వర్చువల్ విధానంలో జరిగిన క్వాడ్ దేశాల అగ్రనేతల తొలి బేటీ :
చైనా దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్ళపై చతుర్భుజ కూటమి క్వాడ్ దేశాల అగ్రనేతలు తమ తొలి బేటీ లో చర్చించాలని అమెరికా జాతీయ బద్రత సలహాదారు జెక్ సలివన్ తెలిపారు. చైనా ఘర్షణాత్మక వైఖరిని వీడుతున్న అన్న బ్రమలు తమకు లేవని నాలుగు దేశాల నేతలు విస్పష్టంగా చేసారు. క్వాడ్ కోటమి అగ్రనేతల తొలి వర్చువల్ సమావేశం మార్చి 13న జరిగింది. అమెరికా దేశ అద్యక్షుడు బైడెన్ మూడు దేశాల ప్రదానులు నరేంద్ర మోడి (భారత్) స్కాట్ మొరిసన్ (ఆస్ట్రేలియా) యేషిహిదెసుగా (జపాన్) పాల్గొన్న ఆ చారిత్రాత్మక బేటీ వివరాలను శ్వేత సౌధం లో విలేకరుల సమావేశంలో జెక్ సలివన్ వెల్లడించారు. క్వాడ్ సమావేశం సబ్య దేశాల మద్య పరస్పర సహకారం కోసమే జరగాలని తృతీయ పక్ష దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడమే కాదన్న చైనా అబ్యంతరాలను తోసిపుచ్చేలా జెక్ సలివన్ ప్రకటించారు. కాగా ప్రపంచ దేశాలను వెంటాడుతున్న కరోనా వైరస్ తుదముట్టించేల క్వాడ్ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : వర్చువల్ విధానంలో జరిగిన క్వాడ్ దేశాల అగ్రనేతల తొలి బేటీ
ఎవరు : క్వాడ్ దేశాల అగ్రనేతలు
ఎప్పుడు : మార్చి 13
పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా డామియన్ రైట్ నియామకం :
పంజాబ్ కింగ్స్ జట్టూ కొత్త బౌలింగ్ కోచ్ గా ఆస్ట్రేలియా దేశవాలి బౌలర్ డామియన్ రైట్ నియమితుడయ్యారు. ఏప్రిల్ 09న ఆరంబం కానున్న ఐపిఎల్ లో అతడు జట్టుకు సేవలు అందిస్తాడు. ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే తొ కలిసి అతడు పని చేయనున్నారు. 45ఏళ్ల డామినియన్ బంగ్లాదేశ్ అండర్-19 జట్టుకు కూడా కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. కుంబ్లే రైట్ తో పాటు అండి ప్లవర్ (సహాయక కోచ్) ,వసీం జాపర్ (బ్యాటింగ్ కోచ్) జాంటి రోడ్స్ (ఫీల్డింగ్ కోచ్ ) పంజాబ్ జట్టు సహాయక బృందం లో ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా డామియన్ రైట్ నియామకం
ఎవరు : డామియన్ రైట్
ఎప్పుడు : మార్చి 13
ఐ.ఎస్.ఎల్ టైటిల్ గెలిచి చాంపియన్ గా నిలిచిన ముంబాయ్ :
ఇటీవల జరిగిన .ఇండియన్ సూపర్ లీగ్ పుట్ బాల్ లో టైటిల్ గెలవాలన్న ముంబై జట్టు కల తీరింది. మ్యాచ్ ఆఖర్లో బిపిన్ సింగ్ మెరుపు గోల్ చేయడంతో ముంబై ట్రోఫీని ఎగురేసుకుపోయింది. మార్చి 13న జరిగిన సీజన్-7 ఫైనల్లో ఆ జట్టు 2-1 గోల్స్ తో డిఫెండింగ్ చాంపియన్ ఏటికే మోహన్ బంగాను ఓడించింది. కాగా గోవా ప్లేయర్ ఐగర్ (14గోల్స్)కు బంగారు గోల్డెన్ షూ) అరిందం బట్టచార్యకు (ఏటికే) కు గోల్డ్ గ్లవ్) అవార్డులు లబించాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐ.ఎస్ ఎల్ టైటిల్ గెలిచి చాంపియన్ గా నిలిచిన ముంబాయ్
ఎవరు : ముంబాయ్
ఎప్పుడు : మార్చి 14
ముస్లిం మహిళలు భురాఖ ధరించడం నిషేధించిన దేశం గా శ్రీలంక :
ముస్లిం మహిళలు బురకా దరించదం ను నిషేధిచే ఆలోచనల్లో ఉన్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. వేయి కి పైగా మదర్సాలను కూడా మూసివేయనున్నట్లు తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకోనున్నట్లు ప్రజా భద్రత శాఖ మంత్రి శరత్ వీర శేఖర తెలిపారు. మార్చి 13 న ఆయన విలేకరుఅలతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రతిపదనలపైన మార్చి 13 సంతకం చేసి మంత్రివర్గ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. కాగా ఇటీవల మొదటగా స్విట్జర్ ల్యాండ్ దేశం ఇదే తరహా బురఖ దరించడంను నిషేదిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ముస్లిం మహిళలు భురాఖ ధరించడం నిషేధించిన దేశం గా శ్రీలంక
ఎవరు : శ్రీలంక
ఎక్కడ: శ్రీలంక
ఎప్పుడు : మార్చి 14
బంగ్లా స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కానున్న ప్రదాని నరేంద్ర మోడి :
బంగ్లాదేశ్ 50 వ స్వాతంత్ర్యం వేడుకలను ప్రదాని మోడి హాజరు కానున్నారు. రెండు రోజుల పర్యటన కోసం అయన ఈ నెల 26న బంగ్లాదేశ్ లో అడుగు పెట్టనున్నారు. మోడి సహా నేపాల్,శ్రీలంక మాల్దీవులు,భూటాన్ దేశాదినేతలు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత సైన్యం సాయంతో పాకిస్తాన్ చెర నుంచి 1971 మార్చి 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. ఈ చిరస్మరనియ ఘట్టానికి 50 ఏళ్ళైన సందర్బంగా ఈ నెల 17న నుంచి 27వరకు దేశ వ్యాప్తంగా సంబరాలు జరపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : బంగ్లా స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కానున్న ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : బంగ్లాదేశ్
ఎక్కడ: బంగ్లాదేశ్
ఎప్పుడు : మార్చి 14
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |