Daily Current Affairs in Telugu 12-03-2021
యునియన్ బ్యాంక్ ఇండియా ఈ డి గా నియమితులయిన నితీష్ :
యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుబి ఐ ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ గా నితీష్ రంజన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు బ్యాంకు లో చీఫ్ జనరల్ మేనజర్ గా ఈయన విధులు నిర్వహించారు. పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజ్ మెంట్ ట్రెయినీ గా చేరిన నితీష్ ఆ తర్వాత ఆంద్ర బ్యాంకు లోకి మారారు. ట్రెజరీ అపరేషన్స్ చీఫ్ ఇన్వెస్టర్ రిలేషన్ ఆఫీసర్,చీఫ్ ఎకానమిస్ట్ ,రీజనల్ హెడ్ తదితర విభాగాల్లో పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: యునియన్ బ్యాంక్ ఇండియా ఈ డి గా నియమితులయిన నితీష్
ఎవరు: నితీష్ రంజన్
ఎప్పుడు : మార్చి 12
భారత కొత్త చీఫ్ స్టాటిస్టిషియన్‌గా డాక్టర్ జిపి సమంతను నియమకం :
కేంద్ర ప్రభుత్వం డాక్టర్ జి పి సమంతను కొత్త చీఫ్ స్టాటిస్టిషియన్ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) గా రెండేళ్ల కాలానికి నియమించింది. అతను భారతదేశం యొక్క నాల్గవ చీఫ్ స్టాటిస్టిషియన్‌గా. 2020 సెప్టెంబరు నుంచి ఈ పదవికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న క్షత్రపతి శివాజీని ఆయన భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం, డాక్టర్ సమంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్లో సలహాదారుగా పనిచేస్తున్నారు. డాక్టర్ సమంతా గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) కార్యదర్శిగా కూడా వ్యవహరించనున్నారు
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత కొత్త చీఫ్ స్టాటిస్టిషియన్‌గా డాక్టర్ జిపి సమంతను నియమకం
ఎవరు: జిపి సమంతను
ఎప్పుడు : మార్చి 12
STEM ను ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో IBM అవగాహన ఒప్పందం :
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లోని 130 మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో ‘బాలికల కోసం ఐబిఎం స్టెమ్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వ విద్యా మిషన్ సమగ్రా సిక్కు ఉత్తరాఖండ్‌తో కలిసి ఈ కార్యక్రమంను ప్రకటించింది. ఈ కార్యక్రమం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు మిషిని౦గ్ (STEM) రంగాలలోని 25,600 మంది విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. STEM కెరీర్‌లో బాలికలు మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచలనే అమలులో భాగంగా దాని భాగస్వామిగా అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ఐబిఎం మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూడేళ్ల కార్యక్రమంగా ఈ సహకార ఒప్పందం కుదిరింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: STEM ను ప్రవేశపెట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో IBM అవగాహన ఒప్పందం
ఎవరు: ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో IBM
ఎక్కడ: ఉత్తరాఖండ్
ఎప్పుడు : మార్చి 12
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గెలుచుకున్న ప్రసిద్ది కవి నిఖిలేశ్వర్ :
ప్రసిద్ద కవి నిఖిలేశ్వర్ కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్ని శ్వాస కవితా సంకలనం (2015-17) ఈ పురస్కారాన్ని ఎంపిక అయింది. దేశ వ్యాప్తంగా 20 భాషలలోని కవిత సంకలనాలు చిరు కథలు స్మృతి కావ్యాలు నవలను 2020 పురస్కారానికి ప్రకటించింది. నిఖిలేశ్వర్ గా ప్రసిద్దులైన కుంబం యాధవ రెడ్డి యదాద్రి భువనగిరి జిల్లా వీరవల్లి గ్రామానికి చెందిన వారు. ఆరుగురు కవులలో ఒకరిగా అయన గుర్తింపు పొందారు. విప్లవ రచయితల సంఘానికి వ్యవస్థాపక కార్యదర్శిగా కూడా పని చేసారు. ఆంగ్ల ,హింది భాషలలోను ఆయన కవితలు రాశారు. పద్యం ,గద్యం అనువాద రచయిత లలోను తనదైన ముద్ర వేశారు. గతం లోను పలు సాహిత్య అవార్డు పొందారు. సాహిత్య అకాడమి యువ పురస్కార్ కు ఎండ్లూరి మానస చిరు కథల పుస్తకం “మిలింద” ఎంపికవగా బాల సాహిత్య పురస్కారానికి కన్నెగంటి అనసూయ చిరు కథల పుస్తకం స్నేహుతులు ఎంపిక అయింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గెలుచుకున్న ప్రసిద్ది కవి నిఖిలేశ్వర్
ఎవరు: నిఖిలేశ్వర్
ఎప్పుడు : మార్చి 12
అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించిన మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ :
భారత క్రికెటర్ దిగ్గజ క్రికెట్ మిథాలి రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి భారత మహిళ గా ఆమె రికార్డు నెలకొల్పారు. మార్చి 12న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో ఆమె 10 వేల మార్కును దాటింది. ప్రస్తుతం ఆమె 10001 పరుగుల వద్ద ఉంది. మిథాలి రాజ్ మహిళల క్రికెట్ లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్. కాగ మొదట ఈ మార్కును చేరుకున్న మొదటి మహిళా బ్యాటర్ ఇంగ్లాండ్ ప్లేయర్ చార్లట్ ఎడ్వర్డ్స్ .భారత్ నుంచి మొదటి మహిళా బ్యాటర్ మిథాలి రాజ్.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన ఘనత సాధించిన మహిళా క్రికెటర్ మిథాలి రాజ్
ఎవరు: మహిళా క్రికెటర్ మిథాలి రాజ్
ఎప్పుడు : మార్చి 12
డిల్లీ లో ఏర్పాటు అయిన దేశం లోనే అతిపెద్ద కిడ్నీ హాస్పిటల్ :
దేశ రాజదాని లో డిల్లీ లో సిక్కు గురుద్వారా యజామాన్య కమిటీ అతిపెద్ద కిడ్నీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. రోజు 500 మందికి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉచిత డయలసిస్ సౌకర్య౦ అందించేలా తీర్చి దిద్దిన ఈ ఆసుపత్రిలో అడుగుపెడుతూనే కనిపించే బిల్లింగ్గ్ కౌంటర్ ఇక్కడ అస్సలు ఉండదు .20ఏళ్లకు పైగా మూతపడి ఉన్న బాలా సాహిబ్ ఆసుపత్రిని గురు హరిక్రిష్ణన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసర్చ్ పేరుతో పునరుద్దరించి దేశంలోనే అతిపెద్ద కిడ్నీ డయలసిస్ ఆసుపత్రిగా దీనిని మార్చారు. 24గంటలు రోగులకు వైద్య సేవలు అందించేలా దీన్ని సిద్దం చేసారు. ఏక కాలం లో 101 మందికి డయాలసిస్ చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: డిల్లీ లో ఏర్పాటు అయిన దేశం లోనే అతిపెద్ద కిడ్నీ హాస్పిటల్
ఎవరు: సిక్కు గురుద్వారా యజామాన్య కమిటీ
ఎక్కడ : డిల్లీ లో
ఎప్పుడు : మార్చి 12
క్యాసెట్ టేపుల సృష్టి కర్త లు ఒటేన్స్ కన్నుమూత :
స్వర మాధుర్యాన్ని రికార్డు చేసి దశాబ్దాలా తరబడి ప్రచారానికి వీనుల విందు చేసిన క్యాసెట్ టేపుల సృష్టి కర్త అయిన లు ఒటేన్స్ (96) కన్నుమూతారు .మార్చి 12 న ఆయన మృతి చెందినట్టు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ పిలిప్స్ వెల్లడించింది. నెదర్లాండ్ కు చెందిన ఆయన కంపాక్ట్ డిస్క్ (సిడి)ల తయారీ లోను కీలక భూమిక పోషించారు. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో కూడా చేరారు. ప్రోడక్ట్ డెవలప్ మెంట్ విభాగానికి అధీపతిగా పని చేసారు. 1960 తొలి నాళ్లలో ఆయన చెక్క పెట్టె తో కూడిన పెద్ద సైజు టేపును అందుబాటులోకి తెచ్చారు. 1962 లో తొలి సారిగా మార్కెట్ లోకి వచ్చిన క్యాసెట్ టేపులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత టేపుల పరిమాణాన్ని తగ్గించి చిన్న పరికరాల్లో వాటిని వినెల పలు ఆవిష్కరణలు చేసారు లుఒటేన్స్ .
క్విక్ రివ్యు :
ఏమిటి: క్యాసెట్ టేపుల సృష్టి కర్త లు ఒటేన్స్ కన్నుమూత
ఎవరు: లు ఒటేన్స్
ఎక్కడ; నెదర్లాండ్
ఎప్పుడు : మార్చి 12
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |