Daily Current Affairs in Telugu 11-03-2021
ఆజాది కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంబించనున్న ప్రదాని నరేంద్ర మోడి :
దేశ 75స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన ఆజాది కా అమృత్ మహోత్సవ్ ప్రదాని నరేంద్ర మోడి గారు మార్చి 11న శ్రీకారం చుట్టనున్నారు. అహమదా బాద్ లోని సబర్మతి ఆశ్రమం నుంచి నిర్వహించే ఈ పాదయాత్ర ను ఆయన జెండా ఊపి ప్రారంబించనున్నట్లు కేంద్ర సంస్క్రతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మార్చి 11న ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశం లో వెల్లడించారు ఇది మార్చి 12నుంచి 2022 ఆగస్టు 15వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమం చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోయిన దండి యాత్ర ప్రారంబం ఐన సందర్బాన్ని గుర్తు చేస్తూ సబర్మతి ఆశ్రమం నుంచి నవసారి లో దండి వరకు 241 మైళ్ళ దూరం పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కెనరా బ్యాంకు ఈడీ గా సత్యనారాయణ రాజు భాద్యతలు
ఎవరు: సత్యనారాయణ రాజు
ఎప్పుడు: మార్చి 11
ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పంద౦ ను కుదుర్చుకున్న తెలంగాణా :
ఆస్ట్రేలియా దేశ ప్రభుత్వ భాగస్వామ్యం తో తెలంగాణ రాష్ట్ర మహిళా పారిశ్రామిక వేత్తల కేంద్రం (విహాబ్) పురోగతి అప్ స్టర్ పేరిట చేపట్టిన ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల శిక్షణ ప్రి ఇన్క్యుబేషన్ కార్యక్రమం మార్చి 10 న హైదరాబాద్ లో ప్రారంబం అయింది. అందులో బాగంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల ఐటి శాఖల మంత్రి కే.తారక రామా రావు తో పాటు భారత్ లోని ఆస్ట్రేలియా దేశ హై కమిషనర్ అయిన బారి ఒపెరాల్ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా 240 మంది దీనిలో మహిళా పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆస్ట్రేలియా తో భాగస్వామ్య ఒప్పంద౦ ను కుదుర్చుకున్న తెలంగాణా :
ఎవరు: ఆస్ట్రేలియా తో
ఎప్పుడు: మార్చి 11
ఆఫ్రికా లోనే ప్రసిద్ద అవార్డును గెలుచుకున్న నైజర్ దేశ అద్యక్షుడు మహామదా ఇస్సౌఫా :
నైజర్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు మహమదౌ ఇస్సోఫౌ, ఆఫ్రికన్ లీడర్‌షిప్‌లో చోటు సాధించినందుకు గాను 2020 ఇబ్రహీం బహుమతిని గెలుచుకున్నారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లీడర్ షి కు ఇచ్చే బహుమతి 5 మిలియన్ డాలర్లు. కాగ దీనిని ప్రపంచంలోని పేద ఖండంలో సుపరిపాలనను ప్రోత్సహించడానికి సుడానీస్ బిలియనీర్ మో ఇబ్రహీం అనే ఫౌండేషన్ 2006 లో ప్రవేశపెట్టి౦ది. కాగా ఇప్పటి వరకు అవార్డులు పొందిన వారిలో ఇబ్రహీం బహుమతిని పొందిన ఆరవ విజేతగా ఈయన నిలిచారు. 69 ఏళ్ల ఇసౌఫౌ రెండు పర్యాయాలు పదవిలో పనిచేసిన తరువాత ఏప్రిల్ 2021 లో నైజర్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొబోతున్నారు. మొదట 2011 లో పదవీ బాధ్యతలు స్వీకరించారు, తరువాత 2016 లో తిరిగి ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆఫ్రికా లోనే ప్రసిద్ద అవార్డును గెలుచుకున్న నైజర్ దేశ అద్యక్షుడు మహామదా ఇస్సౌఫా
ఎవరు: మహామదా ఇస్సౌఫా
ఎప్పుడు: మార్చి 11
యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ఛైర్మన్‌గా తిరిగి నియమితులయిన గిరీష్ ముర్ము :
ప్రస్త్తుత భారత దేశ కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (సిఎజి), గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మును 2021 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి యొక్క ఎక్స్ టర్నల్ ఆడిటర్ల ప్యానెల్ ఛైర్మన్‌గా ఆయనను తిరిగి నియమించారు. దీనికి ముందు, 2020 అలాగే మిస్టర్ గిరీష్ ముర్ము ప్యానెల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు . ప్రస్తుతం, ప్యానెల్‌లో భారత్, జర్మనీ, చిలీ, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఘనా, ఇండోనేషియా, కెనడా మరియు రష్యా 13 దేశాలు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: యుఎన్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ఛైర్మన్‌గా తిరిగి నియమితులయిన గిరీష్ ముర్ము
ఎవరు: గిరీష్ ముర్ము
ఎప్పుడు: మార్చి 11
వరి పంట పర్యవేక్షణ కు ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ దేశ సంస్థ జక్సా :
వరి పంటకు అనువైన భూములు గుర్తించేదుకు పంట పర్యవేక్షణ వాతావరణం లో ని గాలులు వాస్తవిక స్థితి ని గుర్తించేందుకు భారతీయ అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో జపాన్ దేశ అంతరిక్ష సంస్థ జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజన్సీ (జాక్సా) ఒప్పందమ కుదుర్చుకున్నాయి.బెంగళూర్ లోని ఇస్రో కేంద్రం లో గురువారం నిర్వహించిన వర్చువల్ సమావేశం లో ఇస్రో చైర్మన్ కే.శివన్ జాక్సా చైర్మన్ హిరోపి యుమకావా ఒప్పంద తీర్మానం చేసారు.కక్ష్య నుంచి భూమి పర్యవేక్షణకు చంద్రునిపై ప్రయోగాలకు సంబంధించి ఈ రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి.2024 లో రోబోటిక్ చంద్ర మండల యాత్ర ది లునార్ పోలార్ ఎక్స్ ప్లోరేషన్ మిషన్ లు ఎఫెక్ట్ చంద్రుని దక్షిణ దృవ అన్వేషణ ల కోసం పంపే రోవర్ ల్యండర్ ల తయారీ లోని ఇరు సంస్థల సాంకేతికతను సమన్వయ పరచనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: వరి పంట పర్యవేక్షణ కు ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకున్న జపాన్ దేశ సంస్థ జక్సా
ఎవరు: జపాన్ దేశ సంస్థ జక్సా తో ఇస్రో
ఎప్పుడు: మార్చి 11
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |