Daily Current Affairs in Telugu 10-03-2021
ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి గా బాద్యత లు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ :
ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా పౌరి గర్హ్వాల్ నుండి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉన్న తీరత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బాద్యత లు చేపట్టారు.. రాజీనామా చేసిన అవుట్గోయింగ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ విషయాన్ని ప్రకటించారు. తీరత్ సింగ్ రావత్ ను ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తీరత్ సింగ్ రావత్ 2013-15లో ఉత్తరాఖండ్‌లో పార్టీ చీఫ్‌గా ఉన్నారు మరియు గతంలో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ సహా ప్రముఖ అభ్యర్థుల పేర్లను పరిశీలించగా ఆయన పేరును ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి గా బాద్యత లు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ :
ఎవరు: తీరత్ సింగ్ రావత్
ఎక్కడ: ఉత్తరాఖండ్ రాష్ట్రo
ఎప్పుడు:మార్చి 10
బిడబ్ల్యుఎఫ్ టోర్నీ స్విస్ ఓపెన్ సూపర్ 300లో రజత పతకం గెలుచుకున్న పివి సింధు :
స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన మహిళల సింగిల్స్ ఈవెంట్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన ఏస్ షట్లర్ పివి సింధు బిడబ్ల్యుఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 లో రజత పతకం సాధించాడు కాగా పురుషుల సింగిల్స్ లో విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్) కున్లావుట్ విటిడ్సర్న్ (థాయ్‌లాండ్) ను ఓడించింది. మహిళల సింగిల్స్ లో కరోలినా మారిన్ (స్పెయిన్) ని పివి సింధు (ఇండియా) ను ఓడించింది. మరియు పురుషుల డబుల్స్ లో కిమ్ ఆస్ట్రప్, అండర్స్ స్కారుప్ రాస్ముసేన్ (డెన్మార్క్) మార్క్ లాంస్‌ఫస్-మార్విన్ సీడెల్ (జర్మనీ) ). మిక్స్‌డ్ డబుల్స్ తామ్ గిక్వెల్-డెల్ఫిన్ డెల్రూ (ఫ్రాన్స్) డెన్మార్క్ దేశ జట్టు అయిన మాథియాస్ క్రిస్టియన్-అలెగ్జాండ్రా బోజేను ఓడించాడు
క్విక్ రివ్యూ:
ఏమిటి: బిడబ్ల్యుఎఫ్ టోర్నీ స్విస్ ఓపెన్ సూపర్ 300లో రజత పతకం గెలుచుకున్న పివి సింధు :
ఎవరు: పివి సింధు
ఎప్పుడు: మార్చి 10
టేరిటోరియల్ ఆర్మీ టీ.ఏ లో నియమితులైన తొలి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ :
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అరుదైన గౌరవం సాధించారు.ప్రాదేశిక సైన్యం (టేరి టోరియల్ ఆర్మీ టీ.ఏ)లో కెప్టెన్ గా నియమిథులయిన తొలి మంత్రిగా నిలిచారు.హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఠాకూర్ 2016 జూలై లో టీ.ఏలోకి లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. తాజాగా ఆయన 124 సిక్కు రెజిమెంట్ లోకి కెప్టెన్ గా పదోన్నతి పొందారు. కాగా ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తo చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: టేరిటోరియల్ ఆర్మీ టీ.ఏ లో నియమితులైన తొలి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఎవరు: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ఎక్కడ: న్యూఢిల్లీ
ఎప్పుడు: మార్చి 10
కెనరా బ్యాంకు ఈడీ గా సత్యనారాయణ రాజు భాద్యతలు :
కెనరా బ్యాంకు ఎగిసిక్యూటివ్ డైరెక్టర్ గా కె. సత్య నారాయణ రాజు గారు మార్చి 10న బాధ్యతలు సవీకరించారు.విజయా బ్యాంక్ లో 1988 లో రాజు చేరారు.అది బ్యాంక్ ఆఫ్ బరోడా లో విలీనం అయ్యాక చీఫ్ జనరల్ మేజర్ స్థాయిలో పనిచేశారు. బ్రాంచ్ బ్యాంకింగ్ ,కార్పొరేట్ మరేడిట్ విభాగాల్లో ఆయనకు అనుభవం ఉంది.ఇప్పటి వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఫైనాన్షియల్ సొల్యూషన్స్ డైరెక్టర్ గా ఆయన ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: కెనరా బ్యాంకు ఈడీ గా సత్యనారాయణ రాజు భాద్యతలు
ఎవరు: సత్యనారాయణ రాజు
ఎప్పుడు: మార్చి 10
న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అథ్లెట్ :
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విజయ నగరన్ జిల్లాకు చెందిన అథ్లెట్ శ్రీను బుగధ న్యూఢిల్లీలో ఈ మారథాన్ రేసులో విజేతగా నిలిచాడు. మార్చి 7 న నరిగిన ఈ రేసులో ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పూణే కు ఈయన ప్రాతినిత్యం వహిస్తున్నాడు. ఈ 27 ఏళ్ల శ్రీను నిర్ణీత 42.195 కిలోమీటర్ల దూరాన్ని అందరి కంటే ముందు చేరుకొని స్వర్ణ పతాకం గెలుచుకున్నారు. కాగా ఈయన 2010 సంవత్సరo లో ఇండియన్ ఆర్మీ లో చేరాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: న్యూఢిల్లీ మారథాన్ రేసులో విజేతగా నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన అథ్లెట్
ఎవరు: అథ్లెట్ శ్రీను బుగధ
ఎప్పుడు: మార్చి 10
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |