Daily Current Affairs in Telugu 09-03-2021
భారత్-బంగ్లాదేశ్ దేశాల మద్య వంతెనను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :
భారత్ బంగ్లాదేశ్ దేశాల నడుమ నిర్మించిన మైత్రి సేతు ను ప్రదాని నరేంద్ర మోడి గారు మర్చి 09న ప్రారంబించారు. ఉభయ దేశాల మద్య అనుసందాన పెరగడం వల్ల స్నేహ౦తో పాటు వ్యాపారం అబివృద్ది చెందుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. త్రిపుర లోని సబ్రుం బంగ్లాదేశ్ లోని రాం ఘర్ లను కలుపుతూ సేతును మోడి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబించారు. 133 కోట్ల రూపాయల నిధులతో భారత్ కు చెందిన జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల అబిరుద్ది సంస్థ ఈ వంతెనను నిర్మించింది. దీంతో పాటు త్రిపురలోని పలు మౌలిక పతకలకు ప్రదాని నరేంద్ర మోడి గారు ఆరంబించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్-బంగ్లాదేశ్ దేశాల మద్య వంతెనను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి
ఎవరు : ప్రదాని నరేంద్ర మోడి
ఎక్కడ : భారత్-బంగ్లాదేశ్ దేశాల మద్య
ఎప్పుడు : మార్చి 09
ఐ.సి.సి. బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ :
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసి ఫిబ్రవరి నెల ఉత్తమ క్రికెటర్ గా నిలిచాడు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అద్బుతంగా రాణించిన ఈ ఆఫ్ స్పిన్నర్ టీం ఇండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ లో చేరడం లో కీలక పాత్ర పోషించాడు. ఫిబ్రవరి లోజరిగిన మ్యాచ్ లో అతడు సెంచరి సహా 176పరుగులు చేయడమే కాక 24వికెట్లు పడగొట్టారు. ఎక్కువ మంది అబిమానుల ఓట్లు అతడికే పడినట్లు ఐ.సి.సి వెల్లడించింది. జో రూట్ భారత్ తో 3 టెస్టుల్లో 333పరుగులు ఆరు వికెట్లు )వెస్టిండీస్ సంచలనం అయిన కిల్ మేయర్స్ (బంగ్లాదేశ్ పైన 395పరుగులు చేదంతో 210) కూడా అశ్విన్ తో పాటు ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు.మహిళల విభాగం లో టామీ బ్యుమంట్ (ఇంగ్లాండ్ )కు చెందిన క్రికెటర్ ఉత్తమ క్రికెటర్ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐ.సి.సి. బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
ఎవరు : రవిచంద్రన్ అశ్విన్
ఎప్పుడు : మార్చి 09
బంగ్లాదేశ్ లో తొలి సారిగా ట్రాన్స్ జెండర్ టీవి న్యూస్ రీడర్ గా నిలిచిన తష్మువ :
బంగ్లా దేశ్ దేశ రాజదాని దాకా లో మార్చి 09 న వార్తలు చదువుతున్న ఆ దేశ తొలి ట్రాన్స్ జెండర్ టీవి న్యూస్ యాంకర్ తష్మువా అనన్ శిశిర్ నిలిచింది. ట్రాన్స్ జెండర్ ల పట్ల వివక్షను తొలగించడమే లక్ష్యంగా దాకా కేంద్రంగా పనిచేసె బైశాఖి శాటిలైట్ చానల్ శిశిర్ కు వార్తలు చదివే పని అప్పగించింది. దక్షిణాసియ దేశాలలోని టీవి లో వార్తలు చదివిన తొలి ట్రాన్స్ జెండర్ శిశిర్ అవనున్నారని అని భావిస్తున్నారు. గతం లో హక్కుల కార్యకర్తగా నటి గా పని చేసిన శిశిర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బ్గంగా ఆమెకు మర్చి 08న నియామక పత్రం అందజేశారు. అనంతరం మూడు నిమిషాల నిడివి గల బులెటిన్ శిశిర్ చదివారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : బంగ్లాదేశ్ లో తొలి సారిగా ట్రాన్స్ జెండర్ టీవి న్యూస్ రీడర్ గా నిలిచిన తష్మువ
ఎవరు : తష్మువా అనన్ శిశిర్
ఎక్కడ : బంగ్లాదేశ్ లో
ఎప్పుడు : మార్చి 09
పవర్ వుమెన్ అవార్డు దక్కించుకున్న క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యరెడ్డి :
క్లిమామ్ వ్యవస్థాపకులు అల్లోల్ల దివ్య రెడ్డి ని పవర్ విమెన్ అవార్డ్ వరించింది. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ ఐన విశ్వేశ్వర్ హెగ్డే కగేరి పరిశ్రమల శాఖ మంత్రి జగదీశ్ శేట్టార్ గారి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. మర్చి 08న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్బంగా బెంగళూర్ లోని టౌన్ హాల్ లో లీడ్ ఇండియా ఫౌండేషన్ అద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్య రెడ్డి కి ఈ అవార్డు ను ప్రదానం చేసారు. కాగా ఈ అవార్డును మాజీ రాష్ట్రపతి అయిన భారత రత్న ఏ.పి.జె అబ్దుల్ కాలం అద్వర్యంలో స్థాపించిన లీడ్ ఇండియా ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని గుర్తించి ఈ అవార్డులను ఇస్తుంది. ఆవుల యొక్క సంరక్షణ తో పాటు ఆరోగ్య వంతమైన సమాజం కోసం దివ్య రెడ్డి అయిదేళ్ళ క్రితం హైదరాబాద్ లో క్లిమాం వెల్ నెస్ ఫార్మాస్ ను ప్రారంబించారు. సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం స్వచ్చమైన ఆవు పాలు వాటి ఆదారిత ఉత్పత్తులను అందజేస్తూ పలు సేవలను అందిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : పవర్ వుమెన్ అవార్డు దక్కించుకున్న క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యరెడ్డి
ఎవరు : అల్లోల దివ్యరెడ్డి
ఎప్పుడు : మార్చి 09
దేశంలోనే మొదటి సారిగా జెండర్ బేస్ బడ్జెట్ ను ప్రవెశపెడుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ :
మహిళా దినోత్సవం సందర్బంగా వివిధ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం లో ప్రారంబించి ప్రసంగించారు. మరియు అన్ని పోలిస్ స్టేషన్ లలో మహిళా హెల్ప్ డెస్క్ లను వర్చువల్ పద్దతిలో ప్రారంబించారు. మరియు 18 దిశా క్రైం సీన్ మేనేజ్ మెంట్ వెహికల్స్,900 దిశా పెట్రోలింగ్ వెహికల్స్ ను సిఎం ప్రారంబించారు. ఇదే కార్యక్రమంలో సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల కోసం 2021 సంవత్సర బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తునట్లు ప్రకటించారు. దేశంలోనే ఎక్కడ ప్రవేశ పెట్టని విదంగా మహిళా బడ్జెట్ కాన్సెప్ట్ తెస్తున్నామని సోదరిమనులకు ఎంత ఖర్చు చేస్తున్నామో తెలియ చేస్తామని చెప్పారు. కాగా ఈ విదంగా దేశంలోనే తొలి సారి గా జెండర్ బేస్డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : దేశంలోనే మొదటి సారిగా జెండర్ బేస్ బడ్జెట్ ను ప్రవెశపెడుతున్నరాష్ట్రం ఆంధ్రప్రదేశ్
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : మార్చి 09
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |