Daily Current Affairs in Telugu 04&05 July -2022
దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా తెలంగాణా డాక్టర్ ఎ నరేంద్రకుమార్ ఎంపిక :
తెలంగాణ ప్రభుత్వ వైద్యుడు మరో ఘనత సాధించారు. జాతీయ వైద్యుల దినోత్స వాన్ని పురస్కరించుకొని టాప్ డాక్టర్స్ ఇన్ సౌత్ అనే అంశంపై ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వేలో దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా డాక్టర్ ఎ నరేంద్రకుమార్ ఎంపికయ్యారు. ఈయన ప్రస్తుతం తెలంగాణలో వైద్యవిద్య అదనపు సంచాలకులు వనపర్తి బోధనా సుపత్రి సూపరింటిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు సర్వేకు సంబంధించి మొత్తం 52 వీట కాల్లో 1170 మంది వైద్యులు ఎంపిక కాగా హైద రాబాద్ నుంచి 70 మందికి ఆ జాబితాలో చోటు దక్కింది. వీరిలో 60 మంది ప్రైవేటు డాక్ట గా నరేంద్రకుమార్ ఒక్కరే ప్రభుత్వ వైద్యుడు కావడం విశేషం. దక్షిణ భారత్ లో అత్యుత్తమ వైద్యుల జాబితాలో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ఏడుగురిని ఎంపిక చేయగా అందులో నరేంద్రకుమార్ ఎంపికయ్యారు.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని ; హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కే.చంద్ర శేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణాదిన ఉత్తమ వైద్యుల్లో ఒకరుగా తెలంగాణా డాక్టర్ ఎ నరేంద్రకుమార్ ఎంపిక
ఎవరు; డాక్టర్ ఎ నరేంద్రకుమార్
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : జులై 04
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ :
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు. దేశ అసెంబ్లీకి స్పీకర్ గా వ్యవహరించనున్న అతి పిన్న వయస్కుడు గా ఈయన నిలిచాడు. ఈయన కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆయనకు మొత్తం 288 సభ్యుల్లో 145 మంది మద్దతు అవసరం. అయితే రాహుల్ నార్వేకర్ కు 164 ఓట్లు వచ్చాయి. మహావికాస్ అఘాఢీ (ఎంవీఏ) కూటమికి చెందిన శివసేన అభ్యర్థి రాజన్ సాల్విపై ఆయన విజయం సాధించారు. రాజన్ కు 106 ఓట్లు వచ్చాయి.
- మహారాష్ట్ర రాజధాని : ముంబాయ్
- మహారాష్ట్ర సిఎం :ఏక నాద షిండే
- మహారాష్ట్ర గవర్నర్ : భగత్ సింగ్ కోష్యారి
క్విక్ రివ్యు :
ఏమిటి: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్
ఎవరు;రాహుల్ నర్వేకర్
ఎక్కడ: మహారాష్ట్ర
ఎప్పుడు : జులై 04
IAU 24H ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత అథ్లెట్ లు :
కంఠీరవ స్టేడియంలో జరిగిన IAU 24H ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్ లో భారత అల్ట్రా రన్నర్లు పురుషుల వ్యక్తిగత మరియు జట్టు టైటిళ్లను గెలుచుకున్నారు బలీయమైన అమర్ సింగ్ దేవందర్ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు జులై 06న ఉదయం 8 గంటల నుండి నిర్ణీత 24 గంటలలో మొత్తం 739.959 కి.మీ.లు ప్రయాణించి సునాయాసంగా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా (628.405), చైనీస్ తైపీ (563, 591) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.ఆదివారం భారత మహిళల జట్టు పటిష్ట ప్రదర్శన కనబరిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకుని రజతం గెలుచుకున్నారు. అయితే ఆస్ట్రేలియా 607.63 కి. మీలతో మొదటి స్థానంలో నిలిచింది. చైనీస్ తైపీ 529, 082తో మూడో స్థానంలో నిలిచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: IAU 24H ఆసియా మరియు ఓషియానియా ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న భారత అథ్లెట్ లు
ఎప్పుడు : జులై 04
ఎల్డోరా బాక్సింగ్ కప్ లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న అల్ఫియా పరాన్,గీతిక :
ఎల్డోరా బాక్సింగ్ కప్ లో భారత బాక్సర్ లు అల్ఫియా పరాన్, గీతిక స్వర్ణాలతో మెరిశారు. 81 కేజీల ఫైనల్లో అల్బియా 5-0తో కంగిబయె వాను చిత్తు చేయగా 48 రేజీల తుది సమరంలో గీతిక 4-1తో సహచర బ్యార్ కలైవా జీని ఓడించింది. 51 దేజీల విభాగంలో జమునకు నిరాశ ఎదురైంది. పైనల్లో ఆమె 0-5తో ఉక్సమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడి రజతంతో సంతృప్తి పడింది. ఈ టోర్నీని వారత్ 11 పతకాలతో (2 స్వర్ణ, 2 రజత, 10 కాంస్యాలు). ముగించింది. కుల్ దీస్ సుమార్ (48 కేజీలు), అవంత దోపి (51 కేజీలు), సరిన్ 157 కేజీలు), జంగూ (32 మేలు) జ్యోతి 152 కేజీలు), సాక్షి 154 కేజీలు) సోనియా వర్ (57 లు), నీమా 163 లు) లచిత (70) 181 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎల్డోరా బాక్సింగ్ కప్ లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న అల్ఫియా పరాన్,గీతిక
ఎవరు;అల్ఫియాపరాన్,గీతిక
ఎప్పుడు : జులై 04
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి నియమకం :
యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామిగారు నియమితులయ్యారు విక్రమ్ దొరైస్వామి. ప్రస్తుతం ఆయన బంగ్లాదేశ్లో భారత రాయబారిగా ఉన్నారు. త్వరలోనే ఆయన యూకేలో అంబాసిడర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం యూకేలో రాయబారిగా ఉన్న గైత్రి ఇస్పార్ కుమార్, గత జూన్ 30న రిటైర్ అయ్యరు. దీంతో ఇస్బార్ స్థానంలో విక్రమ్ డొరస్వామి బాధ్యతలు చేపడతారు. దొరైస్వామి 1992 బ్యాచ్ కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన చైనీస్ భాష కూడా మాట్లాడగలరు. ఇంతకుముందు ఉజ్బెకిస్తాన్, దక్షిణ కొరియా, అమెరికాల్లో భారత రాయబారిగా పనిచేశారు. ప్రధానికి ప్రైవేటు సెక్రటరీగా కూడా సేవలందించారు. వియత్నాంలో భారత రాయబారిగా ఉన్న ప్రణయ్ వర్మ భూటాన్ రాయబారిగా వెళ్లనున్నారు. భూటాన్ రాయబారిగా ఉన్న రుచిరా కంబోజ్ ఐరాసలో భారత ప్రతినిధిగా సేవలందించనున్నారు. వియత్నాంలో ప్రణయ్ వర్మ స్థానంలో సందీప్ ఆర్య భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకాలకు సంబంధించి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది
క్విక్ రివ్యు :
ఏమిటి: యునైటెడ్ కింగ్డమ్ (యూకే)కు సంబంధించి భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి నియమకం
ఎవరు ; విక్రమ్ దొరైస్వామి
ఎప్పుడు : జులై 05
రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో అగ్రస్థానంలో ఉన్న ఒడిశా రాష్ట్రం :
రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం (National Food Security Act) అమలులో ఒడిశా అగ్రస్థానంలో ఉందని, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ప్రభుత్వం జులై 06న తెలిపింది. భారతదేశంలో ఆహారం మరియు పోషకాహార భద్రతపై రాష్ట్ర ఆహారమంత్రుల సదస్సు సందర్భంగా కేంద్ర ఆహార మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ గారు జాబితాను విడుదల చేశారు. కేటగిరీ రాష్ట్రాలలో (ఈశాన రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మరి మరియు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో (ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మరియు ద్వీప రాష్ట్రాలు), త్రిపుర మొదటి ర్యాంక్ పొందింది. హిమాచల్ ప్రదేశ్, సిక్కిం రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి ప్రభుత్వ ర్యాంకింగ్ ప్రకారం, ఒడిశా 0.836 స్కోర్ తో మొదటి స్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ (0.797), ఆంధ్రప్రదేశ్ (0.794) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ నాల్గవ స్థానంలో, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ, మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు మరియు జార్ఖండ్ తర్వాతి. స్థానాల్లో ఉన్నాయి. కేరళ 11వ స్థానం, తెలంగాణ (12), మహారాష్ట్ర (13), పశ్చిమ బెంగాల్ (14), రాజస్థాన్ (15) స్థానాల్లో నిలిచాయి. పంజాబ్ 16వ స్థానంలో ఉండగా, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, గోవా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- ఓడిశా రాష్ట్ర రాజధాని :భువనేశ్వర్
- ఓడిశా రాష్ట్ర సిఎం : నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ : గనేషి లాల్
క్విక్ రివ్యు :
ఏమిటి: రేషన్ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో అగ్రస్థానంలో ఉన్న ఒడిశా రాష్ట్రం
ఎవరు; ఒడిశా రాష్ట్రం
ఎప్పుడు : జులై 05
బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజయం నమోదు చేసిన కార్లోస్ సైన్డ్ :
బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022 లో ఫెరారీ కి చెందిన కార్లోస్ సైన్డ్ తన మొదటి సారి ఫార్ములా వన్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. స్పెయిన్ ఆటగాడు రెడ్ బుల్ డ్రైవర్ సెర్గియో పెరెజ్ మరియు మెర్సిడెస్ T లూయిస్ హామిల్టన్లనీ అధిగమింఛి ఈ విజయ్ సాధించాడు. కార్లోస్ సైన్డ్ తన 150వ రేసులో తన మొదటి ఫార్ములా వన్ విజయాన్ని సాధించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటీష్ గ్రాండ్ ప్రిక్స్ 2022 విజయం నమోదు చేసిన కార్లోస్ సైన్డ్
ఎవరు; కార్లోస్ సైన్డ్
ఎప్పుడు : జులై 05
నారి కో నమన్ అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం :
హిమహచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జై రాం టాకూర్ గారు రాష్ట్ర సరిహద్దుల్లోని మహిళా ప్రయాణికులకు హిమాచల్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ HRTC బస్సులలో చార్జిలపైన యాబై శాతం రాయితీని అందించడానికి నారి కో నామాన్ అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించారు.రాష్ట్రం లో మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవర్ సీమా టాకూర్ గారు రాష్ట్ర రవాణా బస్సులో అతన్ని ఈవెంట్ వేదిక వద్దకు తీసుకెళ్ళారు.హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్బంగా ఏప్రిల్ 15 న మహిళకు బస్సు చార్జిలపైన 50 శాతం రాయితిని ప్రకటించారు.
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని : సిమ్ల
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సిఎం : జై రాం ఠాకూర్
- హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ :రాజేంద్ర విశ్వనాద్ అర్లేకర్
క్విక్ రివ్యు :
ఏమిటి: నారి కో నమన్ అనే ఒక నూతన పథకాన్ని ప్రారంబించిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు; హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర౦
ఎప్పుడు : జులై 05
UK పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డును గెలుచుకున్నతనుజ నేసరి :
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) డైరెక్టర్ తనుజ నేసరికి UK పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డును ప్రదానం చేసింది.యుకె యొక్క ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ సైన్సెస్ లో భారతదేశం మరియు విదేశాలలో ఆయుర్వేద వృద్ధిని ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: UK పార్లమెంట్ ఆయుర్వేద రత్న అవార్డును గెలుచుకున్నతనుజ నేసరి
ఎవరు; తనుజ నేసరి
ఎప్పుడు : జులై 05
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |