Daily Current Affairs in Telugu 03 July -2022
2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన తొలి ఐదు దేశాలలో మొదటి స్థానం లో నిలిచిన భారత్ :
అమెరికాలో 2022 ఆర్థిక సంవ త్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం:’ ఈ త్రైమాసికంలో మొత్తం 197,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు. వీరిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా భారత్ కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్ (11,316), క్యూబా (10,689), డొమినికన్ రిపబ్లిక్ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్ లో ముందంజలో క్యూబా, ఫిలిప్పీన్స్ ఉండగా చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2022 ఆర్థిక సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన తొలి ఐదు దేశాలలో మొదటి స్థానం లో నిలిచిన భారత్
ఎవరు : భారత్
ఎక్కడ : అమెరికా
ఎప్పుడు : జులై 03
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ (2022) టైటిల్ ను గెలుచుకున్న సినీ శెట్టి :
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ (2022) టైటిల్ ను కర్ణాటకకు చెందిన మిస్ ఇండియా సినీ శెట్టి గెలుచుకున్నారు. జులై 03 ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫైనల్ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్ కు చెందిన రూజీల్ శెఖావత్ మొదటి రన్నరప్ గా నిలువగా, ఉత్తర్ ప్రదేశ్ యువతి షినాట్ చౌహాన్ ద్వితీయ రన్న రప్ గా ఎంపికయ్యారు. బాలీవుడ్ నటులు సహ దూపియా, డినో మోరియా, మలైకా అరోరా డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియో గ్రాఫర్శియమాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలి రాజ్ జ్యూరీ ప్యానెల్ గా వ్యవహరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫెమినా -వరల్డ్ (2022) టైటిల్ ను గెలుచుకున్న సినీ శెట్టి
ఎప్పుడు : జులై 03
నేషనల్ జియో సైన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త :
తెలంగాణ రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త జాతీయ స్థాయి. నేషనల్ జియో సైన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. మౌలిక భూబౌతిక శాస్త్రంలో ఆయన చేసిన పరిశోదనలకుగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన ద్రోణి శ్రీనివాస శర్మ హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశో ధన సంస్థ (ఎన్జీఆర్ ఐ) లో సీనియర్ ప్రిసెపల్ సెంటిక్ట్గా పనిచేస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ జియో సైన్స్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ రాష్ట్రానికి చెం దిన శాస్త్రవేత్త
ఎవరు : ద్రోణి శ్రీనివాస శర్మ
ఎక్కడ : తెలంగాణా
ఎప్పుడు : జులై 03
వైకహా అనే కొత్త వికలాంగుల మంత్రిత్వ శాఖను ప్రారంబించిన న్యూజిల్యాండ్ :
న్యూజిలాండ్ వైకహా అనే కొత్త వికలాంగుల మంత్రిత్వ శాఖను ప్రారంభించింది, ఇది వికలాంగులచే నిర్వహించబడుతుంది. వికలాంగుల సమస్యల మంత్రి పోటో విలియమ్స్ మంత్రిత్వ శాఖను అధికారికంగా ప్రారంభించారు. ఇదివేశంలోని మూడు అధికారిక భాషలతో మొదటి మంత్రిత్వ శాఖను అధికారిగా ప్రారంబించారు. ఇది దేశంలోనే మూడు అధికార భాషలతో మొదటి మంత్రిత్వ శాఖగా అవతరించింది. న్యూజిల్యాండ్ దెస సంకేత భాష టెరియో మావొరీ మరియు ఇంగ్లీష్ దీనికి బడ్జెట్ 2022 నుంచి 1 బిలియన్ డాలర్ ల ను నూతన౦గా కేటాయించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: వైకహా అనే కొత్త వికలాంగుల మంత్రిత్వ శాఖను ప్రారంబించిన న్యూజిల్యాండ్
ఎవరు : న్యూజిల్యాండ్
ఎప్పుడు : జులై 03
నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డులు 2021 నిగెలుచుకున్న రహదారుల మంత్రి నితిన్ గడ్కరి :
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాటు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కారి గారికి న్యుడిల్లి లో హైవే నిర్మాణం మరియు రహదారి ఆస్తుల నిర్వహణలో నిమగ్న౦ అయిన వాటాదారుల మరియు కంపెని లకు నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డులు 2021 ని అందజేశారు.ఈ ఎక్సలెన్స్ అవార్డులు 2018 లో హైవే నిర్మాణం మరియు నిర్వహణ ప్రక్రియలో వాటాదారుల ప్రోత్సహించడం మరియు వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వం స్పూర్తిని సృష్టించే లక్ష్యం తో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డులు 2021 నిగెలుచుకున్న రహదారుల మంత్రి నితిన్ గడ్కరి
ఎవరు : కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరి
ఎక్కడ : డిల్లి
ఎప్పుడు : జులై 03
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |