
Daily Current Affairs in Telugu 08-April-2022
విప్రో ఏపీఎంఈఏ సియివో గా అనిస్ చెనా నియామకం :
ఐటీ దిగ్గజం విప్రో ఏపీఎంఈఏ (ఆసియా పసిఫిక్, ఇండియా, మధ్యప్రాచ్య, ఆఫ్రికా) సీఈఓగా అనిస్ చెనా నియమితులయ్యారు. విప్రో ఎగ్జిక్యూ టివ్ బోర్డు సభ్యుడిగా సైతం ఆయన చేరనున్నారు. కన్సల్టింగ్, ఐటీ, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్లో ఆయనకు రెండు దశాబ్దాలుగా పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఇంతకు ముందు చెనా క్యాప్రెజెమినీ బిజినెస్ సర్వీసేస్ గ్లోబల్ సీఈఓగా వ్యవహరించారు. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిస్ట్రీలో సభ్యు డిగా కూడా ఉన్నారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: విప్రో ఏపీఎంఈఏ సియివో అనిస్ చెనా గా నియామకం
ఎవరు: అనిస్ చెనా
ఎప్పుడు : ఏప్రిల్ 08
నాగాలాండ్ రాష్ట్రము నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన తొళి మహిళ :
నాగాలాండ్ రాష్ట్రము నుంచి తొలిసారిగా ఫన్నాన్ కొన్యాక్ అనే మహిళ మార్చి 31 న రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈమె ఇంతకుముందు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. అధికార యునైటెడ్ డెమోక్రటిక్ అలయన్స్ (UDA) ఏకాభిప్రాయ అభ్యర్థిగా నిలిచిన నాగాలాండ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు కొన్యాక్, నాగాలాండ్ రాష్ట్రం నుండి పార్లమెంటుకు పంపబడిన మొదటి భారతీయ జనతా పార్టీ కి చెందిన సభ్యురాలు కూడా. నాగాలాండ్‌కు చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ కెజి కెన్యా యొక్క పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో ఆఎన్నిక జరగాల్సి ఉంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఒకే ఒక్క అభ్యర్థి ఉన్నందున, ఎలాంటి పోల్ నిర్వహించలేదని రిటర్నింగ్ అధికారి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్‌కు ద్వైవార్షిక ఎన్నికల అధికారి క్రువోహితువోనువో రియో ​​తెలియజేశారు. అందువల్ల, నాగాలాండ్ రాష్ట్రానికి రాజ్యసభలో ఖాళీగా ఉన్న స్థానానికి కోన్యాక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించబడిందని ఆమె తెలిపారు. ఆమె రాష్ట్రం నుండి పార్లమెంటు ఎగువ సభలో బెర్త్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.
- నాగాలాండ్ రాష్ట్ర రాజధాని : కొహిమ
- నాగాలాండ్ రాష్ట్ర సిఎం : నిఫియో రియో
క్విక్ రివ్యు :
ఏమిటి: నాగాలాండ్ రాష్ట్రము నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన తొళి మహిళ
ఎవరు: నాగాలాండ్ రాష్ట్రము
ఎక్కడ: నాగాలాండ్ రాష్ట్రము
ఎప్పుడు : ఏప్రిల్ 08
యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ తో ఒప్పందం కురుర్చుకున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ :
రక్షణ రంగంలో నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ (టీఈసీ) మార్చి 31న భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైన్యం, రక్షణ అవసరాలకు కావాల్సిన ఆయుద సామగ్రి ఉపకరణాలను తమజున్ ఎకనామిక్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం టీఈసీతో కలిసి బీడీఎల్ మిలటరీ ఉపకరణాలు, ఆయుధాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణ మరమ్మతు, ఉత్పత్తి కార్యకలాపాలను చేపడుతుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ తో ఒప్పందం కురుర్చుకున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఎవరు : భారత్ డైనమిక్స్ లిమిటెడ్
ఎప్పుడు: ఏప్రిల్ 08
ఎఫ్ఎఫ్డి ఆర్ ను విజయవంతంగా ప్రయోగించిన డి.ఆర్.డి.వో :
. సూపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లే దీర్ఘశ్రేణి క్షిపణుల రూపకల్పనలో భారత్ మరో ముందడుగు వేసింది. ఈ దిశగా ఒక రాకెట్ చోదక వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఏప్రిల్ 08న విజయవంతంగా పరీక్షించింది. ఫ్యూయెల్ డక్టెడ్ రామ్జెట్ (ఎస్ఎస్ డీఆర్) బూస్టర్ ను (ఒడిశాలోని చాందీపుర్ లో ఉన్న సమీకృత పరీక్షాఒడిశాలోని చాందీపుర్ లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి ప్రయోగించారు. గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే క్షిపణుల పరిధీని పెంచడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఫలితంగా శత్రు యుద్ధవిమానాలు, ఇతర ఆయుధ వ్యవస్థలను చాలా దూరం నుంచే సూపర్ సోనిక్ వేగంతో నేల కూల్చవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. తాజా ప్రయోగాన్ని చాడార్, టెలిమెట్రీ, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలతో నిశితంగా పరిశీలించామని వివరించాయి. ఈ సంక్లిష్ట క్షిపణి వ్యవస్థలోని అన్ని కీలక భాగాలు సక్ర మంగా పనిచేశాయని పేర్కొన్నాయి. ఎస్ఎస్ డీలర్లు హైదరాబాద్ లో రక్షణ పరిశోధన, అభివృద్ధి ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) అభివృద్ధి చేసింది. నగరం లోని రీసెర్చ్ సెంటర్ ఇమాదత్ (టరీసీఐ), పుణెలోని హెచ్ఎంటర్వెల్ వంటి ప్రయోగశాలలు ఇందులో భాగస్వామ్యం వహించాయి.
- డి.ఆర్.డి.వో పూర్తి రూపం :డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
- డి.ఆర్.డి.వో స్థాపన : 1958
- డి.ఆర్.డి.వో ప్రధాన కార్యాలయం :న్యు డిల్లి
క్విక్ రివ్యు :
ఏమిటి: ఎఫ్ఎఫ్డి ఆర్ ను విజయవంతంగా ప్రయోగించిన డి.ఆర్.డి.వో
ఎవరు: డి.ఆర్.డి.వో
ఎప్పుడు: ఏప్రిల్ 07
1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్’ను ప్రారంబించిన సిఎం పుష్కర్ సింగ్ దామి :
ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గారు అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసిన “1064 యాంటీ కరప్షన్” మొబైల్ యాప్’ను ఈ యాప్ హిందీ మరియు ఇంగ్లీషు రెండింటిలోనూ అందుబాటులో ఉందని, ఎవరైనా యాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా నంబర్ పై ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అన్ని ఫిర్యాదులు యాప్ ద్వారా నమోదు చేయబడతాయి మరియు ఆ డేటాతో పాటు పిర్యాదు దారుని యొక్క గుర్తింపు ను గోప్యంగా ఉంచుతుంది .
- ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని :డెహ్రాడూన్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ : గుర్మీత్ సింగ్
- ఉత్తరాఖండ్ రాష్ట్ర సిఎం : పుష్కర్ సింగ్ దామి
క్విక్ రివ్యు :
ఏమిటి : 1064 యాంటీ కరప్షన్ మొబైల్ యాప్’ను ప్రారంబించిన సిఎం పుష్కర్ సింగ్ దామి
ఎవరు: పుష్కర్ సింగ్ దామి
ఎక్కడ: ఉత్తరాఖండ్ రాష్ట్రము
ఎప్పుడు: ఏప్రిల్ 07
ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ పై పదేళ్ళ నిషేధం విధించిన ఆస్కార్ అకాడమి :
ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఇటీవల ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్న విల్ స్మిత్ గట్టి షాక్ తగిలింది. గత నెల 27న జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను వేదికపై కొట్టినందుకు ఆస్కార్ అకాడమీ ఏప్రిల్ 08న క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అస్కార్ తో పాటు అకాడమీ నిర్వహించే ఇతర కార్యక్రమాలకు విల్ స్మిత్ హాజరు కాకుండా పదేళ్లపాటు అతనిపైన నిషేధం విధించింది. కాగా తన భార్య జడా స్మిత్ ఆకారంపై క్రిస్ రాక్ జోకులు వేసినందుకు ఆగ్రహించిన విల్స్మెత్ అతణ్ని చెంపదెబ్బ కొట్టాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ పై పదేళ్ళ నిషేధం విధించిన ఆస్కార్ అకాడమి
ఎవరు: ఆస్కార్ అకాడమి
ఎప్పుడు: ఏప్రిల్ 08
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |