
Daily Current Affairs in Telugu 07-04-2022
ఆర్ధిక సంక్షోబంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక సలహా మండలి నియమించిన శ్రీలంక ప్రభుత్వం :

తీవ్ర ఆర్ధిక సంక్షోబంలో కొట్టు మిట్టాడుతున్న శ్రీలంక ను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది.సంక్షోభం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఆర్ధిక నిపుణులు తో సలహా మండలి ని ఏర్పాటు చేసింది.అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సహకారంతో ముందుకు సాగుతూ దేశ ఆర్థిక పరిస్థితి ని మెరుగుపరిచేందుకు ఈ మండలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఇంద్రజీత్ కుమార స్వామి ,ప్రపంచ బ్యాంక్ మాజీ ఆర్థిక వేత్త శాంత దేవ రాజన్ తదితరులను ప్రభుత్వం ఈ మండలిలో నియమించింది.అయితే అద్యక్షుడు రాజీనామా ఇంకా ఆర్ధిక మంత్రిని నియమించలేదు.అద్యక్షుడు రాజీనామా చేసి అన్ని పార్టీలతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ విపక్షాలు సూచించాయి.లేదంటే 25 మంది ఆర్ధిక నిపుణులను ప్రభుత్వంలోకి తీసుకుని వారి సూచనలతో ప్రభుత్వాన్ని నడపాలని పేర్కొన్నాయి.ఈ క్రమంలో నే ప్రభుత్వం ఆర్ధిక సలహా మండలి ని ఏర్పాటు చేసింది.
- శ్రీలక దేశ రాజధాని :కోలోంబో ,శ్రీ జయవర్దన పుర కొట్టే
- శ్రీలంక దేశ కరెన్సీ : శ్రీలంకన్ రూపీ
- శ్రీలంక దేశ ప్రదాని : గొటబాయ రాజపక్స
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆర్ధిక సంక్షోబంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక సలహా మండలి నియమించిన శ్రీలంక ప్రభుత్వం:
ఎవరు: శ్రీలంక
ఎక్కడ: శ్రీలంక లో
ఎప్పుడు: ఏప్రిల్ 07
నూతన సూపర్ టాటా న్యు అనే యాప్ ను ప్రారంబించిన టాటా సంస్థ :

కూరగాయలు కిరాణ సరకులు దుస్తులు మందులు హోటల్ గదులు విమాన టికెట్ లు బుకింగ్ లు నగదు బదిలీ వినియోగ బిల్లులు చెల్లింపులు ఇలా అన్ని సేవలు ఒకే ప్లాట్ ఫాం పైకి లబించేల రూపొందించిన సూపర్ యాప్ టాటా న్యు అనే యాప్ ను టాటా గ్రూప్ ఏప్రిల్ 07 న ఆవిష్కరించింది.దేశంలో ఈ కామర్స్ వ్యాపారం శరవేగంగా వృద్ది చెందుతున్న సమయంలో సూపర్ యాప్ తో టాటా గ్రోప్ రంగంలో కి దిగింది.అమెజాన్ ఫ్లిఫ్ కార్ట్ రిలయన్స్ జియో మార్ట్ సంస్థల తరహాలో నే ఈ యాప్ దేశీయ ఈ కామర్స్ లో కీలక పాత్ర పోషించాలని టాటా గ్రూప్ బావిస్తుంది.వినియోగ దారులకు మొదటి ప్రాదాన్యం ఇవ్వాలన్న గ్రూప్ సంప్రదాయాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక లోనే నైతికత పాటిస్తూ టాటా న్యు యాప్ ఉంటుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ .చంద్రశేఖరన్ గారు తెలిపారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: నూతన సూపర్ టాటా న్యు అనే యాప్ ను ప్రారంబించిన టాటా సంస్థ
ఎవరు: టాటా సంస్థ
ఎప్పుడు : ఏప్రిల్ 07
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రారంభం ఐన పురుషుల జాతీయ చాంపియన్ షిప్ టోర్నీ :

ప్రతిష్టాత్మక మైన హాకీ ఇండియా సీనియర్ పురుషుల జాతీయ చాంపియన్ షిప్ 2021 గాను 12 వ ఎడిషన్ ఏప్రిల్ 06,2022 న మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రారంబం అయింది.కగా ఇది 12 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ లో 28 జట్లు ఇందులో పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ యొక్క మునుపటి ఎడిషన్ ను టైటిల్ ను ఉత్తర ప్రదేశ్ హాకీ జట్టును ఓడించి హాకీ పంజాబ్ గెలుచుకుంది.
- మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని : భోపాల్
- మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ :
- మధ్యప్రదేశ్ రాష్ట్ర సిఎం : శివరాజ్ సింగ్ చౌహాన్
క్విక్ రివ్యు :
ఏమిటి: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రారంభం ఐన పురుషుల జాతీయ చాంపియన్ షిప్ టోర్నీ
ఎవరు: మధ్యప్రదేశ్
ఎక్కడ: మధ్యప్రదేశ్ లో భోపాల్
ఎప్పుడు :
ప్రపంచ ఆరోగ్య దినం గా ఏప్రిల్ 07 :

ప్రపంచ ఆరోగ్య దినం గా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 07 న జరుపుకుంటారు .1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాపన జ్ఞాపకార్థంగా 1950 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7తేదిన న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య అవగాహన దినంగా జరుపుకుంటారు, ప్రపంచ౦ లోని ప్రజలందరికి ఆరోగ్యానికి సంబంధించి అవగాహన కల్పించడానికి మరియు ప్రధాన ప్రాముఖ్యత ఉన్న ఒక నిర్దిష్ట అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించడానికి దీనిని జరుపుకుంటారు కాగా 2022 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ‘మన గ్రహం, మన ఆరోగ్యం.’గా ఉంది
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ ఆరోగ్య దినం గా ఏప్రిల్ 07
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎప్పుడు: ఏప్రిల్ 07
.
డిసిబి బ్యాంక్ MD&CEO మురళీ ఎం. నటరాజన్ పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడగించిన RBI :

డిసిబి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న మురళీ ఎం. నటరాజన్ గారి యొక్క పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆమోదం తెలిపింది అతని పొడిగించిన పదవీకాలం ఏప్రిల్ 29, 2022 నుండి ఏప్రిల్ 28, 2024 వరకు వర్తిస్తుంది. నటరాజన్ గారు ఏప్రిల్ 2009 నుండి బ్యాంక్ యొక్క ఎండి,సియివో గా పనిచేస్తున్నారు. ఆర్‌బిఐ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల పదవీకాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేసింది. మరియు 2024 నాటికి నట్రాజన్ బ్యాంక్ అధికారంలో 15 సంవత్సరాలు పూర్తి చేయనున్నారు.
- RBI యొక్క స్థాపన ; ఏప్రిల్ 01, 1935
- RBI యొక్క ప్రధాన కార్యాలయం :ముంబై (మహారాష్ట్ర)
- RBI ప్రస్తుత గవర్నర్ : శక్తి కాంత దాస్
- RBI స్థాపించింది :బ్రిటిష్ రాజ్
క్విక్ రివ్యు :
ఏమిటి: డిసిబి బ్యాంక్ MD&CEO మురళీ ఎం. నటరాజన్ పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడగించిన RBI
ఎవరు: RBI
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు: ఏప్రిల్ 07
ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ విల్ ఫ్రెండ్ సోంగా రిటైర్మెంట్ ప్రకటింపు :

ఫ్రాన్స్ దేశానికి చెందిన టెన్నిస్ స్టార్ విల్ ఫ్రెండ్ సోంగా ఆటకు రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. మే నెల లో సొంత గడ్డపైన జరిగే గ్రాండ్ స్లాం టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ లో తానూ చివరి సారిగా బరిలోకి దిగుతానని ఆటను వేలదించారు.2008 లో ఆస్త్రేలియన్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన సోంగా ప్రపంచ ర్యాంకింగ్ లో అత్యుత్తమ౦గా ఐదవ స్థానం వరకు చేరాడు.కెరీర్ లో 18 ఏటిపి టైటిల్స్ సాధించిన ఆటను కొంతకాలంగా గాయాలతో బాధ పడుతున్నాడు. దాంతో 15 వ సారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడి తప్పుకోవాలని నిశ్చయిచుకున్నాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫ్రాన్స్ టెన్నిస్ స్టార్ విల్ ఫ్రెండ్ సోంగా రిటైర్మెంట్ ప్రకటింపు :
ఎవరు: విల్ ఫ్రెండ్ సోంగా
ఎక్కడ: ఫ్రాన్స్
ఎప్పుడు: ఏప్రిల్ 07
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |