
Daily Current Affairs in Telugu 06-01-2022
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
ఐపి బడ్డి రచిత్ మస్కట్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్:

మేథో సంపత్తి హక్కుల అవగాహన కల్పించేందుకు రూపొందించిన ఐపి బడ్డి రచిత్ మస్కట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటి ఆర్ గారు జనవరి 06న తన మంత్రి వర్గ సహచరులతో కలిసి ఆవిష్కరించారు. హైదరాబాద్ లో మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అబివృద్ది కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు ,సబితా రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ మల్లా రెడ్డి సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .డిల్లి పబ్లిక్ స్కూల్ తెలంగాణ వాణిజ్య పారిశ్రామిక సంఘాల సహకారంతో రిజల్యూట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐపీ4ఆల్ పేరుతో ఈ వేదికను ఏర్పాటు చేసింది. సృజనాత్మకత, ఆవిష్కరణలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కుల రక్షణకు ఈ వేదిక కృషి చేయనున్నది. మేధో సంపత్తి హక్కుల విద్యార్థులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు, ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పారిశ్రామిక అంతర్గత వాణిజ్యాభివృద్ధి శాఖ గత డిసెంబర్ 8న జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించినది తెలిసిందే. దీనిలో భాగంగా 8-12 తరగతులకు 10లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఐపీ బడ్డీ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మార్చి నెలాఖరు నాటికి 10 వేల మందికి ఐపీ అంబాసిడర్లుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని నిర్ణయించారు.
- తెలంగాణ రాష్ట్ర రాజధాని :హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి : కెసిఆర్
- తెలంగాణ రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
- తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి : కే.తారక రామారావు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐపి బడ్డి రచిత్ మస్కట్ ను ఆవిష్కరించిన రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్
ఎవరు: రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కేటిఆర్
ఎక్కడ: హైదరబాద్
ఎప్పుడు: జనవరి 06
కస్టమ్స్ విషయాలలో సహకార ఒప్పందం కుదుర్చుకున్న భారత్ మరియు స్పెయిన్ దేశాలు :

కస్టమ్స్ విషయాలలో సహకారం మరియు పరస్పర సహాయానికి సంబంధించి భారతదేశం మరియు స్పెయిన్ దేశాల మధ్య ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజి గారు అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కస్టమ్స్ నేరాల నివారణ మరియు దర్యాప్తు మరియు కస్టమ్స్ నేరస్థులను పట్టుకోవడం కోసం అందుబాటులో, విశ్వసనీయమైన, శీఘ్ర మరియు తక్కువ ఖర్చుతో కూడిన సమాచారం అందించడంలో ఈ ఒప్పందం సహాయపడుతుంది
- స్పెయిన్ దేశ రాజధాని : మాడ్రిడ్
- స్పెయిన్ దేశ కరెన్సీ : యూరో
- స్పెయిన్ దేశ ప్రదాని : పెడ్రో సాంచేజ్
క్విక్ రివ్యు :
ఏమిటి: కస్టమ్స్ విషయాలలో సహకార ఒప్పందం కుదుర్చుకున్న భారత్ మరియు స్పెయిన్
ఎవరు: భారత్ మరియు స్పెయిన్ దేశాలు
ఎప్పుడు: జనవరి 06
మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ కు ఎంపికైన మిథాలి రాజ్ :

భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ వరుసగా మూడో ‘వన్డే వరల్డ్ కప్ లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో వచ్చే ప్రపంచకప్ బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్ టీమ్ కు వైస్ కెప్టెన్ వ్యవహరిస్తుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్, చేతిలో 9.పరుగులతో ఓడి రన్నరప్ గా నిలిచింది. మార్చి 4నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. మార్చి 8వ న జరిగే తమ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ తో భారత్ తలపడుతుంది. అంతకు ముందు టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు న్యూజిలాండ్ తో ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ కు ఎంపికైన మిథాలి రాజ్
ఎవరు: మిథాలి రాజ్
ఎప్పుడు: జనవరి 06
ఒడిశాలో చిలికా సరస్సు వద్ద ప్రారంబం అయిన పక్షుల గణన ప్రక్రియ :

ఒడిశాకు వలస సీజన్లో ప్రతి సంవత్సరం వచ్చే వలస పక్షుల వార్షిక పక్షుల గణన ప్రక్రియ జనవరి 06న ఆసియాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు వద్ద ప్రారంభమైంది. పూరి, గంజాం మరియు ఖోర్దా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ చిలికా సరస్సు సుమారు 1,100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 105 మంది అటవీ శాఖ అధికారులతో కూడిన 21 బృందాలు దేశీయ మరియు వలస పక్షుల గణనలో నిమగ్నమై ఉన్నారు, ఇది ఆ రోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగింది.
- ఓడిశా రాష్ట్ర రాజధాని : భువనేశ్వర్
- ఓడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి : నవీన్ పట్నాయక్
- ఓడిశా రాష్ట్ర గవర్నర్ : గణేషి లాల్
- దేశం లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు : సాంబార్ సరస్సు
- దేశంలోనే అతి పొడవైన ఉప్పు నీటి సరస్సు : చిల్క సరస్సు
- దేశంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు :ఊలార్ సరస్సు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఒడిశాలో చిలికా సరస్సు వద్ద ప్రారంబం అయిన పక్షుల గణన ప్రక్రియ
ఎవరు: ఒడిశాలో చిలికా సరస్సు
ఎక్కడ: ఒడిశాలో
ఎప్పుడు: జనవరి 06
మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందిన ప్రముఖ న్యుమరలజిస్ట్ జేసి చౌదరి :

భారతదేశపు అత్యుత్తమ న్యూమరాలజిస్ట్లలో ఒకరైన జేసి చౌదరి యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, మిడిల్ ఈస్ట్ మరియు ఇండియాతో సహా వివిధ దేశాల నుండి దాదాపు 6000 మంది వ్యక్తులకు న్యూమరాలజీని బోధించడం ద్వారా న్యూమరాలజీలో మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మరియు 2022లో మొదటి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పొందిన ప్రముఖ న్యుమరలజిస్ట్ జేసి చౌదరి
ఎవరు: ప్రముఖ న్యుమరలజిస్ట్ JC చౌదరి
ఎప్పుడు: జనవరి 06
బ్యాంక్ ఆఫ్ బరోడా కు బ్రాండ్ ఎండార్స్ గా నియమించబడిన భారతీయ మహిళ క్రికెటర్ షఫాలీ వర్మ :

బ్యాంక్ ఆఫ్ బరోడా కు భారతీయ మహిళ క్రికెటర్ ఐన క్రికెటర్ షఫాలీ వర్మను బ్యాంక్ బ్రాండ్ ఎండార్సర్ గా నియమించింది. వారి అనుబంధాన్ని ధృవీకరించడానికి బ్యాంక్ మరియు క్రికెటర్ షఫాలీ వర్మ మధ్య ఒప్పందం కుదిరింది. షఫాలీ వర్మ హర్యానాలోని రోహితకు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్. ఆమె ప్రస్తుతం భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు ఆడుతున్నది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్యాంక్ ఆఫ్ బరోడా కు బ్రాండ్ ఎండార్స్ గా నియమించబడిన భారతీయ మహిళ క్రికెటర్ షఫాలీ వర్మ
ఎవరు: భారతీయ మహిళ క్రికెటర్ షఫాలీ
ఎప్పుడు: జనవరి 06
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |