Daily Current Affairs in Telugu 19-April-2022
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.ఇందులో ఒక చైర్మన్, మరో ముగ్గురు సభ్యులకు నియమిస్తూ నియామక ఉత్తర్వులను మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ ఒరు రాధ ఏప్రిల్ 19న జారీ చేశారు. ఈ కమిషన్ చైర్మన్ గా కేసలి అప్పారావు(విజయనగరం) సభ్యులుగా జంగం రాజేంద్రప్రసాద్ (పశ్చిమగోదావరి). గొండు సీతారామ్ (విశాఖ పట్నం), కె.ఆదిలక్ష్మి త్రివర్ణ (తూర్పుగోదావరి)లను నియమించారు.కాగా వీరు మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని :అమరావతి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎం : వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎప్పుడు: ఏప్రిల్ 19
HELLO అనే కొత్త చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టిన రష్యన్ సెంట్రల్ బ్యాంక్ :
రష్యన్ సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ సంస్థల జాతీయ ఇన్వెస్టర్ HELLO అనే కొత్త చెల్లింపు వ్యవస్థను చేర్చింది.యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, జర్మన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ DEG మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి విదేశీ ఆర్థిక సంస్థల వాటాను కలిగి ఉన్న రష్యన్ వాణిజ్య బ్యాంకు ట్రాన్స్ క్యాపిటల్ బ్యాంక్, సిసమ్ చెల్లింపు మౌలిక సదుపాయాల సేవలకు ఆపరేటర్ గా ఉంటుంది.ఈ నూతన. చెల్లింపు వ్యవస్థ HELLO అనేది డబ్బు బదిలీ లావాదేవీలను సులభతరం చేసే సేవలు మరియు సంస్థల సమితిగా ఉండనుంది.
- రష్యా దేశ రాజధాని : మాస్కో
- రష్యా దేశ కరెన్సీ : రష్యన్ రూబెల్
- రష్యా దేశ అద్యక్షుడు :వ్లాదిమిర్ పుతిన్
క్విక్ రివ్యు :
ఏమిటి: HELLO అనే కొత్త చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టిన రష్యన్ సెంట్రల్ బ్యాంక్
ఎవరు: రష్యన్ సెంట్రల్ బ్యాంక్
ఎక్కడ: రష్యా
ఎప్పుడు: ఏప్రిల్ 19
జాతీయ హాకీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హర్యానా రాష్ట్ర జట్టు :
షూటౌట్‌లో తమిళనాడు రాష్ట్ర జట్టును ను 3-1 తేడాతో ఓడించి 12వ సీనియర్ పురుషుల జాతీయ హాకీ ఛాంపియన్‌షిప్‌లో హర్యానా రాష్ట్ర జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 2011 తర్వాత హర్యానా తొలిసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. హాకీ టోర్నమెంట్ ఏప్రిల్ 6 నుండి 17, 2022 వరకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. మూడవ మరియు నాల్గవ స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో కర్ణాటక 4-3 తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించింది.’
- హర్యానా రాష్ట్ర రాజధాని :చండీఘర్
- హర్యానా రాష్ట్ర సిఎం : మనోహర్ లాల్ కట్టర్
- హర్యానా రాష్ట్ర గవర్నర్ : బండారు దత్తాత్రేయ
క్విక్ రివ్యు :
ఏమిటి: జాతీయ హాకీ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన హర్యానా రాష్ట్ర జట్టు
ఎవరు: హర్యానా రాష్ట్ర జట్టు
ఎప్పుడు: ఏప్రిల్ 19
అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ రక్షణ సలహాదారుగా బాద్యతలు చేపట్టిన శాంతి సేథి :
భారతీయ మూలాలు ఉన్న అమెరికా నౌకా దళాధికారి శాంతి సేతి అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కార్యాలయంలో కార్య నిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా కీలక బాధ్య తలు చేపట్టారు. సేతి 2010 డిసెంబరు నుంచి 2012 మే నెల వరకు అమెరికన్ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్ నౌక డికోడర్ కమాండరుగా వ్యవహరించారు. ఒక అమెరికన్ యుద్ధనౌక అధిపతిగా భారత్ ను సందర్శించిన తొలి మహిళా కమాండర్ కూడా ఈవిడే. 1993లో శాంతి సీతి అమెరికా నౌకాదళంలో చేరినప్పుడు మహిళాధికారులకు పరిమిత బాధ్యతలే అప్పగించేవారు. తరవాత సంబందిత చట్టాన్ని తొలగించడంతో ఆమె కమాండర్ హోదాకు ఎదిగారు.
- అమెరికా దేశ రాజధాని :వాషింగ్టన్ డిసి
- అమెరికా దేశ అద్యక్షుడు : జో బైడెన్
- అమెరికా దేశ ఉపద్యక్షురాలు :కమల హ్యారిస్
క్విక్ రివ్యు :
ఏమిటి: అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ రక్షణ సలహాదారుగా బాద్యతలు చేపట్టిన శాంతి సేథి
ఎవరు: శాంతి సేథి
ఎక్కడ: అమెరికా
ఎప్పుడు: ఏప్రిల్ 19
ప్రపంచ 10కె బెంగకూరు మారధాన్ ప్రచారకర్తగా వ్యవహరించనున్న జస్టిన్ గాట్లిన్ :
ఒలింపిక్ ప్రపంచ ఛాంపియన్ స్వర్ణ పతక విజేత జస్టిన్ గాట్లిన్ ప్రపంచ 10కె బెంగకూరు మారధాను ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. మే 15న ఈ రేసు జరగనుంది. ఈ అమెరికా స్టార్ స్ప్రింటర్ భారత్ కు రాబోతుండడం ఇదే తొలిసారి. “కరోనా కారణంగా గత రెండేళ్లుగా అందరూ చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం. కలిసి ఉండడం ఎంత ముఖ్యమో ఈ సమయం అందరికి నేర్పింది. ప్రపంచ 102 బెంగళూరు మారదాన్ లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. భారత్ కు రావడం ఇదే తొలిసారి. ప్రతి ఒక్కరూ ఈ మారథాన్లో పాల్గొని పరుగును ఆస్వాదించాలని కోరుకుంటున్నా. ఈ రేసు ఆరంభం కోసం ఎదురు చూస్తున్నా” అని గార్డెన్ చెప్పాడు. రూ. కోటి 60 లక్షల ప్రైజ్ మనీతో భారీగా నిర్వహిస్తున్న ఈ రేసులో ప్రపంచ స్థాయి రన్నర్లతో పాటు భారత్ నుంచి భారీగా అథ్లెట్లు పాల్గొనే అవకాశం ఉంది. 2004 ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగులో పసిడి పథకం గెలిచిన టిన్ గాట్లిన్ నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు ఒలింపిక్స్ (5), ప్రపంచ ఛాంపియన్షిప్ (12)లలో కలిపి అతడు మొత్తం 17 పతకాలు నెగ్గాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచ 10కె బెంగ కూరు మారధాన్ ప్రచారకర్తగా వ్యవహరించనున్న జస్టిన్ గాట్లిన్
ఎవరు: జస్టిన్ గాట్లిన్
ఎప్పుడు: ఏప్రిల్ 19
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |