Daily Current Affairs in Telugu 12-April-2022
రెండవ సారి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన హైదరాబాద్ :
యునైటెడ్ నేషన్ లో ని అర్బర్ డే ఫౌండేషన్ మరియు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) వారి చేత అందించే గుర్తింపు లో వరుసగా రెండవ సంవత్సరం హైదరాబాద్ ను ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తించింది. 9,56,635 చెట్లను హైదరాబాద్లో 500 వాలంటీర్లతో 3,50,56,635 నాటారు. గత సంవత్సరం, హైదరాబాద్ ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన భారతదేశంలోని ఏకైక నగరంగా మారింది, అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందినది. అయితే ఈ సంవత్సరం ముంబై కూడా ఆ జాబితాలో చేరింది. 21 దేశాల నుండి 136 నగరాల పక్కన ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ మరియు కెనడా వరుసగా 37, 19 మరియు 18 నగరాలతో జాబితాలో అత్యధిక నగరాలను కలిగి ఉన్న దేశాలు, ఆరోగ్యకరమైన, స్థితిస్థాపకమైన మరియు సంతోషకరమైన నగరాలను అందించడంలో పట్టణ అడవులను పెంచడం మరియు సంతోషకరమైన నగరాలను నిర్మించడంలో పట్టణ అడవులను పెంచడం మరియు నిర్వహించడం పట్ల వారి నిబద్ధత కోసం దేశాలు గుర్తించబడ్డాయి.
- తెలంగాణా రాష్ట్ర రాజధాని :హైదరబాద్
- తెలంగాణా రాష్ట్ర సిఎం :కే.చంద్రశేఖర్ రావు
- తెలంగాణా రాష్ట్ర గవర్నర్ : తమిలసై సౌందర రాజన్
క్విక్ రివ్యు :
ఏమిటి: రెండవ సారి ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’గా గుర్తింపు పొందిన హైదరాబాద్
ఎవరు: హైదరాబాద్
ఎప్పుడు: ఏప్రిల్ 12
2026లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా లోని విక్టోరియా నగరం :
2026 కామన్వెల్త్ క్రీడలకు విక్టోరియా నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈ ఆస్ట్రేలియా రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో క్రీడలు జరుగుతాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్లు ఒక్క నగరంలోనే జరుగుతాయి. కానీ కామన్వెల్త్ క్రీడలు అందుకు భిన్నం. 2020 మార్చిలో జరిగే ఈ క్రీడలకు మెల్బోర్న్, గీలాంగ్, బెండిగో, బెండిగో, బలర్స్ తదితర నగరాలు ఆతిథ్యమిస్తాయి. అన్ని చోట్లా క్రీడా గ్రామాలు ఉంటాయి. లక్ష మంది ప్రేక్షక సామర్థ్యం గల మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ప్రారంభోత్సవం జరుగుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) ప్రకటించింది.. ఈ కామ్ ఎght Mine Pathor స్వల్త్ క్రీడల్లో ఏ ఆట ఐన దానికి సంబంధించి ప్రాథమికంగా 10 క్రీడలతో జాబితాను సిద్ధం చేశారు. ఇందులో టీ20 క్రికెట్ కూడా ఉంది. ఈ ఏడాది చివర్ లో ఈ జాబితాలో మరికొన్ని క్రీడలను చేరుస్తారు. ప్రస్తుతానికి షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ లు ఈ జాబితాలో లేవు.
- ఆస్ట్రేలియా దేశ రాజధాని : కాన్ బెర్రా
- ఆస్ట్రేలియా దేశ కరెన్సీ : ఆస్త్రేలియన్ డాలర్
- ఆస్ట్రేలియా దేశ ప్రధాని : స్కాట్ మొరిసన్
క్విక్ రివ్యు :
ఏమిటి: 20వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న ఆస్ట్రేలియా లోని విక్టోరియా నగరం
ఎవరు: విక్టోరియా నగరం
ఎప్పుడు: ఏప్రిల్ 12
ఆటకు శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించిన బెల్జియం స్టార్ టెన్నిస్ ప్లేయర్ కిమ్ క్లియర్స్ :
గతంలో రెండుసార్లు రిటైర్మెంట్ (2007, 2012) ప్రకటించి ఆ తర్వాత మళ్లీ రాకెట పట్టిన బెల్జియం మహిళా టెన్నిస్ స్టార్ కిమ్ క్లియర్స్ ఈసారి మాత్రం శాశ్వతంగా ఆట నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు తెలి పింది. గత ఏడాది ఇండియన్ వెల్స్ ఓపెన్లో చివరిసారి బరిలోకి దిగిన 38 ఏళ్ల క్లియస్టర్స్ తన కెరీర్లో నాలుగు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ను (2005, 2009, 2010-యూఎస్ ఓపెన్: 2011-ఆస్ట్రేలియన్ ఓపెన్) నెగ్గింది. తన కుటుంబంతో అమెరికాలో స్థిరపడిన -క్లియర్స్ 2003లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను అందుకుంది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ నెగ్గిన క్లియస్టర్స్ 523 మ్యాచ్ గెలి 31 మ్యాచ్ లో ఓడిపోయింది. మొత్తం 2 కోట్ల 45 లక్షల 45 వేల 194 డాలర్ల (రూ.186 కోట్లు) ప్రైజ్ మని ని సంపాదించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆటకు శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించిన బెల్జియం స్టార్ టెన్నిస్ ప్లేయర్ కిమ్ క్లియర్స్
ఎవరు: బెల్జియం స్టార్ టెన్నిస్ ప్లేయర్ కిమ్ క్లియర్స్
ఎప్పుడు: ఏప్రిల్ 12
ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2022లో అగ్రస్థానంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ :.
టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క సియివో ఐన ఎలాన్ మస్క్ పోర్భ్స్ బిలియనీర్స్ లిస్టు 2022 లో అగ్రస్థానం లో నిలిచారు.అతని మొత్తం విలువ $219 బిలియన్లు. అతని తర్వాత వరుసగా అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మరియు లూయిస్ విట్టన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ లు ఉన్నారు.భారతీయ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ $90.7 బిలియన్ల నికర విలువతో ఈ జాబితాలో అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. అతను ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉన్నాడు. జాబితాలో అగ్రశ్రేణి మహిళలు – సౌందర్య సాధనాల దిగ్గజం réal యొక్క వ్యవస్థాపకుడి మనవరాలు, ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్, 2022లో $74.8 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా జాబితా చేయబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్ 2022లో అగ్రస్థానంలో టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్
ఎవరు: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్
ఎప్పుడు:ఏప్రిల్ 12
ప్రతిష్టాత్మక 2022 O. హెన్రీ ప్రైజ్‌ను గెలుచుకున్న బెంగాలి రచయిత అమర్ మిత్ర :
బెంగాలి భాష కు చెందిన రచయిత అమర్ మిత్ర రాసిన చిన్న కథలకు గాను 2022 సంవత్సరం లో ప్రతిస్తాత్మక ఓ.హెన్రి ప్రైజ్ ను గెలుచుకున్నారు.అమర్ మిత్ర 40 సంవత్సరాల క్రితం 1977 లో గాయోన్ బురో పేరుతొ బెంగాలిలో వ్రాసిన ఒక ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ అనే శీర్షికతో గెలుపొందారు. ఈ కధనం ను సీనియర్ జర్నలిస్ట్ అనీష్ గుప్తా ఆంగ్లం లోకి అనువదించారు.మరియు 2021 లో అమెరికన్ వెబ్ మ్యాగజైన్ ది కమాన్ లో ప్రచురించబడింది. 2022 లో మొత్తం 20 మంది రచయితలకు గౌరవనియమైన బహుమతి లబించింది. కాగా ఈ హెన్రి అవార్డు అనేది ఆంగ్లం లోకి అనువదించబడిన కథలతో సహా అమెరికన్ లేదా కెనడియన్ పీరియాడికల్ లో ప్రచురించబడిన అసాదరణం అయిన ప్రతిభ కలిగిన చిన్న కథలకు ఇచ్చే వార్షిక అమెరికన్ అవార్డ్ . దీనికి అమెరికన్ లఘు కథ రచయిత ఐన ఓ.హెన్రి యొక్క పేరు నూ పెట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక 2022 O. హెన్రీ ప్రైజ్‌ను గెలుచుకున్న బెంగాలి రచయిత అమర్ మిత్ర
ఎవరు: బెంగాలి రచయిత అమర్ మిత్ర
ఎప్పుడు: ఏప్రిల్ 12
అడవి జంతువులకు చట్టపరమైన హక్కులను గుర్తించిన మొదటి దేశ౦ ఈక్వెడార్ :
ప్రపంచం వాతావరణ మార్పు మరియు జంతువుల దోపిడీతో పోరాడుతున్న సమయంలో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్, వ్యక్తిగత అడవి జంతువులు చట్టపరమైన హక్కులను గుర్తించిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. దక్షిణ అమెరికా లోని దేశం ఐన ఈక్వెడార్ అడవి జంతువులకు చట్టబద్ధమైన హక్కులను కల్పించిన ప్రపంచంలోనే మొదటి దేశం గా నిలిచింది. జంతువులు ప్రకృతి హక్కుల ద్వారా రక్షించబడిన హక్కులకు లోబడి ఉంటాయని కోర్టు చివరకు పేర్కొన్నది.
- ఈక్వెడార్ దేశ రాజధాని : క్విటో
- ఈక్వెడార్ దేశ అద్యక్షుడు : గుయిలెర్మో లెస్సో
క్విక్ రివ్యు :
ఏమిటి: అడవి జంతువులకు చట్టపరమైన హక్కులను గుర్తించిన మొదటి దేశ౦ ఈక్వెడార్
ఎవరు: ఈక్వెడార్
ఎప్పుడు: ఏప్రిల్ 12
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |