Daily Current Affairs in Telugu 13&14-10-2021
Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question
వరల్డ్ స్టీల్ ఆసోసియేషన్ ఛైర్మ న్గా జేఎన్.డబ్లూ చైర్మన్, మేనేజింగ్ డైరె క్టర్ సజ్జన్ జిందాల్ ఎన్నిక :
వరల్డ్ స్టీల్ ఆసోసియేషన్ ఛైర్మన్ గా జేఎన్.డబ్లూ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ గారు ఎన్నికయ్యారు. బెల్జియం కేంద్రంగా పనిచేసే ప్రతిష్టాత్మక ఉక్కు సంఘానికి చైర్మన్గాగా నియమితులైన మొదటి భారతీయుడు జిందాల్ కావడం విశేషం. వైస్ చైర్మన్లుగా హెచ్బీఐఎస్ గ్రూప్ నకు చెందిన యూ యాంగ్, పోస్కో జియాంగ్ వూ డోయ్లు పనిచేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో టాటా స్టీల్ సీఈఓ టీవీ సరేంద్రన్, ఆర్సెలార్ మిత్తల్ చీప్ ఎల్ఎన్ నియమితులయ్యారు. కోశాధికారిగా బ్లూస్కోప్ స్టీల్ కు చెందిన మార్క్ వాసెల్లా, ఇంటర్నేషనల్ స్టెయిన్లెస్ స్టీల్ ఫోరమ్ చైర్మన్ గా టీయో డియో డి మాలో ఎన్నికయ్యారు.(బోర్డు సభ్యులు 16 మందితో ఎగ్గ్సిక్యూటివ్ కమిటీని సైతం ఎన్నుకుంది. ఇందుల జిందాల్ కూడా ఉన్నాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: వరల్డ్ స్టీల్ ఆసోసియేషన్ ఛైర్మ నగా జేఎన్.డబ్లూ చైర్మన్, మేనేజింగ్ డైరె క్టర్ సజ్జన్ జిందాల్ ఎన్నిక
ఎవరు: సజ్జన్ జిందాల్
ఎప్పుడు: అక్టోబర్ 14
ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ దక్కించుకున్న భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల :
మైక్రోసాఫ్ట్ సీఈఓ. భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లకు గ్లోబల్ ఓజినెస్ సస్టెయినబిలిటీ లీడరెప్ విభాగంలో ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ దక్కింది. భార తీయ అమెరికన్ అయిన ప్రహ్లాద్ గౌరవార్థం 2010లో కార్పొ రేట్ ఈకో పౌరమ్ (సీ ఈఎస్) ఏర్పాటు చేసిన ఈ అవార్డును అంతర్జాతీయ ప్రైవేటు రంగంలో పర్యావరణహిత కార్యక్రమాలను అసాధారణ రీతిలో, వినూతృతతో నిర్వహిస్తూ, దీర్ఘకాల వ్యాపార విజయాలను కలిగి ఉన్న వారికి ఇస్తుంటారు. నాదెళ్లతో పాటు మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్, వైస్ వైర్ బ్రాడ్ స్మిత్. సీఎస్ఇ అమీ హుడ్ లీప్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ లుకాస్ జొప్పలు కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2030 కల్లా కర్బన రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్ ని మార్చడం. 2050 కల్లా చరిత్రాత్మక ఉదార్థాలన్నిచేసి తొలగించాలన్న పంతో కట్టుగా పనిచేస్తున్నందుకు ఈ ప్రఖ్యాత అవార్డు దక్కింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రఖ్యాత సీకే ప్రహ్లాద్ అవార్డ్ దక్కించుకున్న భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల
ఎవరు: సత్య నాదెళ్ల
ఎప్పుడు: అక్టోబర్ 14
అంతర్జాతీయ ఫుట్ బాల్లో పది హ్యాట్రిక్లు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్ గా క్రిస్తియానో రోనాల్డో రికార్డ్ :
అంతర్జాతీయ ఫుట్ బాల్లో పది హ్యాట్రిక్లు నమోదు చేసిన తొలి ఆటగాడిగా ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో రికార్డు సృష్టించాడు. 2022 ప్రపంచకప్ గ్రూప్-ఎ క్వాలిఫ యింగ్ మ్యాచ్ లో లక్సెంబర్గ్ లో మ్యాచ్ లో రొనాల్డో చెలరేగడంతో పోర్చుగుల్ 5-0తో ఘన విజయం సాధించింది. రెండు పెనాల్టీలను గోల్ గా మలిచిన రొనాల్డో ఆఖర్లో నమోదు చేశాడు. ఫుట్బాల్ కెరీర్లో అతడు హ్యాట్రిక్ నమోదు చేయడం అతడికి 58వసారి కావడం విశేషం.
క్విక్ రివ్యు :
ఏమిటి: అంతర్జాతీయ ఫుట్ బాల్లో పది హ్యాట్రిక్లు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచిన ప్లేయర్ గా క్రిస్తియానో రోనాల్డో రికార్డ్
ఎవరు: క్రిస్తియానో రోనాల్డో
ఎప్పుడు: అక్టోబర్ 14
22 వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును గెలుచుకున్న డాక్టర్ రణ్ దీప్ గులేరియా :
డాక్టర్ రణ్ దీప్ గులేరియా 22 వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును అందుకున్నారు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు 22 వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారాన్ని ప్రముఖ పల్మోనాలజిస్ట్ మరియు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఉపరాష్ట్రపతి నివాసంలో ప్రదానం చేశారు. మరియు AIIMS లో పల్మనరీ మెడిసిన్ మరియు స్లీప్ డిజార్డర్స్ విభాగాన్ని పెంపొందించడంలో, డాక్టర్ గులేరియా తన ఎంచుకున్న రంగంలో తన అద్భుతమైన పనికిగాను విస్తృతంగా గౌరవించబడ్డాడు మరియు అత్యంత సమర్థవంతమైన మరియు అంకితభావంతో ఉన్న ఆసుపత్రి నిర్వాహకుడిగా కూడా ప్రసిద్ధి చెందాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: 22 వ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డును గెలుచుకున్న డాక్టర్ రణ్ దీప్ గులేరియా
ఎవరు: డాక్టర్ రణ్ దీప్ గులేరియా
ఎప్పుడు: అక్టోబర్ 14
జైపూర్‌లో ప్రారంభ౦ అవనున్న భారతదేశపు మొట్టమొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ :
భారతదేశపు మొట్టమొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ జైపూర్‌లో ప్రారంభించబడింది భారతదేశపు మొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC) వివేకానంద గ్లోబల్ యూనివర్సిటీ, జైపూర్ (VGU) లో ప్రారంభించబడింది. భారత ప్రభుత్వం, అటల్ ఇన్నోవేషన్ మిషన్ (AIM) మరియు NITI ఆయోగ్ ద్వారా ఏర్పాటు చేయబడిన దేశంలో ఇది మొట్టమొదటి కేంద్రంగా ఉంటుంది. ACIC పెద్ద ఆలోచనల ఆకృతిని మరియు సమాజాన్ని మార్చడానికి సహాయపడే వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడం మరియు పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది..ఈ కేంద్రం అటల్ ఇన్నోవేషన్ మిషన్, NITI ఆయోగ్ మరియు VGU ల యొక్క సంయుక్తంగా ప్రారంభించబడింది, రాజస్థాన్‌లోని కష్టపడి పనిచేసే, ఉద్వేగభరితమైన మరియు ధైర్యవంతులైన వ్యాపారవేత్తలకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది
క్విక్ రివ్యు :
ఏమిటి: జైపూర్‌లో ప్రారంభ౦ అవనున్న భారతదేశపు మొట్టమొదటి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్
ఎక్కడ: జైపూర్‌లో
ఎప్పుడు: అక్టోబర్ 14
ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ పైజ్ పోటీకి ఎంపికైన ఝార్కాండ్ కు చెందిన సీమా కుమారి :
ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ పైజ్ పోటీకి ఓ బాలిక ఎంపికైంది. లండన్ లోని చెగ్ ఎక్ట్రిక్ సంస్థ నిర్వ హించే ఈ పోటికి 94 దేశాల నుంచి 3500కు పైగా నామినేషన్లు రాగా అందులో ఝార్ఖండ్ కు. చెందిన సీమా కుమారి (18)ను తుది 10 మంది జాబితాలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఉపకార వేతనంపై హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సీమా కుమారి గతంలో బాల్యవివాహం బారి నుంచి బయటపడిన బాలిక కావడం గమనార్హం. పేదరికం కారణంగా చిన్న తనంలోనే ఫుట్బాల్ కోచ్ గా మారి తన సంపాదనతోనే చదువుకుంది. గ్లోబల్ స్టూడెంట్ పోటీలో ఆమె విజే తగా నిలిస్తే లక్ష డాలర్ల నగదు బహుమతి ఇస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టూడెంట్ పైజ్ పోటీకి ఎంపికైన ఝార్కాండ్ కు చెందిన సీమా కుమారి
ఎవరు: సీమా కుమారి
ఎప్పుడు: అక్టోబర్ 14
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సభ్యుల జాబితాలో చేరిన భారత్ :
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యు.ఎన్.హెచ్ఆర్సి) లోని 18 కొత్త సభ్యుల కోసం అక్టోబర్ 14న నిర్వహించిన ఎన్నికల్లో భారత్ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఐరాస సర్వప్రతినిధి సభలోని 193 దేశాల్లో 184 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 2022 జనవరి నుంచి 2024 డిసెంబరు ఆఖరు వరకు మూడేళ్ల పాటు ఈ మండలిలో సభ్యత్వాన్ని భారత్ కలిగి ఉంటుంది. యు.ఎన్.హెచ్ఆర్సి కి భారత్ ఎన్నిక కావడం ఇది ఆరోసారి. మొత్తం 47 మంది సభ్యులు దీనిలో ఉంటారు. భారత్ ప్రస్తుత సభ్యత్వ పదవీ కాలం ఈ ఏడాది డిసెం బరు 31తో ముగియనుంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి భారతో పాటు కజక్ స్థాన్, మలేసియా, కతర్, యూఏఈ ఇందులో సభ్య దేశా లుగా ఎన్నికయ్యాయి.
- యు.ఎన్.హెచ్ఆర్సి పూర్తి రూపం :యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
- యు.ఎన్.హెచ్.ఆర్.సి స్థాపన :2006 మార్చ్ 15
- యు.ఎన్.హెచ్ ఆర్సి ప్రెసిడెంట్ : నజాత్ శమీన్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సభ్యుల జాబితాలో చేరిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు: అక్టోబర్ 14
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |