Daily Current Affairs in Telugu 29-09-2021

Daily Current Affairs in Telugu 29-09-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

టునీసియా దేశ తొలి మహిళా ప్రధానిగా రౌద బౌడెంట్ రమధానే నియామకం :

టునీసియాదేశ తొలి మహిళా ప్రధానిగా రౌద బౌడెంట్ రమధానేను నియమిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కౌస్ సాయిద్ సెప్టెంబర్ 29న ప్రక టించారు. ఆర్థిక, సామాజిక సంక్షోభాల నుంచి దేశాన్ని కాపా డాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. జులై 25న పార్లమెంటును రద్దు చేయడంతోపాటు కార్యనిర్వాహక అధికారాలను ఆ దేశ అధ్యక్షుడు సాయిద్ తన ఆధీనంలోకి తీసుకోవ డంతో అప్పటి నుంచి టునీసియాకు ప్రధానమంత్రి లేరు. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ స్కూల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాధాను ప్రధాని పదవికి ఎంపికచేసి అధ్యక్షుడు అందరినీ ఆశ్చర్యపరిచారు.

  • ట్యునిసియా దేశ రాజధాని : టునిష్
  • ట్యునిసియ దేశ కరెన్సీ :తునిసియన్ దినార్

క్విక్ రివ్యు :

ఏమిటి : టునీసియా మహిళా తొలి  ప్రధానిగా రౌద బౌడెంట్ రమధానేను నియామకం

ఎవరు : రౌద బౌడెంట్ రమధానే      

ఎప్పుడు : సెప్టెంబర్ 29

భారత్ లోని లైఫ్ సంస్థకు దక్కిన అంతర్జాతీయ పురస్కారం :

నోబెల్ పురస్కారంతో సమానమైనదిగా భావించే రైట్ లైవ్లీహుడ్ అవార్డు’కు భారత్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఓ సంస్థ మరో ముగ్గురితో కలిసి ఎంపికైంది. ఈమేరకు ‘లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ (లైఫ్)’ సంస్థ ఎంపికైనట్లు స్వీడన్ కు చెందిన రైట్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ సెప్టెంబర్ 29న ప్రకటించింది. అంతర్జాతీయంగా సంస్థలు, వ్యక్తు లకు ఇచ్చే ఈ అవార్డును పంచుకుంటున్న మిగతా ముగ్గురిలో కెనడాకు చెందిన స్వదేశీ హక్కుల ప్రచారకర్త ఫ్రెడా హ్యూసన్, బాలికలపై లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న కామెరూన్ కు చెందిన మార్థ్ వాన్ డౌ, రష్యన్ పర్యావరణ ప్రచారకర్త వ్లాదిమిర్ స్లివ్యక్లు ఉన్నారు. 1980లో స్వీడిష్-జర్మన్ వితరణశీలి జాకోబ్ వోన్ ఉయెక్సుకుల్ ఈ అవార్డును స్థాపించారు. విజేతలకు స్వీడన్ కరెన్సీలో 1 మిలియన్ క్రౌనోర్ (దాదాపు రూ.85. 75 లక్షలు) నగదు అందిస్తారు. ఈమేరకు డిసెంబరు 1న వర్చువల్ గా అవార్డ్ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ అవార్డుకు గాను 2021లో 89 దేశాల నుంచి వచ్చిన 206 నామినీలను పరిశీలించినట్లు ఫౌండేషన్ తెలిపింది. భారత్ లో లైఫ్ సంస్థను 2005లో న్యాయవాదులు రిత్విక్ దత్తా, రాహుల్ చౌధరీలు స్థాపించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : భారత్ లోని లైఫ్ సంస్థకు దక్కిన అంతర్జాతీయ పురస్కారం

ఎవరు : ‘లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ (లైఫ్)’ సంస్థ

ఎక్కడ : స్టాక్ హోం

ఎప్పుడు : సెప్టెంబర్ 29

జపాన్ దేశ తదుపరి ప్రదాని గా భాద్యతలు చేపట్టనున్న పుమియో కిశిధ  :

జపాన్ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి పుమియో కిషిద ఆ దేశ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది సెప్టెంబర్ 29ననిర్వహించిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన. విజయం సాధించారు. జపాన్ పార్లమెంట్  నేషనల్ డైట్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ,కి దాని మిత్ర పక్షానికి తగిన ఆధిక్యముంది. అందువల్ల పుమియో కిషిద ప్రధానిగా ఎన్నికవడం తథ్యంగా మారింది. కరోనా టీకాల కార్యక్రమంలో మంత్రి టారో కోనో కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా తగిన మద్దతు సాధించలేకపోయారు. టారో పేర్కొనే మార్పుల కంటే స్థిరత్వమే ప్రధానమని భావించే కిషిదకే పార్టీలోని దిగ్గజ నేతలంతా మద్దతు ఇచ్చి నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. అదే సమయంలో కోనో నిరంతరం విభిన్నంగా ఆలోచిస్తుంటారనేది సుస్పష్టం. టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహణ, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రస్తుత ప్రధాని షిహిదె సుగా పాటించిన విధానాల పై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి .

  • జపాన్ దేశ రాజధాని : టోక్యో
  • జపాన్ దేశ అద్యక్షుడు : షింజో అబే
  • జపాన్ దేశ కరెన్సీ : యెన్

క్విక్ రివ్యు :

ఏమిటి : జపాన్ దేశ తదుపరి ప్రదాని గా భాద్యతలు చేపట్టనున్న  పుమియో కిశిధ

ఎవరు : పుమియో కిశిధ

ఎక్కడ : జపాన్

ఎప్పుడు : సెప్టెంబర్ 29

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్రికెట్ హెడ్ గా నియమితులయిన తానియా మల్లిక్ :

పాకిస్తాన్ దేశ మాజీ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఐన తానియా మల్లిక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB)  క్రికెట్ హెడ్ గా నియమితులయ్యారు. ఆమె అక్టోబర్ 1, 2021 నుండి మహిళా క్రికెట్ హెడ్ గా తన విధులను నిర్వర్తిస్తుంది. 1986 లో సియోల్ ఆసియన్ గేమ్స్ లో  పాకిస్తాన్ దేశం తరపున  ప్రాతినిధ్యం వహించి, 1987-88లో జాతీయ ఛాంపియన్ గా  నిలిచింది.

  • పాకిస్తాన్ దేశ రాజధాని : ఇస్లామాబాద్
  • పాకిస్తాన్ దేశ ప్రదాని : ఇమ్రాన్ ఖాన్
  • పాకిస్తాన్ దేశ అద్యక్షుడు : ఆరిఫ్ ఆల్వి
  • పాకిస్తాన్ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ : రమీజ్ రజా

క్విక్ రివ్యు :

ఏమిటి : పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్రికెట్ హెడ్ గా నియమితులయిన తానియా మల్లిక్

ఎవరు : తానియా మల్లిక్

ఎక్కడ : పాకిస్తాన్

ఎప్పుడు : సెప్టెంబర్ 29

స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేసిన దేశంగా నిలిచిన స్విట్జర్ ల్యాండ్ :

ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీతో స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి స్విట్జర్లాండ్  దేశం అంగీకరించింది. దేశవ్యాప్త౦గా జరిగిన  ప్రజాభిప్రాయ సేకరణలో 64.1 శాతం మంది ఓటర్లు స్వలింగ వివాహానికి అనుకూలంగా ఓటు వేశారు. స్వలింగ వివాహాలను స్వీకరించిన ప్రపంచంలోని 30 వ దేశం స్విట్జర్లాండ్గా నిలిచింది., మరియు అలా చేసిన చివరి పశ్చిమ ఐరోపా దేశాలలో ఈ దేశం  ఒకటి.  2001 సంవత్సరం లో ఈ చట్టం చేసిన దేశం నెదర్ల్యాండ్  మొదటి స్థానం లో ఉంది .

  • స్విట్జర్ ల్యాండ్ దేశ రాజధాని : పెర్న్
  • స్విట్జర్ ల్యాండ్ కరెన్సీ : స్విస్ ఫ్రాంక్

క్విక్ రివ్యు :

ఏమిటి : స్వలింగ జంటల వివాహాన్ని చట్టబద్ధం చేసిన దేశంగా నిలిచిన స్విట్జర్ ల్యాండ్

ఎవరు : స్విట్జర్ ల్యాండ్

ఎప్పుడు : సెప్టెంబర్ 29

Daily current affairs in telugu September- 2021
Daily current affairs in telugu 01-09 -2021
Daily current affairs in telugu 02-09 -2021
Daily current affairs in telugu 03--09 -2021
Daily current affairs in telugu 04-09 -2021
Daily current affairs in telugu 05-09 -2021
Daily current affairs in telugu 06-09 -2021
Daily current affairs in telugu 07-09 -2021
Daily current affairs in telugu 08-09-2021
Daily current affairs in telugu 09-09 -2021
Daily current affairs in telugu 10-09 -2021
Daily current affairs in telugu 11-09 -2021
Daily current affairs in telugu 12-09 -2021

Daily current affairs in telugu 13-09 -2021
Daily current affairs in telugu 14-09 -2021
Daily current affairs in telugu 15-09 -2021
Daily current affairs in telugu 16-09 -2021
Daily current affairs in telugu 17-09 -2021
Daily current affairs in telugu 18-09 -2021
Daily current affairs in telugu 19-09 -2021
Daily current affairs in telugu 20-09 -2021
Daily current affairs in telugu 21-09 -2021
Daily current affairs in telugu 22-09 -2021
Daily current affairs in telugu 23-09 -2021
Daily current affairs in Telugu 24-09 -2021
Daily current affairs in Telugu 25-09 -2021
Daily current affairs in Telugu 26-09 -2021
Daily current affairs in Telugu 27-09 -2021
Daily current affairs in Telugu 28-09 -2021
Daily current affairs in Telugu 29-09 -2021
Daily current affairs in Telugu 30-09 -2021

Download Manavidya app

For Online Exams in Telugu online exams in telugu

Click here

To Join Whats app

Click here

To Join Telegram Channel

Click here

To Subscribe Youtube

Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *